Jump to content

Recommended Posts

Posted
 
 
                     15nannakuprematho1280.jpg





కథ: 

చేతిలో ఉన్న ఉద్యోగం పోగొట్టుకుని రోడ్డుమీదికి వచ్చేసిన అభిరామ్ (ఎన్టీఆర్) తనలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్లందరినీ పోగేసి.. ‘కేఎంసీ’ అనే పేరుతో ఓ కంపెనీ మొదలుపెడతాడు.ఇంతలో అతడికి తన తండ్రి (రాజేంద్ర ప్రసాద్) అనారోగ్యం గురించి తెలుస్తుంది.ఇంకో నెలా నెలన్నరలో చనిపోబోతున్న తండ్రి.. తాను ఒకప్పుడు కృష్ణమూర్తి (జగపతి బాబు) అనే వ్యక్తి చేతిలో ఎలా మోసపోయింది చెప్పి..అతడిపై ప్రతీకారం తీర్చుకోవడమే తన చివరి కోరిక అని చెబుతాడు.మరి తండ్రి చివరి కోరిక తీర్చడానికి అభి ఏం చేశాడు? కృష్ణమూర్తిని అతను ఎలా దెబ్బ కొట్టాడు? అన్నది మిగతా కథ. 

కథనం - విశ్లేషణ: 

తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడు సుకుమార్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది,మామూలు కధలే ఎంచుకున్నా వాటిని తెరకెక్కించే విధానంలోనే తన ప్రత్యేకత చాటుకుంటాడు.టైటిల్స్ దగ్గరనుండి సినిమా చివరి వరకు తనదైన ముద్ర వేస్తాడు."నాన్నకు ప్రేమతో" సినిమా కూడా అదే సుకుమార్ స్టైల్ లో స్టార్ట్ అవుతుంది.చెయిన్ రియాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే టైటిల్స్ ఆకట్టుకుంటాయి.ముందు ముందు సినిమా కూడా అదే దారిలో నడుస్తుంది అని చెప్పకనే చెపుతాడు ఆ టైటిల్స్ ద్వారా.ఫస్టాఫ్ లో పెద్దగా టైం తీసుకోకుండానే కధేంటో చెప్పేసాడు,అలాగే హీరో-హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా బాగానే ప్లాన్ చేసుకున్నాడు.ఇంటరెస్టింగ్ గా ఓపెన్ అయి బాగానే ఎంటర్టైన్ చేసిన లవ్ ట్రాక్ ఆ తరువాత కాస్త  బోర్ కొట్టే టైం కి హీరో ఏ థియరీ ఐతే చెప్పి హీరోయిన్ ని ప్రేమలోకి దించాడో ఆ థియరీ ప్రూవ్డ్ అనే విషయాన్ని కాస్త కన్వినియంట్ గా ప్రెజంట్ చేసి ఆ ట్రాక్ ని ముగించేసాడు. ఆ తరువాత ఇంటర్వెల్ ముందు వచ్చే హీరో-విలన్ కాన్‌ఫ్రంటేషన్‌ ఎపిసోడ్ సినిమా కి హైలైట్, ఇద్దరూ తెలివైన వాళ్ళు అని ఎస్టాబ్లిష్ చేస్తూ వాళ్ళ మధ్య జరగబోయే ఇంటెలిజెంట్ గేమ్ ని హై నోట్ లో స్టార్ట్ చేస్తాడు.ఐతే సెకండాఫ్ లో అంచనాలకి తగట్టు ఆ గేమ్ ని కంటిన్యూ చేయలేకపోయాడు.స్పెయిన్ ఎపిసోడ్ టోటల్ గా వేస్ట్ అయింది.హాస్పిటల్ ఎపిసోడ్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది,రాజీవ్ కనకాల రియలైజ్ అయ్యే చిన్న సీన్ తప్ప.ఇక చివర్లో విలన్ ఆట కట్టించే సీన్, హాస్పిటల్ ఎపిసోడ్ సినిమాని కాపడగాలిగాయి కానీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకేళ్ళలేకపోయాయి.హాస్పిటల్ సీన్ అనుకున్న విధంగా వర్కవుట్ కాలేదు.సినిమాలో రిపీటడ్ ఎక్స్ప్లేనేషన్ పార్ట్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ హీరో తండ్రి ఎలా మోసపోయాడు అనే విషయం,అలాగే విలన్ ఎదుగుదల/పతనం అనే అంశాలని ఇంకా స్ట్రాంగ్ గా టచ్ చేసి ఉండాల్సింది.ఆ ఎమోషన్ మిస్ అవడం వల్లనే చివర్లో హీరో తన తండ్రి మీద ఉన్న ప్రేమ/బాధ తాలూకు ఎమోషన్ మనసులోనే దాచుకున్నట్టు  దర్శకుడు కూడా తను చెప్పాలనుకున్నది ఎక్కడో దాచేసాడు/చెప్పలేకపోయాడు అన్న ఫీలింగ్ కలిగింది. 


నటీనటులు: 

అభిరామ్ పాత్ర ఎన్టీఆర్ కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర, కేవలం డిఫరెంట్ లుక్ కాకుండా పెర్ఫార్మన్స్ పరంగా కొత్తదనం చూపించాడు,జగపతి తో ఉన్న అన్ని సీన్స్ లో ఎన్టీఆర్ నటన చాలా బాగుంది.కృష్ణమూర్తి గా జగపతిబాబు కూడా బాగా చేసాడు.రకుల్ ప్రీత్ సింగ్ బాగుంది,నటన కూడా పరవాలేదు.రాజేంద్ర ప్రసాద్ ఆ పాత్రకి సరిపోయాడు.రాజీవ్ కనకాల ఉన్నంతలో సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు.అవసరాల శ్రీనివాస్,తాగుబోతు రమేష్,నవీన్ నేని తదితరులు ఒకే. 


సాంకేతికవర్గం: 

డైలాగ్స్ బాగున్నాయి,విజయ్ చక్రవర్తి  కెమెరా వర్క్ చాలా బాగుంది,ఎడిటింగ్ ఇంకా బాగుండాల్సింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం లో పాటలు బాగానే ఉన్నా,పిక్చరైసేషన్ పరంగా ఫాలో ఫాలో సాంగ్ తప్ప ఏవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి,ఐతే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది,ముఖ్యంగా చివర్లో వచ్చే స్పెషల్ టైటిల్ థీమ్ సాంగ్ టచ్ చేసింది.


రేటింగ్: 6/10

 

Posted

Man nv above 8 ichina film edhina undaa .. Unte chudalani undi man... Do u own a website???

×
×
  • Create New...