Subbulu Posted January 9, 2016 Report Posted January 9, 2016 కానీ, ఈసారి సంక్రాంతికి ఏకంగా నాలుగు సినిమాలు పోటీపడడం అవసరమా? గతంలో సినిమాలు సంవత్సరం ఆడేవి. క్రమంగా అది 200 రోజులకీ, 175 రోజులకీ, 50 రోజులకీ, 25 రోజులకీ తగ్గి, ఇప్పుడు 14 రోజుల దగ్గర ఆగింది. ఫిల్మ్స్ ఆర్ రన్నిగ్ ఓన్లీ ఫర్ 2 వీక్స్. ఇప్పుడు ఎన్ని రోజులు ఆడిందని కాకుండా, ఎంత కలెక్ట్ చేసిందనేది కీలకమైంది. పెట్టిన పెట్టుబడి వచ్చేసిందా, ఎంత లాభాలు వచ్చాయన్నది చూసుకుంటున్నాం. అందుకనే, సంక్రాంతి, సమ్మర్, దసరా అనే మూడు మెయిన్ సీజన్లలో ఎక్కువమంది తీరుబడిగా ఉండి సినిమాలు చూస్తుంటారు కాబట్టి, ఆ సీజన్స్‌లో రిలీజ్ ఇంపార్టెంట్ అయింది. అయినా, సంక్రాంతికి ఒకేసారి రెండు, మూడు సినిమాలు రిలీజై, విజయవంతమైన సంఘటనలు పాత రోజుల నుంచి నిన్న మొన్నటి ‘నాయక్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ దాకా చాలానే ఉన్నాయి. కాబట్టి, పండగకి ఒకేసారి సినిమాలు రిలీజైతే తప్పేముంది! ఇందులో పోటీ ఏమీ లేదు. నా సినిమా, బాబాయ్ సినిమా, నాగార్జున గారి సినిమా, శర్వానంద్ సినిమా - అన్నీ ఆడాలి. డబ్బులు రావాలి. అప్పుడే పరిశ్రమ పచ్చగా ఉంటుంది. దీన్ని నమ్ముకొన్న వందల కుటుంబాలు బాగుంటాయి. full interview: http://www.sakshi.com/news/family/interview-jrntr-on-nannaku-prematho-304178?pfrom=home-top-story
ramudu3 Posted January 9, 2016 Report Posted January 9, 2016 క్లైమాక్స్‌లో ఒక బిట్‌కు సుక్కు నాతో 5 వెర్షన్లు చేయించారు. నా తండ్రి పాత్రధారి రాజేంద్రప్రసాద్ గారిని పట్టుకొని ఏడ్చే సీన్. అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయి, షాట్ అయిపోయినా దాదాపు 20 నిమిషాలు ఏడ్చేశా. అందరూ కలసి ఊరుకోబెట్టాల్సి వచ్చింది. ఆ రోజు సెప్టెంబర్ 2. మా అమ్మా నాన్నలిద్దరి పుట్టినరోజు అదే. నాన్న గారికి ఫోన్ చేసి నా భావాలు పంచుకున్నా. పక్కనే జగపతిబాబు గారు కూడా ఉన్నారు. అప్పుడు నాన్న గారు నాతో, ‘ఇది సినిమా. డోన్ట్ టేకిట్ టూ పర్సనల్’ అని చెప్పారు. కానీ, చేస్తున్న పాత్రను పర్సనల్‌గా తీసుకోకపోతే, నేను యాక్ట్ చేయలేను. ప్లాస్టిక్ నటన నా వల్ల కాదు. కానీ, రొమాన్స్ నటిస్తున్నప్పుడు మాత్రం ప్లాస్టిక్ నటన చేసేస్తా. తెర ముందైనా, నిజజీవితంలోనైనా రొమాన్స్ వ్యక్తం చేయడం నాకు రాదు. నాకు అదో ప్రాబ్లమ్. మా ఆవిడ ప్రణతి కూడా అదే కంప్లయింట్ చేస్తుంటుంది.
Subbulu Posted January 9, 2016 Author Report Posted January 9, 2016 ఈ సందర్భంగా బాబాయ్‌కి ప్రేమతో ఏమైనా చెబుతారా? మేమంతా ఒకే కుటుంబం. బాబాయ్ అంటే ఎవరు? నా తండ్రి తరువాత తండ్రి లాంటివాడు. మేమంతా ప్రేమను పంచుకుంటాం. ‘నాన్నకు ప్రేమతో’ లాగానే రేపు ‘బాబాయ్‌కి ప్రేమతో’అనే మంచి కథ వస్తే తప్పకుండా చేస్తా. అలాగే, ‘తాతయ్యకు ప్రేమతో’!
ultraflex Posted January 9, 2016 Report Posted January 9, 2016 క్లైమాక్స్‌లో ఒక బిట్‌కు సుక్కు నాతో 5 వెర్షన్లు చేయించారు. నా తండ్రి పాత్రధారి రాజేంద్రప్రసాద్ గారిని పట్టుకొని ఏడ్చే సీన్. అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయి, షాట్ అయిపోయినా దాదాపు 20 నిమిషాలు ఏడ్చేశా. అందరూ కలసి ఊరుకోబెట్టాల్సి వచ్చింది. ఆ రోజు సెప్టెంబర్ 2. మా అమ్మా నాన్నలిద్దరి పుట్టినరోజు అదే. నాన్న గారికి ఫోన్ చేసి నా భావాలు పంచుకున్నా. పక్కనే జగపతిబాబు గారు కూడా ఉన్నారు. అప్పుడు నాన్న గారు నాతో, ‘ఇది సినిమా. డోన్ట్ టేకిట్ టూ పర్సనల్’ అని చెప్పారు. కానీ, చేస్తున్న పాత్రను పర్సనల్‌గా తీసుకోకపోతే, నేను యాక్ట్ చేయలేను. ప్లాస్టిక్ నటన నా వల్ల కాదు. కానీ, రొమాన్స్ నటిస్తున్నప్పుడు మాత్రం ప్లాస్టిక్ నటన చేసేస్తా. తెర ముందైనా, నిజజీవితంలోనైనా రొమాన్స్ వ్యక్తం చేయడం నాకు రాదు. నాకు అదో ప్రాబ్లమ్. మా ఆవిడ ప్రణతి కూడా అదే కంప్లయింట్ చేస్తుంటుంది. yendhuku edhi highlight chesaru
SANANTONIO Posted January 10, 2016 Report Posted January 10, 2016 yendhuku edhi highlight chesaru Zoo gay ani cheppadaniki tried
Recommended Posts