Jump to content

Bhimavaram Aunty Story


Recommended Posts

Posted

మా వూరికి మంచి నీళ్లు... 
12vasu1a.jpg

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి మీద మమకారంతో అభివ్దృద్ధిని కోరుకున్న ప్రతి ఒక్కరూ శ్రీమంతులే. భీమవరానికి చెందిన రాజీ నడిపల్లి కూడా అదే కోవకు చెందుతుంది. బాగా చదువుకుని అమెరికాలో స్థిరపడినా....సొంతూరైన భీమవరం ప్రజల దాహం తీరుస్తోంది. తన సొంత సంపాదనతో నీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేసి.... స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తోంది.

కల్తీ అనేది ఇందుకలదు అందులేదనకుండా సర్వత్రా వర్ధిల్లుతోంది. ప్రాణాధారమైన మంచినీరూ కలుషితమైపోతోంది. ఎంత విషాదమిది. అది చూశాక నా మనసంతా మా వూరికి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే కాంక్షతో నిండిపోయింది. అందుకే, అమెరికాలో ఉన్నా భీమవరానికి ‘మంచి’ నీళ్లు అందించాలనే తపనతో కొట్టుకుపోయా. పర్యవసానంగా ఆ వసతి కల్పనకు లక్షల రూపాయలు వెనకాముందు చూడకుండా కేటాయించేశా. ముఖ్యంగా, రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు స్వచ్ఛమైన నీళ్లు తాగి దాహం తీర్చుకుంటుంటే సంతోషంగా అనిపిస్తోంది. మున్ముందు మరిన్ని నీటిశుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నా. మరి నేను అమెరికాలో ఉన్నాను కదా! అందుకే, ఇక్కడ నాన్న నా స్వప్నాన్ని సాకారం చేసే పనిలో పడిపోయారు. ఆయన సహకారం లేకపోతే నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కష్టం. ఇంతకీ! నా గురించి చెప్పలేదు కదూ...

పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నా సొంతూరు. మాది ఎగువ మధ్యతరగతి కుటుంబం. చదువులో ఎప్పుడూ ముందుండేదాన్ని. ఇంజినీరింగ్‌లో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచా. బెస్ట్‌ అవుట్‌గోయింగ్‌ స్టూడెంట్‌గా పతకాలు అందుకున్నా. ఈలోగా మంచి సంబంధం రావడంతో నాన్న పెళ్లి చేశారు. మా వారికి అమెరికాలో ఉద్యోగం రావడంతో నేనూ అక్కడికి వెళ్లిపోయా. అక్కడ ఖాళీగా ఉండటంతో కొన్నాళ్లకు జీవితం యాంత్రికంగా అనిపించింది. దాంతో, తాలింపు డాట్‌ కామ్‌ అనే బ్లాగ్‌ మొదలుపెట్టా. ప్రతిరోజూ ఓ వంట చేసి.. కావల్సిన పదార్థాలనూ, తయారీ విధానాన్ని ఫొటోలతో సహా పోస్ట్‌ చేసేదాన్ని. క్రమంగా బ్లాగుకి ఆదరణ పెరగడంతో.. ప్రకటనలు కూడా వచ్చేవి. దాంతో ఆదాయమూ సొంతం చేసుకున్నా. కొన్నాళ్లకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం రావడంతో వంటలు చేసి పోస్ట్‌ పెట్టడానికి సమయం చాలేది కాదు. 2013లో పోస్టులు చేయడం మానేశా.

అప్పుడే గమనించా: ఈ క్రమంలోనే 2014లో అమెరికా నుంచి భీమవరం వచ్చినప్పుడు అక్కడ నీళ్లు తాగి ఎంతో ఇబ్బంది పడ్డా. అదే సమయంలో మంచినీళ్లని కొనుక్కునే స్థోమత లేక కలుషిత జలాన్నే తాగుతున్న చాలామందిని గమనించా.. నా సొంతూర్లో ఇలా ఉందేమిటబ్బా! అని చాలా బాధేసింది. వూర్లో నీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేసి.. స్వచ్ఛమైన మంచి నీళ్లను ఉచితంగా అందిస్తే బాగుంటుందనిపించింది. అదే విషయాన్ని మావారితో, నాన్నతో చెప్పా. ‘మంచి ఆలోచన రాజీ.. అలానే చెయ్‌’ అన్నారు.

ఒక కుటుంబానికి రోజుకు ఇరవై లీటర్లు , మూడు ప్లాంట్లలో కలిపి నిత్యం పదమూడువేల లీటర్ల నీటిని శుద్ధి్ద చేసి ప్రజలకు అందించగలుగుతున్నాం.

లక్షల్లో ఖర్చు: వెంటనే భీమవరంలో రెండు నెలల పాటు సర్వే చేయించా. నాన్న ఆఫీసు ఉన్న టూ టౌన్‌ ప్రాంతంలో మొదట ఒక నీటి శుద్ధి ప్లాంట్‌ని ఏర్పాటు చేశా. దాన్ని నడిపించడానికి సౌర విద్యుత్‌ను అమర్చాం. మొదట వీటి ఏర్పాటుకు మూడు లక్షల రూపాయలకు పైగానే ఖర్చయింది. చుట్టుపక్కల వాళ్లంతా... మంచినీళ్లకోసం అక్కడికి రావడం నాకు చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. తర్వాత భీమవరంలోని రైల్వే అధికారులతో మాట్లాడి.. రెండు స్టేషన్లలో యంత్రాలను పెట్టించా. ప్రయాణికులకు విరివిగా ఉపకరిస్తున్నాయవి. ఈ లోగా....నాన్న ఆఫీసు దగ్గర ఏర్పాటు చేసిన ప్లాంట్‌ వద్దకు జనం విపరీతంగా వచ్చేవారు. ఇంత తాకిడి ఏమిటా అని గమనిస్తే...చాలామంది మా ప్లాంటు నుంచి ఉచితంగా నీళ్లు తీసుకెళ్లి బయట షాపుల్లో విక్రయిస్తున్నట్లు తెలిసింది. చివరకు మా దగ్గరకు నీళ్లకోసం వచ్చేవారి దగ్గర గుర్తింపు కార్డులు తీసుకుని యాక్సెస్‌ కార్డులు అందించాం. ఆ కార్డుల ద్వారా ఒక కుటుంబానికి ఒక రోజుకు ఇరవై లీటర్లు ఇవ్వడం మొదలుపెట్టాం. దాంతో, దుర్వినియోగాన్ని అరికట్టగలిగాం. నిత్యం దాదాపు ఐదారొందల కుటుంబాలు ఉచితంగా మా ప్లాంట్‌ నుంచి శుద్ధి చేసిన మంచినీటిని తీసుకెళుతుండటం చూసి నా మనసెంత ఆనందపడుతోందో మాటల్లో చెప్పలేను. మూడు ప్లాంట్లలో కలిపి రోజుకు పదమూడువేల లీటర్ల నీటిని శుద్ధి్ద చేసి ప్రజలకు అందించగలుగుతున్నాం.

అదొక సవాల్‌: శుద్ధి చేసిన నీటిని అందించడం ఒక ఎత్తైతే.... యంత్రాలను ప్రతి ముప్ఫై ఎనిమిది గంటలకోసారి శుభ్రం చేయించడం మరో ఎత్తు.. ఫిల్టర్లలో ఇసుక తొలగించి.. శుభ్రపరచాలి. అప్పుడప్పుడూ వాటిని మార్చాలి. మూడు యంత్రాల నిర్వహణకు మాత్రమే నాకు నెలకు అరవై నుంచి డెబ్భై వేల రూపాయలు ఖర్చవుతోంది. నేను అమెరికాలో ఉంటున్నా ప్రతినెలా నాన్నకు డబ్బు పంపుతున్నా. ఇప్పటి వరకూ ఈ ఏడాదిలో ఇరవై లక్షల రూపాయలు ఖర్చు చేశా. ఇవి ఎలా ఉన్నా.. మా నాన్న దగ్గరకు వచ్చిన చాలామంది ‘మీ అమ్మాయి ఎంత మంచి పని చేస్తుందో’ అని అంటుంటే ఆయన ఆనందం అంతా ఇంతాకాదు. భీమవరంలో మొక్కలు నాటిస్తున్నా.

 
Posted

Telugu sadavalekapothuna annai

Drunk ... So jilebi la unai words

Anyhow thanks for the post man



200.gif

Posted

Antha manchi pani chesthe .. Aa title enti

Respect ..mohan bambu.gif

Posted

Antha manchi pani chesthe .. Aa title enti

Respect ..mohan bambu.gif

manchi title pedite e edava anna vachi chustada asalu5.gif?1290195589

Posted

 

manchi title pedite e edava anna vachi chustada asalu5.gif?1290195589

WdbrQej.gif?1367839152

 

GSB4.gif?1370457845

Posted

edo ee pilla manchi pani chestunte ...veelamma gabbbu ljkodukulu nelelu tessuku poyi ammukuntunnaru anta..veela bathukulu cheda...chii,,,denamma penta manda...finally eradicate chesindi card system petti good going..GP

×
×
  • Create New...