Jump to content

Cm Ante Call Money---Roja Aunty Dailogue


Recommended Posts

Posted
1450326890-154.jpg

వైసీపీ ఎమ్మెల్యే  రోజా ఇప్పుడు సినిమాల్లో నటించకపోయినా సినిమా డైలాగులు మాత్రం బ్మహ్మాండంగా విసురుతున్నారు. తాజాగా ఆమె కాల్‌ మనీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడును విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. డైలాగులో పవరుండడంతో ప్రజల్లోకి వెళ్లిపోయింది. సీఎం అంటే కాల్‌ మనీ అని అర్థమొచ్చేలా చంద్రబాబు మార్చేశారని ఆమె ఆరోపించారు.

ఎన్నోకుటుంబాలను నాశనం చేస్తున్న కాల్‌ మనీ వ్యవహారంపై చంద్రబాబు అసెంబ్లీలో సమాధానం చెప్పాలని రోజా డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాదు... చంద్రబాబు సమాధానం చెప్పకపోతే తాము ఊరుకునే ప్రసక్తే లేదని ఇప్పటినుంచే బెదిరింపులు మొదలుపెట్టారు. కనీసం 25 రోజులు జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను కేవలం ఆరు రోజులకు పరిమితం చేయడం అత్యంత దారుణమని రోజా పేర్కొన్నారు. 

అయితే... సీఎం అంటే కాల్‌ మనీ అంటున్న రోజా ఓ ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పడం లేదు. చంద్రబాబు తొందరలోనే దిగిపోతారని... ఆ తరువాత నేనే సీఎం అని జగన్‌ చెబుతున్నందున కాల్‌ మనీ పై జగన్‌ బాగా ఇంట్రస్టుగా ఉన్నట్లు అనుకోవాలా అన్న ప్రశ్నకు మాత్రం రోజా సమాధానం చెప్పడంలేదు. మరి జగన్‌ సీఎం అయితే... అప్పుడు దానికి అర్థం కాల్‌ మనీ కాకుండా పోతుందా అన్నది ఆమెకే తెలియాలి.

×
×
  • Create New...