Jump to content

Recommended Posts

Posted

ఈ సంక్రాంతికి ‘సోగ్గాడు..’గా వచ్చి తన ప్రతాపం చూపించారు నాగార్జున. బంగార్రాజుగా నాగార్జున నటన, ఆయన స్టైల్‌... అభిమానులకు తెగ నచ్చేశాయి. దాదాపు రూ.50 కోట్ల వసూలు సాధించి నాగార్జున కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది. దాంతో ‘సోగ్గాడే చిన్నినాయన’ కథపై నాగ్‌కి మరింత ప్రేమ పెరిగింది. ఈ చిత్రాన్ని కొనసాగించాలని నాగ్‌ నిర్ణయించుకొన్నారు. అందుకే ఇప్పుడు ‘బంగార్రాజు’ టైటిల్‌ని ఫిల్మ్‌ఛాంబర్‌లో నమోదు చేయించారని సమాచారం. ‘సోగ్గాడే...’ కథలో బంగార్రాజు, రాము పాత్రల్లో కనిపించారు నాగ్‌. బంగార్రాజు మరణించిన తరవాత ఆత్మ రూపంలో భూమ్మీదకు వచ్చిన తరవాత ఏం జరిగింది? అనే విషయాన్ని చూపించారు. దానికి ముందు జరిగిన కథేంటి? అన్నది ‘బంగార్రాజు’లో చూడొచ్చని తెలుస్తోంది. ఈ చిత్రానికీ కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

×
×
  • Create New...