Jump to content

Recommended Posts

Posted
71450083494_625x300.jpg
 
హైదరాబాద్: అయుత మహా చండీయాగానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం విజయవాడకు వెళ్లారు. విజయవాడ వస్తున్న కేసీఆర్‌కు ఈ సందర్భంగా అద్భుతమైన ఆతిథ్యాన్ని ఇచ్చేందుకు చంద్రబాబు నివాసంలో ఏర్పాట్లు చేశారు. ఈ ప్రత్యేక విందులో  గోంగూర, ఉలవచారు, నాటుకోడి సహా 15 రకాల ఘుమ‌ఘుమ‌లాడే ఆంధ్రా ప్రత్యేక వంటకాలతో  మెనూ ను తయారు చేయించారు.
 
కాగా కేసీఆర్ తో పాటు మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్‌లు బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో విజయవాడకు వెళ్లారు. చంద్రబాబు భేటీ అనంతరం కేసీఆర్ అక్కడి నుంచి బయల్దేరి నేరుగా మళ్ళీ  హైదరాబాద్ చేరుకోనున్నారు.
×
×
  • Create New...