Jump to content

Recommended Posts

Posted
 
 

                           ram-nenu-sailaja-first-look-wallpaper.jp




కథ: 

ఎవరిని ప్రేమించాలో తెలియని అయోమయం, అసలు నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో అర్థం కాని గందరగోళం.హరిది (రామ్‌).తండ్రి ప్రేమకి దూరమై,మనసులోని భావాలకి మాటలివ్వలేని ఇంట్రావర్ట్‌ శైలజ(కీర్తి).ప్రేమ వద్దు అనుకున్న హరికి తారసపడుతుంది శైలజ.మళ్లీ కనిపిస్తే చూద్దామనుకుంటాడు.మళ్లీ మళ్లీ కనిపించేస్తుంటే.కానీ 'ఐ లవ్యూ..బట్‌ ఐ యామ్‌ నాట్‌ ఇన్‌ లవ్‌ విత్‌ యూ'అని చెప్పి పోతుంది శైలజ.మరి ఈ హరికథ అంతటితో ముగిసినట్టేనా? అన్నది మిగతా కధ. 

కథనం-విశ్లేషణ:

హీరో తన ప్రేమను గెలిపించుకోవడానికి హీరోయిన్ ఇంట్లో ఎంటర్ అయి అందరి మనసులు గెలవడం అనే పాయింట్ చుట్టూ చాలా కధలే వచ్చాయి.'నేను శైలజ 'ఆ ఫార్మాట్ లోనే వెళ్ళినా ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు కిశోర్ తిరుమల సక్సెస్ అయ్యాడు. 

ఫస్టాఫ్ హీరో-హీరోయిన్ చిన్నప్పటి సన్నివేశాలతో ఇంటరెస్టింగ్ గా మొదలవుతుంది.ఆ తరువాత హీరో ప్రతి సారీ ప్రేమ లో ఫెయిల్ అయ్యే ఆ చిన్న ట్రాక్ కూడా బాగుంది.సరిగ్గా హీరో ప్రేమని తన జీవితంలోంచి తీసేయాలని డిసైడ్ అయిన మరుక్షణం ఎక్స్పెక్ట్ చేసినట్టే హీరోయిన్ ఎంట్రీ ,ఆ పై వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ ని డెవలప్ చేసిన తీరు చాలా బాగుంది.ఇంక  డౌటే లేదు,హీరోయిన్ ఖచ్చితంగా తనకే సొంతం అని హీరో తో పాటు ప్రేక్షకుడూ అనుకునేలా సాగుతున్న కధనంలో సడెన్ గా హీరోయిన్ తను ప్రేమించట్లేదనే షాక్ ఇవడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది.ముందుగానే చెప్పుకున్నట్టు సెకండాఫ్ లో జరిగే వ్యవహారం అంతా తెలిసిందే అయినా హీరోయిన్ తన తండ్రికి దగ్గరయ్యే సన్నివేశాలు,అలాగే వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యలు తీరిపోయేలా హీరో పరిస్థితులని చక్కదిద్దడం వంటి సన్నివేశాలు బాగానే వర్కవుట్ అయ్యాయి.ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సంగీత్ సన్నివేశం  ఆకట్టుకుంటుంది.దాదాపు అన్ని క్యారెక్టర్స్  ఓపెన్ అయ్యే ఆ ఎమోషనల్ సీన్ లో ముఖ్యంగా  హీరోయిన్ తండ్రి పడిన భాదని,తన కూతురు ప్రేమకు దూరం అయ్యానన్న ఆవేదనని బాగా పండించాడు దర్శకుడు.ఆ తరువాత కాస్త మెలోడ్రామా ఎక్కువైనా క్లైమాక్స్ ని ఎక్కువ సాగదీయకుండా ముగించడం బాగుంది.మొత్తానికి తెలిసిన కధనే ఎంచుకున్నా,సెకండాఫ్ లో రొటీన్ రూట్ లో వెళ్ళినా దర్శకుడు కిశోర్ తిరుమల చాలా  వరకు తనదైన ముద్ర వేయగలిగాడు. 


నటీనటులు:

తను రెగ్యులర్ గా చేసే హైపర్ క్యారెక్టర్ నుండి కాస్త బైటకి వచ్చిన రామ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ తో సహా మిగతా క్యారెక్టర్ లకి స్కోప్ ఉన్నా,తన పాత్రకే ఇంపార్టెన్స్ ఎక్కువ,సింపుల్ గా పాత్రలో ఒదిగిపోయాడు.కీర్తి సురేష్ బాగుంది,ఆ పాత్ర ఎక్కువగా డల్ గా కనిపించినా ఆకట్టుకుంది.హీరోయిన్ తండ్రి పాత్రలో సత్యరాజ్ కూడా బాగా చేసాడు.ప్రదీప్ రావత్ ఈ సారి డిఫరెంట్ గా కామెడీ క్యారెక్టర్లో కనిపించాడు.రోహిణి నటన సహజంగా ఉంది.ప్రిన్స్,శ్రీముఖి,విజయ్ కుమార్,నరేష్,ప్రగతి,చైతన్య కృష్ణ తదితరులు ఒకే. 


సాంకేతికవర్గం:

డైలాగ్స్ చాలా బాగున్నాయి,కెమెరా వర్క్ చాలా బాగుంది,ఎడిటింగ్ కూడా.దేవిశ్రీప్రసాద్ సంగీతం లో పాటలు బాగున్నాయి,ఐతే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగుండాల్సింది. 


రేటింగ్:6.5/10

 

Posted

Movie is good man. But little slow. It's has lot of freshness overall. I like it. My mom liked it more than me. I m happy that I took her to this movie.

Posted

Background score okate music petti champadu..different different vi try cheyalsindhi

Posted

Background score okate music petti champadu..different different vi try cheyalsindhi

 

Yes just ok range lo undhi BGM edho interest lenattu kottadu :) 

Posted

Movie is good man. But little slow. It's has lot of freshness overall. I like it. My mom liked it more than me. I m happy that I took her to this movie.

 

Yeah story regular  ainapatiki lots of good/fun moments unnayi without routine comedian ni tanne scenes or spoof comedy scenes 

Posted

Yes just ok range lo undhi BGM edho interest lenattu kottadu :)

first half very nice bg score..

 

 

second half full sleep

×
×
  • Create New...