Jump to content

Recommended Posts

Posted

అమెరికాలో భారతీయ విద్యార్థులపై నిఘా!
ఆ రెండు వర్సిటీల విద్యార్థుల ఇళ్లలో తనిఖీలు
తాత్కాలిక ఉద్యోగాల అనుమానంతో ఎఫ్‌బీఐ సోదాలు
ఈనాడు - హైదరాబాద్‌
అమెరికాలో పైచదువుల కోసం వెళ్తున్న విద్యార్థుల్ని విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్‌ సిబ్బంది నిలువరిస్తున్న తరుణంలో ఇప్పటికే అక్కడ చదువుతున్న విద్యార్థుల గురించి ఆందోళన నెలకొంది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని సిలికాన్‌ వ్యాలీ, నార్త్‌వెస్టర్న్‌ పాలిటెక్నిక్‌ విశ్వవిద్యాలయాల్లో ఎం.ఎస్‌.చదివేందుకు వెళ్లే భారతీయ విద్యార్థుల్ని వెనక్కి పంపిస్తుండటం తెలిసిందే. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆపుతుండటంతోపాటు, ఇటీవల అమెరికా వెళ్లినవారిని తిప్పి పంపేస్తున్నారు. తాజాగా గురువారం తెల్లవారుజామున 20 మంది తెలుగు విద్యార్థులు హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. అక్కడికి వెళ్లాల్సిన పలువురూ తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఈనేపథ్యంలో తిరిగివచ్చిన విద్యార్థులతోపాటు ఇప్పటికే అక్కడున్న విద్యార్థుల స్థానిక స్నేహితుల వద్ద ‘ఈనాడు’ ఆరాతీయగా పలు ఆందోళనకర విషయాలు బహిర్గతమయ్యాయి.
మూల కారణాలు మూడు..
సిలికాన్‌వ్యాలీ, నార్త్‌వెస్టర్న్‌ పాలిటెక్నిక్‌ విశ్వవిద్యాలయాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల్ని నిలువరించడం వెనక మూడు ప్రధాన కారణాలున్నట్లు తెలుస్తోంది.వాటిలో 60-70శాతం మంది భారతీయ విద్యార్థులున్నట్లు తెలుస్తోంది. బీటెక్‌ పూర్తిచేశాక ఎం.ఎస్‌. చదివేందుకు ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయాల్లోనే చేరేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇది అక్కడి ప్రభుత్వవర్గాల్లో చర్చనీయాంశమైంది. సాధారణ విద్యార్థుల్నీ తమ విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు ఎంపిక చేస్తుండటంతో విద్యాప్రమాణాలు దెబ్బతింటున్నాయనే ఆ రెండు వర్సిటీలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాయని సమాచారం. అందుకే వాటిల్లో చేరేందుకు అమెరికా వస్తున్న విద్యార్థుల్ని ఇమ్మిగ్రేషన్‌ తనిఖీల పేరుతో ఇబ్బంది పెడుతున్నాయనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆ రెండింటిలో ఇకపై ప్రవేశాలు పొందకుండా చూడటంతోపాటు ఇప్పటికే వాటిలో చదువుతున్న విద్యార్థుల్ని వేరే వర్సిటీలకు బదిలీచేసేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
తాత్కాలిక సంపాదనపై ఉక్రోషం
పైచదువుల కోసం అమెరికాకు వెళ్లే విద్యార్థుల్లో చైనా తర్వాతి స్థానం భారత్‌దే. అక్కడికి వెళ్లే భారతీయ విద్యార్థులు చదువు కొనసాగిస్తూనే తాత్కాలిక ఉద్యోగాలు చేస్తుండటం సాధారణం. ఈ వ్యవహారం అమెరికా ప్రభుత్వవర్గాలకు కంటగింపుగా మారినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఎఫ్‌1 వీసాపై అమెరికా వెళ్లే విద్యార్థులు తాత్కాలిక ఉద్యోగాలు చేయరాదనే నిబంధన ఉండటమే ప్రతిబంధకంగా భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ రెండు వర్సిటీల భారతీయ విద్యార్థులపై ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎఫ్‌బీఐ) వర్గాలు నిఘా ఉంచడం గమనార్హం. కొద్దిరోజులుగా విద్యార్థుల ఇళ్లలో ఎఫ్‌బీఐ తనిఖీలుచేస్తూ తాత్కాలిక ఉద్యోగాల గురించి ఆరా తీస్తుండటం ఇందుకు బలమిస్తోంది. మరోవైపు పారిస్‌ దాడి తర్వాత ఉగ్రవాదులతో విద్యార్థులకున్న సంబంధాల గురించి అంతర్గతంగా నిఘా ఏర్పాటుచేశారనే ప్రచారం సాగుతోంది.

 

antha ledu.....naku chala doubt g undi bhayya....asalu ee telugu media maree darunam ga unnayi bhayya.......manavalu education ki unna definition marchesaru andukane inni issues.....chala desperate ga money venakala paduthunnaru......veela attitude marali and US consulate VISA issue cheyadam kuda marali....then everybody know enduku US ki velthunnam ani telusthundi......

Posted

Asal appude kada anni taggatam modalu ayyindi......



Mari 2004 lo??

×
×
  • Create New...