Jump to content

Recommended Posts

Posted

‘నాన్నకు ప్రేమతో’.. నచ్చేస్తుంది.

 

 

రివ్యూ.. నాన్నకు ప్రేమతో 

చిత్రం: నాన్నకు ప్రేమతో.. 
విడుదల తేదీ: 13-01-2016 నటీనటులు 
ఎన్టీఆర్‌.. రకుల్‌ప్రీత్‌ సింగ్‌.. జగపతిబాబు.. రాజేంద్ర ప్రసాద్‌.. రాజీవ్‌కనకాల.. అవసరాల శ్రీనివాస్‌ తదితరులు. సంగీతం: దేవీశ్రీప్రసాద్‌, కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం: సుకుమార్‌, నిర్మాత: బీవీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌.

 

 

13brk117a.jpg

 

టాలీవుడ్‌లో విభిన్న దర్శకుడిగా పేరున్న వారిలో సుకుమార్‌ ఒకరు. వైవిధ్యభరితమైన చిత్రాలను తీస్తారన్న పేరు అతని సొంతం. అలాంటి దర్శకుడు.. ఎనర్జటిక్‌ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నాడంటే ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోయింది. విభిన్నమైన పంథాలో సినిమా సాగుతుందన్న విషయాన్ని ‘నాన్నకు ప్రేమతో..’ అన్న టైటిల్‌ ద్వారా చెప్పటం ఈ చిత్రం మీది అంచనాలను ఇంకా పెంచాయి. దీనికితోడు ఎన్టీఆర్‌ ఆహార్యం... అందరి దృష్టినీ సినిమా వైపు మళ్లేలా చేసింది. సంక్రాంతి బరిలో విడుదలైన తొలి చిత్రంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందన్నది చూస్తే..

 

కథేంటి..: 
తండ్రిని మోసం చేసి.. అవమానించిన వ్యక్తిపై కొడుకు ఎలా పగ తీర్చుకుంటాడన్న విషయాన్ని సుకుమార్‌ తనదైన శైలిలో చెప్పారు. కృష్ణ మూర్తి(జగపతి బాబు) చేతిలో రమేష్‌ చంద్రప్రసాద్‌ (రాజేంద్రప్రసాద్‌) మోసపోతాడు. రోడ్డున పడతాడు. ఎవరికీ తెలీకుండా బతకాల్సిన దుస్థితి. ఆ సమయంలో నెల రోజుల్లో తను చనిపోతాడన్న విషయం బయటకు వస్తుంది. అప్పుడే లండన్‌లో ఉన్న రమేష్‌ చంద్ర ప్రసాద్‌ వద్దకు కొడుకు అభిరామ్‌ (ఎన్టీఆర్‌) వస్తాడు.

తన కుటుంబానికి జరిగిన మోసం.. అవమానం గురించి తెలుసుకున్న అభి.. కృష్ణమూర్తి పతనం చూడాలన్న తన తండ్రి కోరికను తీర్చేందుకుసిద్ధమవుతాడు. మరి.. తండ్రికిచ్చిన మాటను అభి ఎలా తీర్చాడు? అందుకు ఎలాంటి ప్రయత్నం చేశాడు? తన తెలివితేటలతో శత్రువు పని ఎలా పట్టాడన్నది వెండితెర మీద చూడాల్సిందే.

 

ఎలా ఉందంటే.. 
విలన్‌ మీద హీరో పగ తీర్చుకోవటం మామూలు అంశమే అయినా.. అంచనాలకు భిన్నంగా కథనం సాగుతుంటుంది. ఎత్తులు.. పైఎత్తులతో విలన్‌ ఆట కట్టించే తీరు ఆకట్టుకునేలా ఉంటుంది. మైండ్‌ గేమ్‌ ఆకట్టుకునేలా సాగినా.. వాణిజ్య అంశాల పాళ్లు తక్కువగా ఉండటం కొన్ని వర్గాల వారికి నిరాశ కలిగించే అవకాశం ఉంది. ప్రథమార్థం వేగంగా సాగినా.. ద్వితీయార్థం కాస్త నెమ్మదిగా సాగినట్లుగా అనిపిస్తుంది. విలన్‌ను కట్టడి చేసేందుకు హీరో వేసే ఎత్తులు మాత్రం సరికొత్తగా అనిపిస్తాయి.

 

 

 

ఎవరెలా చేశారంటే.. 
ఈ చిత్రం మొత్తాన్నీ ఎన్టీఆర్‌ తానొక్కడే మోసే ప్రయత్నం చేశాడు. ఇప్పటివరకూ మాస్‌ లుక్‌లో కనిపించిన ఎన్టీఆర్‌.. ఈ చిత్రంలో సరికొత్తగా కనిపిస్తాడు. స్టైలిష్‌గా పాత్రలోకి ఒదిగిపోయాడు. ఆందాల ప్రదర్శనకే పరిమితమైన హీరోయిన్‌ పాత్రలకు భిన్నంగా ఈ చిత్రంలో రకుల్‌ పాత్ర సాగుతుంది. కొంత నటించే అవకాశం లభించింది. విలనిజం పండించటంలో జగపతిబాబు మరోసారి సక్సెస్‌ అయ్యారు. కాసేపు కనిపించినా రాజేంద్రప్రసాద్‌ తన మార్క్‌ నటన ప్రదర్శిస్తారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

 

 

సాంకేతికంగా.. 
దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు ఆకట్టుకుంటాయి. రెండు.. మూడు పాటలు గుర్తుంటాయి. విదేశీ లొకేషన్లు భారీగా.. అందంగా కనిపించాయి. పెట్టిన ఖర్చు తెర మీద కనిపిస్తుంది. ఎడిటింగ్‌.. కొరియోగ్రఫి బాగుంది.

 

 

13brk117b.jpg

బలాలు  * ఎన్టీఆర్‌ * సంగీతం

బలహీనత* స్లో నరేషన్‌

చివరగా:.. ‘నాన్నకు ప్రేమతో’.. నచ్చేస్తుంది.

 

http://www.eenadu.net/special-stories/special-stories.aspx?item=special-story-3

Posted

u posani right???? enti bhayaaa ivala nuvvu okkadivee unnavu promotions looo 

Clean and refreshing movie..

 

Posted

veedu enti bhayaa ila antunadu 

 

 

ఎలా ఉందంటే.. 
విలన్‌ మీద హీరో పగ తీర్చుకోవటం మామూలు అంశమే అయినా.. అంచనాలకు భిన్నంగా కథనం సాగుతుంటుంది. ఎత్తులు.. పైఎత్తులతో విలన్‌ ఆట కట్టించే తీరు ఆకట్టుకునేలా ఉంటుంది. మైండ్‌ గేమ్‌ ఆకట్టుకునేలా సాగినా.. వాణిజ్య అంశాల పాళ్లు తక్కువగా ఉండటం కొన్ని వర్గాల వారికి నిరాశ కలిగించే అవకాశం ఉంది. ప్రథమార్థం వేగంగా సాగినా.. ద్వితీయార్థం కాస్త నెమ్మదిగా సాగినట్లుగా అనిపిస్తుంది. విలన్‌ను కట్టడి చేసేందుకు హీరో వేసే ఎత్తులు మాత్రం సరికొత్తగా అనిపిస్తాయి.

 

 

Clean and refreshing movie..

 

×
×
  • Create New...