simhadri Posted December 8, 2015 Report Posted December 8, 2015 అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ వ్యవహార శైలి మరోసారి తెరమీదకు వచ్చింది. బాలయ్య పీఏ తీరుపై సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సొంత నియోజకవర్గంలోనే టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది. చిలమత్తూరు టీడీపీ మండల కన్వీనర్ రంగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. పీఏ శేఖర్ తీరుకు నిరసనగా రంగారెడ్డి రాజీనామా చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కూడా శేఖర్ అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ కరపత్రాల పంపిణీ జరిగిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఎలాంటి హోదా లేకపోయినా అధికార, అనధికార కార్యక్రమాల్లో తానే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ పాల్గొనడంతో పాటు స్థానిక నేతలను ప్రాధాన్యత ఇవ్వకపోవడం ...పీఏ తీరును స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు.
Recommended Posts