Jump to content

Recommended Posts

Posted

22brk-156.jpg

 

ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: చెప్పులన్నీ లైన్‌లో పెట్టి వాళ్లంతా గుడికి కాదు వెళ్తున్నది బ్యాంక్‌కి. నిజం.. డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంక్‌ కెళ్తే మహా అంటే గంటో, రెండో గంటలో పట్టొచ్చు. కానీ ఈ బ్యాంక్‌ నుంచి డబ్బులు తీసుకోవాలంటే మాత్రం అర్ధరాత్రి నుంచే ఇలా చెప్పులు క్యూలో పెట్టి మనుషులు వెళ్లిపోయి తమ పనులు తాము చేసుకుంటారు. చెప్పుల క్యూని బట్టి తమ వంతు వచ్చేసరికి ఎంత సమయం పడుతుందో అంచనా వేసుకుని అప్పుడొస్తారు. ఆ బ్యాంక్‌కి అంత డిమాండ్‌ ఎందుకంటే ..!

 

ఈ బ్యాంక్‌ మధ్యప్రదేశ్‌లోని షాడోల్‌ జిల్లా కేంద్రానికి 62 కి.మీ.ల దూరంలోని సిద్ధి గ్రామంలో ఉంది. ఈ ప్రైవేట్‌ బ్యాంకుకి 25-30 గ్రామాల్లో ఖాతాదారులు ఉన్నారు. దాంతో నిత్యం వందలాది వినియోగదారులు ఈ బ్యాంక్‌కి వస్తారు. వారందరి అవసరాలు తీర్చడానికి అక్కడ ఉన్నది ముగ్గురే సిబ్బంది. అందుకే ప్రజలకు ఈ తిప్పలు. ఉదయం బ్యాంక్‌కి వస్తే తిరిగి ఏ అర్ధరాత్రో మరుసటి రోజో ఇంటికి చేరుకునే పరిస్థితి. అందుకే ఎంత చలి ఉన్నా అర్ధరాత్రే బ్యాంక్‌ వద్దకు వచ్చి తమ చెప్పుల్ని ఇలా క్యూలో పెడతారు. ఉదయం బ్యాంకు తెరిచాక వచ్చి ఆ లైన్‌లో తాము నిలబడి డబ్బు తీసుకుంటారు.

 

ఈ పద్ధతి మరో అక్రమానికీ తావిచ్చింది. కొంతమంది క్యూలో తమకంటే ముందున్నవారికి పదో పరకో ఇచ్చి తాము ముందుకు వెళ్తుంటారు. కొంతమంది అసలు బ్యాంకుకెళ్లే అవసరం లేకపోయినా లైన్లో నిలిచి అవసరం ఉన్నవారినుంచి డబ్బు తీసుకుని తాము తప్పుకొంటారు.

×
×
  • Create New...