Jump to content

Recommended Posts

Posted

టోర్నమెంట్లు వేరు... ఫార్మాట్‌ వేరు... వేదిక వేరు... ప్రత్యర్థి మాత్రం ఒకటే! కానీ ఒక జట్టుకు ఘన విజయం... మరో జట్టుకు అనూహ్య పరాజయం! అవే భారత జూనియర్‌, సీనియర్‌ జట్లు! అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో శ్రీలంకపై స్ఫూర్తిదాయక విజయంతో యువ భారత్‌ రికార్డు స్థాయిలో ఐదోసారి ఫైనల్‌కు చేరితే... అదే ప్రత్యర్థితో సొంతగడ్డపై ధోని సేనకు చేదు అనుభవం ఎదురైంది. పుణెలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో లంక చేతిలో పరాభవం ఎదుర్కొంది. దాదాపు అందరూ కొత్త ముఖాలతో బరిలో దిగిన లంక అంచనాలు తలకిందులు చేస్తూ టీమ్‌ఇండియాకు ఝులక్‌ ఇచ్చింది. కుర్ర జట్టు మాత్రం అంచనాలకు తగ్గట్టే లంకను చిత్తు చేసి ఫిబ్రవరి 14న జరిగే ఫైనల్‌కు సిద్ధమైంది.

×
×
  • Create New...