Jump to content

Recommended Posts

Posted

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ వంద కోట్ల(బిలియన్‌) మైలురాయిని చేరుకుంది. ఫేస్‌బుక్‌కు చెందిన ఈ యాప్‌ను సోమవారం నాటికి వంద కోట్ల మంది యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. తమ యాప్‌ను ఆదరించిన వారందరికీ ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మందికి వాట్సాప్‌ను చేరువ చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వాట్సాప్‌ సృష్టికర్తలు జాన్‌, బ్రెయిన్‌లను అభినందించారు. 
యాహూ మాజీ ఉద్యోగులైన బ్రెయిన్‌ ఆక్టన్‌, జాన్‌ కోమ్‌ 2009లో వాట్సాప్‌ను స్థాపించారు. దీన్ని 2014 ఫిబ్రవరి 19న 19.3 బిలియన్‌ డాలర్లకు ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసింది. అప్పటికి 50 మిలియన్లు ఉన్న యూజర్ల సంఖ్య కేవలం రెండేళ్లలో రెట్టింపయ్యింది. సంస్థను స్థాపించిన ఏడేళ్లలో ఈ ఘనత సాధించడం పట్ల వ్యవస్థాపకులు హర్షం వ్యక్తం చేశారు. 
రోజుకు 42 కోట్ల మెసేజ్‌లు 
వంద కోట్ల యూజర్లు కలిగిన వాట్సాప్‌ ద్వారా రోజుకు 42(42బిలియన్‌) కోట్ల మెసేజ్‌లు బదిలీ అవుతున్నాయి. 1.6 బిలియన్‌ ఫొటోలు షేర్‌ అవుతున్నాయి. 1 బిలియన్‌ గ్రూపులు వాట్సాప్‌లో ఉన్నాయి.

 

 

02brk_wtsapp2.jpg

×
×
  • Create New...