turtle Posted December 21, 2015 Report Posted December 21, 2015 విమానాశ్రయంలో తెలుగు విద్యార్థుల అగచాట్లుఅమెరికా పంపేందుకు ఎయిర్ ఇండియా నిరాకరణ ఈనాడు, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలుగు విద్యార్థుల అగచాట్లు కొనసాగుతున్నాయి. అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలోని సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్సిటీల్లో ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లాల్సిన విద్యార్థులను ఎయిర్ ఇండియా సిబ్బంది ఆపేస్తుండటంతో ఆందోళన నెలకొంది. శనివారం రాత్రి 7, 8.50 గంటలకు శంషాబాద్ నుంచి బయలుదేరిన విమానాల్లో 19 మంది విద్యార్థులు వెళ్లాల్సి ఉండగా.. వారిని సిబ్బంది నిలువరించారు. ఆయా విశ్వవిద్యాలయాల్ని అమెరికా ప్రభుత్వం నిషేధిత జాబితా (బ్లాక్లిస్ట్)లో ఉంచిందనే కారణంతో విద్యార్థులను తీసుకెళ్లేందుకు నిరాకరించారని బాధిత విద్యార్థుల్లో ఒకరైన దీపక్ ‘ఈనాడు’కు తెలిపారు. ఈ మేరకు శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్ ఇండియా వర్గాల నుంచి తమకు సమాచారం వచ్చిందని చెబుతూ బాధిత విద్యార్థులకు ఫ్యాక్స్ సందేశాన్ని చూపించారని చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం 2, రాత్రి 7 గంటలకు వెళ్లిన విమానాల్లోనూ 24 మంది విద్యార్థులకు ఇలాగే నిరాకరణ ఎదురైంది. ఏడు గంటల విమానంలో అయితే బోర్డింగ్ పాస్లు తీసుకున్న అనంతరం నలుగురు విద్యార్థులను వెనక్కి పంపేశారు. మరో పదిహేను రోజుల్లో విశ్వవిద్యాలయ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అమెరికా వెళ్లేందుకు అనుమతించకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు డిపోర్ట్ అవుతున్నారనే..ఆయా విశ్వవిద్యాలయాలను నిషేధిత జాబితాలో పెట్టడం వల్లే విద్యార్థులను పంపేందుకు నిరాకరిస్తున్నారనే ప్రచారం నెలకొన్నా కారణాలు వేరేగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విశ్వవిద్యాలయాలకు వెళ్లిన విద్యార్థుల్లో కొందరు సాంకేతిక కారణాల రీత్యా డిపోర్ట్ అయ్యారు. ఇలా డిపోర్ట్ అయిన వారిని తిరిగి భారత్కు రప్పించిన సందర్భంలో తిరుగు ప్రయాణ ఛార్జీలను వారు చెల్లించలేకపోవడంతో ఆ భారం ఎయిర్ఇండియానే భరించాల్సి వచ్చింది. ఇదే కారణంతో తాజాగా విశ్వవిద్యాలయాలను నిషేధిత జాబితాలో ఉంచారని చెబుతూ విద్యార్థుల్ని తీసుకెళ్లేందుకు నిరాకరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఆయా విశ్వవిద్యాలయాల వర్గాలను సంప్రదిస్తే నిషేధిత వాదనలను కొట్టిపారేశారని బాధిత విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. ఈ విషయమై ఎయిర్ఇండియా ప్రతినిధి పూజను సంప్రదించగా.. గతంలో కొందరు విద్యార్థుల్ని వెనక్కి తిరిగి పంపించారని పేర్కొన్నారు. అక్కడ సాంకేతిక కారణాల వల్ల ఇలా వెనక్కి పంపిస్తుండటంతో పూర్తిస్థాయిలో అనుమతులు ఉంటేనే పంపిస్తామని స్పష్టం చేశారు. Source: Eeenadu on 12/20. http://eenadu.net/news/newsitem.aspx?item=ap-state&no=13
alpachinao Posted December 21, 2015 Report Posted December 21, 2015 Lol air India ante air india free service cheyala
Balibabu Posted December 21, 2015 Report Posted December 21, 2015 ante air india free service cheyala Free service kadu vaadi verey kathalu gurtuku vachi manchiga ayyindi antunna
Recommended Posts