Hitman Posted December 15, 2015 Report Posted December 15, 2015 కమల్ హాసన్... సిసలైన సినీ నటుడు. దక్షిణాదిలోనే కాదు.. యావత్ భారతదేశంలోనే నటుడిగా ఈయన చేసినన్ని ప్రయోగాలు మరెవరూ చేసి ఉండరు అనేది సత్యం. అందుకే నటుడిగా దేశమంతా ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం నటుడిగానే కాదు.. దశాబ్దాలుగా కమల్ రచయితగా, దర్శకుడిగా కూడా తన సత్తా చాటుతూ ఉన్నాడు. ఇంతేనా.. కమల్ ప్రొడ్యూసర్ కూడా. రాజ్ కమల్ బ్యానర్ పై తన సోదరులతో కలిసి కమల్ సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాడు. అయితే కమల్ సినిమాల కమర్షియల్ గా సక్సెస్ రేటు ఇప్పుబు బాగా తక్కువగా ఉంది. వేరే నిర్మాతలు కమల్ తో తీసిన సినిమాలైనా, కమల్ సొంతంగా నిర్మించిన సినిమాలైన కమర్షియల్ గా డబ్బులు సాధించిపెట్టడం లేదు. ప్రశంసలు అందుకొంటున్నాయి కానీ... అభిమానులను అవి ఆనంద పెడుతున్నాయి కానీ.. డబ్బులు తెచ్చిపెట్టడం లేదు! భారీ బడ్జెట్ తో రూపొంది.. ఇలా నష్టపరిచిన సినిమాలతో కమల్ కూడా బాగానే నష్టపోయారన్నది అందరికీ అర్థమైపోతోంది. దీంతో కమల్ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదనే ప్రచారం తమిళనాడు నుంచి ఊపందుకొంది. అందుకే ఈ మధ్య కమల్ ఒక యాడ్ ఫిల్మ్ లో నటించడానికి కూడా పూనుకున్నాడని తెలుస్తోంది. ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడూ చేయని అలాంటి పని కమల్ ఇప్పుడు చేస్తున్నాడని.. ఇదంతా దెబ్బతిన్న ఆయన ఆర్థిక పరిస్థితికి దర్పణమనే ప్రచారం జరిగింది. మరి ఆ ప్రచారం సంగతలా ఉంటే..ఇప్పుడు కమల్ ఫోర్బ్స్ జాబితాలో దక్షిణాదిలోనే రెండో శ్రీమంతుడిగా తేలాడు! మహేశ్ బాబు తర్వాత దక్షిణాదిన గత ఏడాదిలో బాగా సంపాదించి కమల్ హాసనేనట! దాదాపు 50 కోట్ల రూపాయల సంపాదనతో కమల్ దున్నేశాడని ఫోర్బ్స్ పేర్కొంది. మరి కమల్ చితికిపోయాడు.. ఆర్థికంగా దెబ్బతిన్నాడు ..అందుకే ఏకంగా యాడ్ ఫిల్మ్స్ దశకు వచ్చేశాడు పాపం.. అని వచ్చిన వార్తలు ఆయనపై అభిమానుల్లో జాలిని కలిగించాయి. అందుకు పూర్తి విరుద్ధంగా ఇప్పుడు కమల్ ను మంచి సంపాదన పరుడిగా ఫోర్బ్స్ చూపించింది. దీంతో.. ఈ స్టార్ హీరో ఫైనాన్షియల్ స్టేటస్ అంతుబట్టనిదిగా గోచరిస్తోంది.
Nellore Pedda reddy Posted December 15, 2015 Report Posted December 15, 2015 Ad films chese stage antaru enduku illiterate fellows, adedo tappu ainattu
Maximus Posted December 15, 2015 Report Posted December 15, 2015 కమల్ హాసన్... సిసలైన సినీ నటుడు. దక్షిణాదిలోనే కాదు.. యావత్ భారతదేశంలోనే నటుడిగా ఈయన చేసినన్ని ప్రయోగాలు మరెవరూ చేసి ఉండరు అనేది సత్యం. అందుకే నటుడిగా దేశమంతా ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం నటుడిగానే కాదు.. దశాబ్దాలుగా కమల్ రచయితగా, దర్శకుడిగా కూడా తన సత్తా చాటుతూ ఉన్నాడు. ఇంతేనా.. కమల్ ప్రొడ్యూసర్ కూడా. రాజ్ కమల్ బ్యానర్ పై తన సోదరులతో కలిసి కమల్ సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాడు. అయితే కమల్ సినిమాల కమర్షియల్ గా సక్సెస్ రేటు ఇప్పుబు బాగా తక్కువగా ఉంది. వేరే నిర్మాతలు కమల్ తో తీసిన సినిమాలైనా, కమల్ సొంతంగా నిర్మించిన సినిమాలైన కమర్షియల్ గా డబ్బులు సాధించిపెట్టడం లేదు. ప్రశంసలు అందుకొంటున్నాయి కానీ... అభిమానులను అవి ఆనంద పెడుతున్నాయి కానీ.. డబ్బులు తెచ్చిపెట్టడం లేదు! భారీ బడ్జెట్ తో రూపొంది.. ఇలా నష్టపరిచిన సినిమాలతో కమల్ కూడా బాగానే నష్టపోయారన్నది అందరికీ అర్థమైపోతోంది. దీంతో కమల్ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదనే ప్రచారం తమిళనాడు నుంచి ఊపందుకొంది. అందుకే ఈ మధ్య కమల్ ఒక యాడ్ ఫిల్మ్ లో నటించడానికి కూడా పూనుకున్నాడని తెలుస్తోంది. ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడూ చేయని అలాంటి పని కమల్ ఇప్పుడు చేస్తున్నాడని.. ఇదంతా దెబ్బతిన్న ఆయన ఆర్థిక పరిస్థితికి దర్పణమనే ప్రచారం జరిగింది. మరి ఆ ప్రచారం సంగతలా ఉంటే..ఇప్పుడు కమల్ ఫోర్బ్స్ జాబితాలో దక్షిణాదిలోనే రెండో శ్రీమంతుడిగా తేలాడు! మహేశ్ బాబు తర్వాత దక్షిణాదిన గత ఏడాదిలో బాగా సంపాదించి కమల్ హాసనేనట! దాదాపు 50 కోట్ల రూపాయల సంపాదనతో కమల్ దున్నేశాడని ఫోర్బ్స్ పేర్కొంది. మరి కమల్ చితికిపోయాడు.. ఆర్థికంగా దెబ్బతిన్నాడు ..అందుకే ఏకంగా యాడ్ ఫిల్మ్స్ దశకు వచ్చేశాడు పాపం.. అని వచ్చిన వార్తలు ఆయనపై అభిమానుల్లో జాలిని కలిగించాయి. అందుకు పూర్తి విరుద్ధంగా ఇప్పుడు కమల్ ను మంచి సంపాదన పరుడిగా ఫోర్బ్స్ చూపించింది. దీంతో.. ఈ స్టార్ హీరో ఫైనాన్షియల్ స్టేటస్ అంతుబట్టనిదిగా గోచరిస్తోంది. adi Pothy's add..16 C tesukunnadu and donated to NGO which helps children affected with HIV..
Recommended Posts