Jump to content

Eenadu Online Font Change Chesadu - Copy Paste Test


Recommended Posts

Posted

ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: బాలీవుడ్‌ నటులు సోనమ్‌ కపూర్‌, హృతిక్‌ రోషన్‌లు ‘ధీరే ధీరే సే’ పాటతో హిట్‌ పెయిర్‌గా నిలిచారు. ఇప్పుడు వీరిద్దరితో సినిమా చేయడానికి బాలీవుడ్‌లో సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ జంట ఇప్పుడు ‘ఆషికి-3’లో నటించనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ సినిమాకి అమిత్‌ శర్మ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం ఇప్పటివరకూ సోనమ్‌ కానీ హృతిక్‌ కానీ అధికారికంగా ప్రకటించలేదు. 1990లో రాహుల్‌ రాయ్‌, అను అగర్వాల్‌లు నటించిన ‘ఆషికి’ చిత్రంలోని ‘ధీరే ధీరే సే’ పాట రీమిక్స్‌ పాపులర్‌ కావడంతో ‘ఆషికి-3’లో సోనమ్‌, హృతిక్‌లను ఎంపికచేస్తే బాగుంటుందని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. 2013లో వచ్చిన ఆషికి-2లో సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌, శ్రద్ధా కపూర్‌లు నటించిన విషయం తెలిసిందే.

Posted

Not acceptable.. reduce the size little bit..

Posted
ts-cartsmall131215.jpg

నువ్వు చదువుకున్న వాడివి. మన గ్రామపంచాయితీకి పోటీ చెయ్యి. వాడికి చదువబ్బలేదు. ఎంపీ సీటుకు పోటీ చేస్తాడు...

Posted

naaku chaduvadam kastam avutundi from last week....chromo browser and mozilla use chestunnanu

 

 

andaru ela how reading news on eenadu

Posted

endhuku kastam avuthundi????

 

 

naaku chaduvadam kastam avutundi from last week....chromo browser and mozilla use chestunnanu

 

 

andaru ela how reading news on eenadu

 

Posted

naaku chaduvadam kastam avutundi from last week....chromo browser and mozilla use chestunnanu

 

 

andaru ela how reading news on eenadu

elaborate your kastams

Posted

endhuku kastam avuthundi????

 

font pedha ga vundi oka letter inko letter meda overlap ga vunnayi news mothum

Posted

main news copy paste cheyi test ki.....breaking news kaadu.........

Posted

main news copy paste cheyi test ki.....breaking news kaadu.........

avi images kada raaja

 

వాతావరణ న్యాయం గెలిచింది 
ప్రపంచ నేతల సమష్టి వివేకం ప్రదర్శితమయింది 
పారిస్‌ ఒప్పందంపై ప్రధాని మోదీ స్పందన 
భూమిని రక్షించుకోవడానికి ఇదో ఉత్తమ అవకాశం: ఒబామా 
13ap-panel3a.jpg
పారిస్‌, దిల్లీ: భూతాపాన్ని రెండు డిగ్రీల సెల్సియస్‌ కన్నా ‘బాగా తక్కువ’కు పరిమితం చేయడానికి అంగీకరిస్తూ కుదిరిన పారిస్‌ ఒప్పందం పట్ల ప్రపంచ నేతలు హర్షం వ్యక్తం చేశారు. భూతాపాన్ని నియంత్రించే దిశగా ఇదో పెద్ద ముందడుగు అని అభివర్ణించారు. ఈ విజయం వాతావరణ న్యాయానిదే అని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఒప్పందంలో విజేతలు, పరాజితులు ఎవరూ లేరని చెప్పారు. కాప్‌-21 సదస్సులో ఒప్పంద సాధనకు ప్రతి దేశమూ సవాల్‌ను స్వీకరించిందని అభినందించారు. వాతావరణ మార్పు సవాల్‌ పరిష్కారానికి సదస్సులో జరిగిన సమాలోచనలు ప్రపంచ నేతల సమష్టి వివేకాన్ని తెలియజెప్పాయన్నారు. ‘‘పారిస్‌ ఒప్పందం ఫలితంలో విజేతలు కానీ పరాజితులు కానీ లేరు. వాతావరణ న్యాయం గెల్చింది. హరిత భవితవ్యం కోసం మేమంతా కృషి చేస్తున్నాం.’’ అని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘‘వాతావరణ మార్పు ఇంకా సవాలే. అయితే ఈ సవాల్‌ను ఎదుర్కొనేందుకుపరిష్కారం దిశగా ప్రతి దేశమూ ఏ విధంగా కృషి చేసిందీ పారిస్‌ ఒప్పందాన్ని బట్టి తెలుస్తుంది.’’ అని అన్నారు. 31 పేజీల ఒప్పందాన్ని ఖరారు చేసే ముందు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్‌.. ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి చర్చల తాజా పరిస్థితిని వివరించి చెప్పారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు తీసుకున్న ఈ చొరవను ప్రధాని అభినందించారనరి ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒప్పందాన్ని చరిత్రాత్మకమని భారత్‌ అభివర్ణించింది. అయితే అభివృద్ధి చెందిన దేశాలు మరిన్ని బాధ్యతలను భుజాన వేసుకుని ఉంటే ఒప్పందం మరింత సంకల్పయుతంగా ఉండేదని పేర్కొంది. ‘‘ఈ రోజు చరిత్రాత్మక రోజు. ఇది ఒప్పందం మాత్రమే కాదు. ఏడు వందల కోట్ల మంది జీవితాల్లో ఒక ఆశా అధ్యాయం. భూమి మన పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి కాదు.. భవిష్యత్‌ తరాల కోసం తీసుకున్న రుణమని మహాత్మాగాంధీ చెబుతుండేవారు.’’ అని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జవదేకర్‌ అన్నారు. ‘‘హేతుబద్ధమైన ఒప్పందానికి అన్ని దేశాలూ అంగీకరించడం అంత సులువైన విషయం కాదు. అందుకే ఈ ఒప్పందం చరిత్రాత్మకం.’’ అని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు మరిన్ని బాధ్యతలను పంచుకుని ఉండాల్సిందంటూ ‘‘అభివృద్ధి చెందిన దేశాల చర్యలు వారి చారిత్రక బాధ్యతల కన్నా చాలా తక్కువగా ఉన్నాయి.’’ అని అన్నారు. వాతావరణ న్యాయ ప్రాముఖ్యాన్ని ఒప్పందం స్పష్టంగా గుర్తించడం పట్ల భారత్‌ సంతోషంగా ఉందన్నారు. ‘‘సుస్థిర జీవనశైలులు, సుస్థిర వినియోగ తీరుతెన్నుల ప్రాముఖ్యాన్ని కూపడా ఒప్పందం గుర్తించింది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల చర్యల మధ్య తేడాను ఒప్పందం గుర్తించినందుకూ సంతోషంగా ఉంది.’’అని చెప్పారు. ‘‘పారిస్‌ ఒప్పందం సంపూర్ణ విజయం. మానవాళికి గొప్ప గెలుపు.’’అని చెప్పారు. ఈ క్షణం ప్రపంచానికి కీలకమలుపు అని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. ఈ ఒప్పందమే కాదు.. ఏ ఒప్పందమూ సంపూర్ణమైనదని కాదంటూ ‘‘మన సొంత గ్రహాన్ని రక్షించుకోవడానికి దక్కిన ఉత్తమ అవకాశమిది.’’ అని చెప్పారు. ఈ ఒప్పందం ప్రపంచ ప్రజలకు, భూగోళానికి గొప్ప విజయమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ బాన్‌కీ మూన్‌ అభివర్ణించారు.
 
Posted

Ok. good that they changed font. inthakumundu copy paste ayyedi kaadu font...

Posted


ts-cartsmall131215.jpg

నువ్వు చదువుకున్న వాడివి. మన గ్రామపంచాయితీకి పోటీ చెయ్యి. వాడికి చదువబ్బలేదు. ఎంపీ సీటుకు పోటీ చేస్తాడు...

lol


brahmilaughing.gif
Posted

antee main news ki oka font , breaking news ki oka font vaduthadaaa???? endhi bhayaa nuvvu kuda ila 

 

 

 

Ok. good that they changed font. inthakumundu copy paste ayyedi kaadu font...

 

Posted

Ok. good that they changed font. inthakumundu copy paste ayyedi kaadu font...

 

google font ki change chesinattu unnaadu translate option kuda enabled

Posted


ts-cartsmall131215.jpg

నువ్వు చదువుకున్న వాడివి. మన గ్రామపంచాయితీకి పోటీ చెయ్యి. వాడికి చదువబ్బలేదు. ఎంపీ సీటుకు పోటీ చేస్తాడు...

Humor adara kottesadu ga
×
×
  • Create New...