Jump to content

Recommended Posts

Posted

దేశం మొత్తం ‘డిక్టేటర్‌’ గురించి మాట్లాడుతోంది 

 

 

నాకు తండ్రి గురువు దైవం... అన్నీ నాన్నగారే. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడానికి ఆయనే స్ఫూర్తి’’ అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన 99వ చిత్రం ‘డిక్టేటర్‌’. శ్రీవాస్‌ దర్శకత్వం వహించారు. అంజలి, సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలు. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. సోమవారం హైదరాబాద్‌లో చిత్ర విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘డిక్టేటర్‌’ పేరులోనే ఓ శక్తి ఉంది. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం గురించి భారతదేశం మొత్తం మాట్లాడుకుంటోంది. మరీ ముఖ్యంగా కోట్లాది తెలుగువాళ్లు ఈ సినిమా గురించి ఆసక్తిగా చర్చించుకొంటున్నారు. అన్ని తానై ఈ సినిమా తీశాడు దర్శకుడు శ్రీవాస్‌. సెట్లో కుటుంబ వాతావరణం కనిపించింది. ‘బాజీరావ్‌ మస్తానీ’ లాంటి గొప్ప చిత్రం తెరకెక్కించిన ఎరోస్‌ సంస్థ తెలుగులో ‘డిక్టేటర్‌’తోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం ఆనందాన్ని కలిగించింది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న ఆశయంతో అహర్నిశలూ పనిచేశాం. ఈ సినిమాలో నేను కొత్తగా కుర్రాడిలా కనిపిస్తున్నానంటుంటే చాలా ఆనందంగా ఉంది. అంజలి, సోనాల్‌ మంచి కథానాయికలు. అంజలికి మంచి భవిష్యత్తు ఉంది. ఇలాంటి తెలుగు కథానాయిక మన పరిశ్రమలో ఉండడం శుభపరిణామం. తమన్‌ సంగీతం బాగుంది. రతి అగ్నిహోత్రితో ఎన్నో ఏళ్ల కిందట కలసి నటించా. మళ్లీ ఈ సినిమా ద్వారా ఆమెని కలుసుకోవడం ఆనందంగా ఉంది. పరిశ్రమ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి. పది మందికి ఉపాధి కలగాల’’న్నారు. శ్రీవాస్‌ చెబుతూ ‘‘ప్రతి వూర్లోనూ ‘డిక్టేటర్‌’ సందడి చేస్తోంది. మాస్‌ హీరో సినిమా అంటే ఏమిటో ‘డిక్టేటర్‌’ నిరూపించింది. ఇలాంటి చిత్రానికి దర్శకుడితో పాటు నిర్మాతనీ అవ్వడం సంతోషంగా ఉంది. 98 సినిమాలు చేసిన కథానాయకుడితో నేను ఎలాంటి సినిమా చేయాలి అని చాలా ఆలోచించా. అప్పటికే అన్నిరకాల చిత్రాలూ చేశారు. అందరికీ అర్థమయ్యే కథతోనే ఆయన్ని కొత్తగా చూపించాలని ప్రయత్నించా. బాలయ్యని కొత్తగా చూపించాలంటే కొత్త బృందమే కావాలి. అందుకే శ్యామ్‌.కె నాయుడు, బ్రహ్మ కడలి, తమన్‌ లాంటి సాంకేతిక నిపుణులతో పనిచేశా’’ అన్నారు. ‘‘ఎన్టీఆర్‌తో కలసి నటించలేదని బాధపడ్డా. ఆలోటు ఈ సినిమాతో తీరింది. ఈ చిత్రంలో బాలకృష్ణని చూస్తే నాకు ఎన్టీఆరే గుర్తొచ్చార’’న్నారు సుమన్‌. ‘‘నేను తెలుగు పరిశ్రమలో ఉన్నానంటే కారణం బాలకృష్ణగారే. ‘లెజెండ్‌’ తరవాత మరోసారి ఆయనతో కలసి నటించడం సంతోషంగా ఉంది. ఆయనతో పనిచేస్తూ చాలా విషయాలు నేర్చుకొన్నాన’’ంది సోనాల్‌ చౌహాన్‌. ఈ కార్యక్రమంలో గౌతంరాజు, శ్యామ్‌.కె నాయుడు, శ్రీధర్‌ సీపాన, భాస్కరభట్ల, రఘుబాబు, రాజీవ్‌ కనకాల, బెనర్జీ, కాశీవిశ్వనాథ్‌, జీవీ, గిరి, గుండు సుదర్శన్‌, అశోక్‌కుమార్‌, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Posted

does he mean Telugu DESHAM party lo

Posted

yeah nuvvem anukunnav


ade anukunna just confirm cheskundam ani..
thanks for the confirmation
Posted

baavi lonchi yepdu batytiki vastado bala..:giggle:

100th movie Bahubali records ni break chesina next min
×
×
  • Create New...