Jump to content

Recommended Posts

Posted

Theri-Movie-Teaser-Record-in-Youtube-145

 

‘తెరి’ టీజర్.. నాలుగు రోజులుగా యూట్యూబ్ ను షేక్ చేసేస్తున్న వీడియో ఇది. తమిళ స్టార్ హీరో అభిమానులు ముద్దుగా ‘ఇళయదళపతి’ అని పిలుచుకునే విజయ్ కథానాయకుడిగా  నటించిన సినిమా.. తెరి. విజయ్ గత సినిమా ‘పులి’ డిజాస్టర్ అయిన నేపథ్యంలో ‘తెరి’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. మధ్యలో తమ బద్ధ శత్రువైన అజిత్ ‘వేదాలం’తో హిట్టు కొట్డడం.. విజయ్ పేరిట ఉన్న యూట్యూబ్ రికార్డుల్ని బద్దలుకొట్టడం ఇళయదళపతి ఫ్యాన్స్ కు రుచించలేదు. అందుకే ‘తెరి’ టీజర్ రిలీజ్ కావడం ఆలస్యం విజయ్ అభిమానులు రెచ్చిపోయారు. ఈ టీజర్ కు భారీ వ్యూస్ లైక్స్ తెచ్చిపెట్టారు. సౌత్ ఇండియాలో మరే సినిమాకు సాధ్యం కాని రికార్డుల్ని అందుకుంది ‘తెరి’ టీజర్.

10 లక్షల వ్యూస్ మార్క్ టచ్ చేయడానికి ‘తెరి’ టీజర్ కు 12.5 గంటలే పట్టింది. లక్ష లైకులు కూడా ఆరున్నర గంటల్లోనే వచ్చేశాయి. 20 లక్షల వ్యూస్ చేరడానికి 22 గంటలు.. 30 లక్షల వ్యూస్ మార్కు అందుకోవడానికి 29 గంటలు.. 40 లక్షల వ్యూస్ పూర్తి కావడానికి 52 గంటలు మాత్రమే పట్టింది. 2 లక్షల లైకుల మైలురాయి కూడా 50 గంటల్లోనే పూర్తయింది. అసలు ఇండియాలోనే ఇప్పటిదాకా ఏ టీజర్ కు కూడా 2 లక్షల వ్యూస్ రాకపోవడం విశేషం. ప్రస్తుతం 50 లక్షల వ్యూస్ మార్కుకు చేరువగా ఉంది ఈ టీజర్. విజయ్ కు ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందో.. యూట్యూబ్ రికార్డుల్ని అతడి అభిమానులు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో చెప్పడానికి ఈ గణాంకాలే రుజువు.

Posted

ee pichi veellaki kuda paakindhaa telugu lo inka remake ready ayipovachu emo -1xsWM.gif

Posted

ee pichi veellaki kuda paakindhaa telugu lo inka remake ready ayipovachu emo -1xsWM.gif

giphy.gif

Posted

YouTube likes software ki piccha demand anukunta Vijay and ajith fans ki

giphy.gif

×
×
  • Create New...