Jump to content

Greatandhra Blackmailing Producers For Money


Recommended Posts

Posted

ఒక సినిమాపై ఏ చిన్న దుష్ప్రచారం జరిగినా కానీ దాని ప్రభావం కోట్లలో వుంటుంది. అందుకే నిర్మాతలు తమ సినిమాపై ఎటువంటి నెగెటివ్‌ రిమార్కులు రాకుండా అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి వస్తుంది. ఎంత క్రేజీ హీరో వున్నా, దర్శకుడికి నూటికి నూరు శాతం సక్సెస్‌ రేటున్నా కానీ ఒక్కసారి బ్యాడ్‌ రిపోర్ట్‌ పాస్‌ అయిందంటే ఎంతటి సినిమా అయినా బాక్సాఫీస్‌ వద్ద కుప్పకూలిపోతుంది. సినిమా విడుదలైన తర్వాత పబ్లిక్‌ టాక్‌ని ఆపడం ఎవరి తరం కాదు. సగటు ప్రేక్షకుడి తీర్పే శాశనం. సినిమా నచ్చితే సింహాసనం, నచ్చకపోతే తిరుక్షవరం. ప్రేక్షకుడి తీర్పునెలాగో శాసించలేరు కనుక కనీసం విడుదలకి ముందు వరకు అయినా చెడు ప్రచారం జరక్కుండా జాగ్రత్త పడాలనే నిర్మాతలు కోరుకుంటారు.

ఈ బలహీనత మీదే కొడుతుంటారు కొందరు పరాన్నజీవులు. తమనేదో విధంగా 'సంతోష పెట్టపోతే' సినిమాపై బ్యాడ్‌ టాక్‌ స్ప్రెడ్‌ చేస్తామంటూ సున్నితంగా బెదిరిస్తుంటారు. లైట్‌ తీసుకున్నారనుకోండి. ఇక అంతే తమ చేతిలో వున్న గ్రేట్‌ మీడియా ప్రతాపం ఏపాటిదో రుచి చూపించేస్తుంటారు. కోట్లలో ఖర్చు పెట్టిన సినిమా. కొన్ని వేల కోసం పట్టు పడితే నష్టం అంతకు ఎన్ని రెట్లు వుంటుందనేది చెప్పడం కష్టం. ఎందుకొచ్చిన గొడవలెమ్మని వాళ్ళడిగింది ఇచ్చేసి గొడవ వదిలించేసుకుంటారు. ఎప్పుడైతే నిర్మాతల్లోని ఈ బలహీనత తీవ్రత తెలిసిందో ఇక ఆ పేరసైట్లు ఎందుకూరుకుంటాయి. అసలే కొసరు సొమ్ము రుచి మరిగి వుంటాయేమో తమ వెబ్‌సైట్‌నే వెపన్‌ చేసేసుకుని కదం తొక్కేస్తాయి. అసలు ఇలాంటి వాళ్ళంటూ వుంటారా అని మీకు అనుమానం రావచ్చు. నిర్మాతలు మరీ ఇంతగా బెదిరిపోతారా అనే సందేహాలు కలగవచ్చు. 

తెలుగిండస్ట్రీలో అలాంటి ఒక ఘనాపాటి వుండనే వున్నాడు. అతగాడి చేతిలో ఒక పేరు మోసిన వెబ్‌సైటు, ఇంకా కొన్ని పిల్ల వెబ్‌సైట్లు, కొన్ని వార పత్రికలు, దిన పత్రికల్లో కాలమ్‌లు వున్నాయి. వీటిని చూపించే అతగాడు నిర్మాతలకి గాలం వేస్తుంటాడు. బడా నిర్మాతలనయితే బతిమాలుకుని, చోటా మోటా వాళ్ళనయితే బెదిరించి, అందితే జుట్టు - అందకపోతే కాళ్ళు అన్నట్టు జలగలా పీడించేస్తుంటాడు. ఈ జిడ్డు వదిలించుకోడానికి తైలం పడేయక తప్పదని కొందరు, బిస్కట్టు పడేస్తే మొరగకుండా గమ్మున వుంటాడని ఇంకొందరు, నిజంగానే మన సినిమాపై పడి ఏడిస్తే ఏమైపోతామో అనే భయంతో మరి కొందరు అతగాడిని భరిస్తున్నారు. ఎవరికైనా కడుపు కాలి తిరగబడితే ఇక అతగాడు పెన్నేసుకుని విషం కక్కేస్తాడు. అతని నైజం తెలిసిన వారు 'ఎంతో కొంత ఇచ్చి పడేయండి సార్‌... పడి వుంటాడు' అని సలహాలిస్తారు. ఒకవేళ ఆ నిర్మాత ఏమాత్రం పట్టు వదలకపోయినా, ఖర్మ కాలి ఆ సినిమా ఏ కొంచెం బాగోలేకపోయినా విడుదలయింది లగాయతు అయ్యవారి ఏడుపు తారాస్థాయిలో వుంటుంది. అసలే సినిమా అటు, ఇటు ఊగులాడుతోందనుకోండి, అలాంటి సమయంలో తమ సినిమా చెత్త అంటూ ఆర్టికల్స్‌ పడితే నిర్మాత బెంబేలెత్తిపోతాడు కదా? ఒక్కసారి ఆ పెన్ను పోటు తగిలిన నిర్మాతలు ఇంకోసారి అతడితో పెట్టుకోరు. ఇచ్చి పడేయండ్రా బాబో, ఎందుకొచ్చిన పెండ అంటూ దండమెట్టేస్తారు. 

విశేషం ఏమిటంటే ఈ పేరసైట్‌ పన్జేసే వెబ్‌సైట్‌కి కొన్ని నీతి నియమాలున్నాయి. సినిమా తల రాతలు శాసించే బ్రహ్మ మేమే అన్నట్టు ఫీలయిపోతుంది. చావు బతుకుల్లో వున్న సినిమాకి పావలా రేటింగ్‌ ఎక్కువేస్తే బతికి పోతుంది అన్నా కానీ దిగిరారు. మేం మోనార్కులం, మమ్మల్నెవరూ కొన్లేరు అన్నట్టు బీరాలు పలికే ఆ యాజమాన్యం ఇట్టాంటి చిల్లర వ్యవహారాలు నడుపుతోన్న మార్జాలాన్ని చంకన పెట్టుకోవడమే విధి వైచిత్రి. సదరు సైట్‌లో రేటింగ్‌ బాగా వస్తే అది తన ఘనతేనని, సరిగ్గా రాకపోతే తనకి 'శాంతి' చేయలేదు కనుక మీకు ఈ అశాంతి తప్పదని అంటుంటాడట. తనని సంతోషపెట్టని నిర్మాత సినిమా ఫ్లాపయిందంటే వెంటనే వెళ్ళి వాలిపోయి సూటిపోటి మాటలతో సూదులు గుచ్చేస్తాడట. అదే తనని సంతోష పెట్టినోడి సినిమా హిట్టయిందంటే 'మరి నాకేం లేదా?' అంటూ మరి కొంత చిల్లర దండుకోవడానికి తగుదునమ్మా అంటూ తయారైపోతాడట. 

కేవలం నిర్మాతలే కాదు అప్పుడే ఫీల్డులోకి దిగిన చిన్న హీరోలు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇతని బారిన పడిన వారే. ఏదో రూపంలో క్షవరం చేయించుకున్నవారే. అస్తమానం డబ్బులే ఇవ్వనక్కరలేదని, మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఐఫోనో, ఐప్యాడో ఇచ్చినా ఆత్మారాముడు కులాసా అయిపోతాడని అతడే ఆప్షన్లు కూడా ఇస్తుంటాడట. అతనికి జీతం రూపంలో వచ్చే దానికి నాలుగింతలు ఇలాగే సంపాదిస్తున్నాడని కూడా చెప్పుకుంటుంటారు. మీడియా వాళ్ళకి తరచుగా ఇచ్చే కవర్‌లు ఇతనికి ఠంచనుగా ఇచ్చేయాలట. లేదంటే ఆ సినిమాకి సంబంధించిన వార్త ఏదీ తన సైట్లో రానివ్వడట. పేరు మోసిన మీడియాలో తమ సినిమా కవరేజీ లేకపోతే ఎలాగంటూ పీఆర్వోలు తెగ ఇదైపోతుంటారు. అందుకే పిలిచి మరీ అతనికి ఇవ్వాల్సిందిచ్చేస్తుంటారు. అందరితో సమానంగా ఇచ్చినా కూడా తలపోటేనట. మా రేంజీ ఏంటీ, వాళ్ళ రేంజీ ఏంటి అంటూ స్టీరియోఫోనిక్‌ సౌండ్లో సిగ్గు పడకుండా అడిగేస్తాడట. అసలు ఎవరికీ కవరులు ఇవ్వని సినిమా తాలూకు పీఆర్వోలని కూడా ఫోన్లు చేసి మరీ పీడిస్తుంటాడట. అతనితో పని జరగకపోతే సరాసరి నిర్మాత ఆఫీసుకి వెళ్ళి మటం వేస్తాడట. 

ఇంత పబ్లిక్‌గా దోపిడీ చేస్తున్నా కానీ ఇదంతా తమకి తెలియనట్టే వ్యవహరిస్తూ నీతులు వల్లిస్తుంటుంది అతగాడిని జీతమిచ్చి పోషిస్తోన్న సంస్థ. మేం నిజాయతీపరులమని, ఎదుటి వాళ్ళంతా అమ్ముడుపోయిన బాపతు అని గొప్పతనం చాటుకోవడానికి, సొంత డప్పు వేసుకోవడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోని ఆ సంస్థ తటాకంలోనే ఈ జలగ వీరవిహారం చేస్తుండడం శోచనీయం. మీడియా ఎవరికీ అనుకూలంగా వుండరాదని, అందరినీ సమదృష్టితో చూడాలని, దానిని కడిగేయడానికి నిత్యం సర్ఫు, డిటర్జెంటు సోపు పట్టుకుని తిరిగే సదరు సంస్థ ముందుగా తమ కాంపౌండ్లో పెరుగుతోన్న కలుపుని ఏరి పారేసి, తర్వాత ఎదుటివాళ్ళ నలుపుని చూపిస్తే బాగుంటుందని సినీ జనం అంటున్నారు. అసలు తమ వెనుక ఇంత తంతు నడుపుతున్నాడనే సంగతి ఆ సంస్థకి తెలిసినట్టా, తెలిసినా తెలీనట్టు నటిస్తున్నట్టా, లేక పైకి క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ అంటూ మురికి పనులన్నీ వెనక నుంచి అతగాడితో చక్కబెట్టిస్తున్నట్టా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్న వాళ్ళూ వున్నారు. చివరిగా చెప్పేదేమిటంటే ముందు మీ దొడ్డి కడుక్కోండి సార్‌, తర్వాత ఊరోళ్ళ గబ్బు గురించి వ్యాసాలు రాసుకోవచ్చు. 

×
×
  • Create New...