ramudu3 Posted December 21, 2015 Report Posted December 21, 2015 అమెరికాలో 14మంది తెలుగు విద్యార్థులకు అనుమతి నిరాకరణ హైదరాబాద్: అమెరికాలో 14మంది తెలుగు విద్యార్థులకు అనుమతులు నిరాకరించారు. సిలికాన్ వ్యాలీ, నార్త్ వెస్ట్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయాలు, విద్యార్థులకు అనుమతులను నిరాకరించాయి. దీంతో విద్యార్థులు అమెరికా నుంచి వెనక్కి వచ్చారు. అయితే ఎయిరిండియాకు అమెరికా వెళ్లే విద్యార్థులను ఆపే అంశంతో సంబంధం లేదని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఉన్న సమాచారం మేరకే ఆపుతున్నారని వివరించారు. సమస్య పరిష్కారానికి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్తో మాట్లాడుతానని తెలిపారు. అమెరికా వెళ్లిన చాలా మంది విద్యార్థులను వెనక్కి పంపారని చెప్పారు. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇక్కడే ఆపుతున్నారని వెల్లడించారు. పై రెండు విశ్వవిద్యాలయాలను అమెరికా ప్రభుత్వం నిషేధిత జాబితాలో ఉంచటంతో ఈ సమస్య తలెత్తింది.
TOM_BHAYYA Posted December 21, 2015 Report Posted December 21, 2015 Veedemanna bbc a bedharuuu.. Shit n chandrajyothy kanna better .. Off course v6tnews gurunchi pichha lite
Recommended Posts