Jump to content

Recommended Posts

Posted

తెలంగాణ ప్రాంత ప్రజల్లో తనపై ఉన్న అభిమానం ఏమాత్రం చెక్కు చెదరలేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి జోస్యం చెప్పారు. ఈ విషయం ఆ ప్రాంతంలో వాతావరణం చల్లబడిన తర్వాత నిరూపిస్తానన్నారు. ఆయన ఒక ప్రైవేట్టీవీ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల్లో రాష్ట్ర విభజన భావం లేదన్నారు. రాజకీయ నేతలే పదవుల కోసం ప్రత్యేక వాదన తెరపైకి తెచ్చారన్నారు.

ప్రజలు ఆహారం, ఉపాధి కోరుతున్నారేనీ గానీ, రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని కోరడం లేదన్నారు. ఈ మాటలను త్వరలోనే నిరూపితమవుతాయన్నారు. తెలంగాణతో పాటు తాను అన్ని ప్రాంతాల్లోనూ పర్యటిస్తానని ఆయన చెప్పారు. తాను ఒక ప్రాంతానికి చెందినవాడిని కాదని, అన్ని ప్రాంతాలకు చెందిన అందరివాడిననీ చిరంజీవి చెప్పారు.

ఇకపోతే.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరొకరిని విమర్శించే ముందు.. ఆయన గురించి ఓ సారి ఆలోచన చేసుకుంటే మంచిదని చిరంజీవి హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నట్టు మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.

ఆ పార్టీకి అంశాల వారీగానే మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ అవగాహన ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పోరాటంపై రాజీ లేదన్నారు. గత ఎన్నికల్లో తనపై అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోలేక పోయామని చిరంజీవి విచారం వ్యక్తం చేశారు.

Posted

monna 2009 elections lo chupinchadu gaaa  LoL.1q LoL.1q LoL.1q

Posted

LoL.1q LoL.1q LoL.1q[quote author=KINGMAKERS link=topic=73651.msg780671#msg780671 date=1276268670]
monna 2009 elections lo chupinchadu gaaa   LoL.1q LoL.1q LoL.1q
[/quote]

×
×
  • Create New...