guduraju Posted January 12, 2016 Report Posted January 12, 2016 ఎన్టీఆర్ సినిమాకి ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయని మనకు తెలుసు. షూటింగ్ లేట్ అయిందని ఫారిన్ షెడ్యూల్స్ లో బాగా ఖర్చు అయిందని అన్నారు. ఆ తర్వాత రిలీజ్ డేట్ పై కూడా బోలెడు ప్రశ్నలు సందేహాలు వచ్చాయి. ఈ మధ్యలో డీఎస్పీ తండ్రి చనిపోవడంతో అనుమానాలు పెరిగాయి. అన్నిటినీ దాటుకుని రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి.. విపరీతమైన పోటీ నెలకొంది. మరి ఇంత టఫ్ కాంపిటీషన్ లో రిజల్ట్ ఎలా ఉంటుంది.. ఉంటే కలెక్షన్స్ ఆశించిమేరకు వస్తాయా అనే డౌట్స్ ఇంకా ఉన్నాయి. ఇలాంటి సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. నాన్నకు ప్రేమతో నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ పై.. మా అసోసియేషన్ లో కంప్లెయింట్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ కి నిజంగానే డబ్బులు రావాల్సి ఉండొచ్చు. లేకపోతే ఆయన కంప్లెయింట్ చేయడనే మాటలో సందేహం లేదు. రావాలని చెప్పిన మొత్తం కూడా చిన్నదేం కాదు. ఏకంగా రెండు కోట్లు కాబట్టి.. కంప్లెయింట్ ఇవ్వడం కూడా సమంజసమే కావచ్చు. అయితే.. ఎప్పుడో 2013లో రిలీజ్ అయిన సినిమాకి ఇన్నాళ్లూ వదిలేసి 2016 లో అది కూడా ఎన్టీఆర్ సినిమా రిలీజ్ ముందు రోజే పవన్ ఇలా చేయడమేంటని అడుగుతున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్. ఈ కారణంగా రిలీజ్ ఏమీ ఆగకపోయినా.. కరెక్ట్ గా టైం చూసి ఇబ్బంది పెట్టడమేగా అన్నది వీరి ప్రశ్న. మరోవైపు.. పవన్ ఫ్యాన్స్ కూడా ఏం తగ్గడం లేదు. కమిట్ మెంట్స్ చాలా ఇచ్చి నెరవేర్చకపోవడంతోనే.. ఈ సమయంలో ఇవ్వాల్సి వచ్చిందని సర్ది చెబుతున్నారు. ఇలా ప్రశ్న సమాధానం రెండూ.. సోషల్ మీడియాలో హీరోల ఫ్యాన్స్ మధ్య బాగానే నడుస్తున్నాయి. ఇందులో వాస్తవమేంటి అంటే పవన్ కానీ ప్రొడ్యూసర్ కానీ చెప్పాలి. అంతే
Recommended Posts