Jump to content

Good Morning Yellow Army


Recommended Posts

Posted

Good Morning Yellow Army

ఒక్కోసారి మనిషిని పరీక్షించేందుకే అన్నట్టు ప్రతికూల పరిస్థితులన్నీ ఒకేసారి ఎదురవుతాయి. వాటిని అధిగమించి మామూలు స్థితికి

రావడంలోనే ఆ వ్యక్తి ధీరత్వం, పోరాటపటిమ లోకానికి వ్యక్తమవుతాయి. అలాంటి స్థితిలోనే తమ చుట్టూ ఉన్న వాళ్ళలో తన, పర అన్న విభజన

జరుగుతుంది. అలాంటి విషమ పరిస్థితే ఎన్టీఆర్ కు 1984 ఆగష్టులో ఎదురైంది.

 

1984 ఆగష్టు... ఎన్టీఆర్ జీవితంలో అత్యంత సంక్లిష్ట కాలం. ఒకవైపు గుండెకు శస్త్రచికిత్స. మరోవైపు తన సతీమణి బసవతారకం గారికి క్యాన్సర్

అని నిర్థారణ. మరోవైపు నాదెండ్ల భాస్కరరావు, ఇందిరా కాంగ్రెస్ లు కలిసి చేసిన కుట్ర కారణంగా ముఖ్యమంత్రిగా బర్తరఫ్ కావడం... ఇవన్నీ విధి

నలువైపుల నుంచి కన్నెర్ర చేసిందా అన్నట్టు ఒకేసారి వచ్చిపడ్డ సమస్యలు. ఒకవైపు ఆరోగ్యం, మరోవైపు తనను నమ్ముకున్న ప్రజలు.

ఇంకోవైపు తన జీవన సహచరి. అన్నిటినీ కాపాడుకోవలసిన బాధ్యత ఆయనపైనే ఉంది.

 

అయితే ఆ పోరాటంలో ఎన్టీఆర్ ఒంటరి కాలేదు. తనకు జరిగిన అన్యాయం గురించి దేశం మొత్తం వినిపించేలా గర్జించారు. నాటి కుతంత్రాన్ని

ప్రజలకు వివరిస్తున్నప్పటి సందర్భమే ఈ ఫోటో. ఫలితంగా ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయంపై, కాంగ్రెస్ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై

తెలుగుదేశం, దాని మిత్రపక్ష పార్టీలు బంద్ కు పిలుపునిచ్చాయి. పౌరజీవనం స్థంభించింది. కేంద్రం నుంచి అదనపు పోలీసు బలగాలు దిగాయి.

ఎన్టీఆర్ కు మద్దతుగా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా 15 జాతీయ ప్రతిపక్షాలు ఎన్టీఆర్ కు మద్దతుగా నిలిచాయి.

ముఖ్యంగా శస్త్రచికిత్స చేయించుకున్న తమ అభిమాన నాయకుడిని అరెస్టు చేయడం, బర్తరఫ్ చేయడం సహించలేకపోయారు. 'ఎన్టీఆర్ మీరు

విశ్రాంతి తీసుకోండి. మేము ఉద్యమిస్తాం' అంటూ ఉద్వేగంతో ఊగిపోయారు, ఉద్యమించారు. ఫలితంగా కేంద్రం తలొగ్గి గవర్నరు రాంలాల్ చేత

రాజీనామా చేయించి, శంకర్ దయాళ్ శర్మను ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నియమించింది.

 

అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కు అన్నివిధాలా అండగా నిలిచి, తన చతురతతో, వ్యూహాలతో ఎన్టీఆర్ బలాన్ని నిరూపించగలిగారు.

 

993573_1203316956348560_5341439988554395

 

 

 

Source : https://www.facebook.com/TDP.Official/photos/a.204264039587195.57871.192136870799912/1203316956348560/?type=3&theater

Posted

I don't know bhayaaa ..... just Page source vesaaa chudu ... akkada undi copy chesaaa

NTR ante is it TG CM included yellow army?

 

Posted

NTR ante is it TG CM included yellow army?

kochhen lo no clarity :o
Posted

So overall gaa cbn NTR ne 10galedhu...oka vela NTR ne 10gicchadu anpisthay adhi mee mistake ani chepthunduuuu????

×
×
  • Create New...