Jump to content

Peddalaku Mathrame--Sfw


Recommended Posts

Posted

విచారణ జరిగిన తీరు దారుణంగా వున్నప్పుడు, అనేక లూప్‌ హోల్స్‌కి అవకాశమిచ్చినప్పుడు, ఈ వ్యవహారంలో న్యాయం జరుగుతుందని ఎలా అనుకోగలం.? మన దేశంలో న్యాయస్థానాలకి సాక్ష్యాలు కావాలి. అవి లేనప్పుడు చేయగలిగిందేమీ లేదని సల్మాన్‌ఖాన్‌ విషయంలో నిరూపితమయ్యింది. అయితే, జరిగిన ఘటన వాస్తవం. ఆ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడన్నది వాస్తవం. ఇదే నెటిజన్లకు ఆగ్రహం కలిగించింది. 

కొన్నాళ్ళ క్రితం తెలుగు గడ్డ మీద ఇలాంటి విచిత్రమే ఒకటి జరిగింది. ఓ సినీ ప్రముఖుడు హత్య, హత్యాయత్నం గొడవల్లో ఇరుక్కుపోయాడు. 'మానసిక సమస్యతో బాధపడ్తున్నారు..' అంటూ ఆ వ్యక్తిని అప్పట్లో రాజకీయం గట్టెక్కించేసింది. హత్య, హత్యాయత్నం జరిగిన మాట వాస్తవం. కానీ, సాక్ష్యాల్లేవు. అంతే, ఆ కేసు అలా అటకెక్కేసింది. సినీ రంగం అనే కాదు, రాజకీయ రంగ ప్రముఖుల, బడా వ్యాపారవేత్తలు చట్టం కళ్ళు గప్పి పెద్ద మనుషుల్లా చెలామణీ అయిపోతుండడంతో 'అసహనం' పెరగకుండా ఎలా వుంటుంది.? అయినా ఆ అసహనాన్ని తమకు అందుబాటులో వున్న సామాజిక మాధ్యమాల ద్వారానే బయటపెడ్తున్నందుకు నెటిజన్స్‌ఖి హేట్సాఫ్‌ చెప్పాల్సింది. అసహనంలోనూ సహనం పాటించడం అభినందనీయం. 

 

@3$%  @3$%

×
×
  • Create New...