Jump to content

Recommended Posts

Posted

1452597852-1696.jpg

 

ఈ ఫొటో చూస్తుంటే ఆ బిల్డింగ్‌ ఏంటని కూడా అర్థం కావడం లేదు కదూ. అదీ మరి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కు అభిమానుల్లో ఉన్న ఫాలోయింగ్‌. అనంతపురంలోని శాంతి థియేటరును ఇలా ఫ్లెక్సీలు, పోస్టర్లతో నింపేశారు అభిమానులు. ఈ ఫ్లెక్సీల సంస్కృతి ఎప్పట్నుంచో ఉన్నదే కానీ.. మరీ ఈ స్థాయిలో థియేటర్‌ మొత్తాన్ని ఇలా ఫ్లెక్సీలతో చుట్టేయడం మాత్రం ఇంతవరకు ఎప్పుడూ చూసి ఉండం. 'నాన్నకు ప్రేమతో' సినిమా మీద ఎంత హైప్‌ ఉందో.. అభిమానులు ఈ చిత్రాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో చెప్పడానికి ఈ ఈ ఫొటోనే నిదర్శనం.

రాష్ట్ర వ్యాప్తంగా అన్నిచోట్లా కూడా 'నాన్నకు ప్రేమతో' మేనియాతో ఊగిపోతున్నారు జనం. ఎన్టీఆర్‌ కు ఇది 25వ సినిమా కావడంతో 'ఎన్టీఆర్‌ 25' అని ముద్రించిన టీషర్టులతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు జనం. కర్ణాటకలోని బెంగళూరు, బళ్లారి ప్రాంతాల్లో సైతం ఎన్టీఆర్‌ అభిమానుల హంగామా మామూలుగా లేదు. ఎన్టీఆర్‌ కు మంచి సినిమా పడాలి, హైప్‌ రావాలే కానీ.. ఫ్యాన్స్‌ నుంచి ఎలా అభిమానం తన్నుకొస్తుందో ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. ఇక సినిమా అంచనాలకు తగ్గట్లే ఆడితే అభిమానుల ఉత్సాహం రెట్టింపవుతుందేమో. - See more at: http://telugu.gulte.com/tmovienews/13074/A-Theatre-Full-Of-Nannaku-Prematho-Posters-In-Ananthapur#sthash.ImHWoV64.dpuf

×
×
  • Create New...