Jump to content

Jaffas Comeon


Recommended Posts

Posted
విజయవాడ: ఏపీలో సంచలనం సృష్టిస్తున్న కాల్‌మనీ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కాల్ మనీ బాధితులు విజయవాడ, విశాఖపట్నంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటి వరకూ టీడీపీ నేతలే ఈ వ్యవహారంలో ఇరుక్కున్నారని విమర్శలు వచ్చినా, వైసీపీ నేతలు కూడా ఈ తెర వెనుక బాగోతం నడిపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న గుంటూరు జిల్లా నేత కావటి మనోహర్ నాయుడి ఇంట్లో పోలీసులు సోదాలు చేయడం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. అంతేకాకుండా మంగళవారం కడప, ప్రొద్దుటూరులో పోలీసులు వడ్డీ వ్యాపారుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు. గుంటూరులో కూడా తనిఖీలు చేశారు. అయితే వడ్డీ వ్యాపారుల్లో ఎక్కువ మంది వైసీపీ నేతలే ఉండడం నాయకుల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తోంది. నిన్నటి వరకూ టీడీపీ నాయకులపై దుమ్మెత్తిపోసిన వైసీపీ శిబిరంలో తాజా పరిణామాలతో కలవరపాటు మొదలైంది.
×
×
  • Create New...