Jump to content

Recommended Posts

Posted

సోగ్గాడే చిన్నినాయనా.. ఇది నిజంగా నాగార్జున కెరీర్‌ లో ఎప్పటికి మరిచిపోలేని సినిమా. 55 ఏళ్ల వయసులో.. రిటైర్మెంట్‌ తప్పదనుకున్న టైమ్‌ లో.. వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా నాగ్‌ కెరీర్‌ లో రికార్డులు తిరగరాసింది. ఏకంగా 50 కోట్ల మార్క్‌ అందుకుని ఇండస్ట్రీకే కాదు.. అక్కినేని అభిమానులకు కూడా షాకిచ్చింది సోగ్గాడే. ఇప్పటి వరకు అక్కినేని వంశంలో 40 కోట్ల మాటే వినిపించలేదు. అఖిల్‌ కు తప్ప మరే హీరోకు ఇది సాధ్యం కాదేమో అనుకున్నారంతా. కానీ ఇప్పుడు 40 ఏంటి.. దానికంటే పది ఎక్కువే కొట్టాడు నాగ్‌. తనయులకు సాధ్యం కాని రికార్డులని తండ్రే కొల్లగొట్టాడు. 

మనం 35 కోట్ల మార్క్‌ అందుకుని అక్కినేని హీరోల కెరీర్‌ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు సోగ్గాడే చిన్నినాయనా చాలా సింపుల్‌ గా ఆ మార్క్‌ అందుకుంది. ఇప్పటి వరకు 50 కోట్ల షేర్‌ వసూలు చేసిందని నిర్మాతలే గర్వంగా చెప్పుకుంటున్నారు. సంక్రాంతికి అంత భారీ పోటీ మధ్య విడుదలైనా.. ఫ్యామిలీ సినిమా కావడంతో సోగ్గాడే చిన్నినాయనా కలెక్షన్ల వర్షం కురిపించింది. తొలిరోజు నుంచే నాగార్జున సినిమా స్థాయిని దాటి వసూలు చేసింది. 

ఫస్ట్‌ డే 4.50 కోట్ల వసూలు చేసిన సోగ్గాడు.. రోజులు పెరుగుతున్న కొద్దీ వసూళ్ళు కూడా పెరిగాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌  ఈ సినిమాకు బాగా కనెక్టయ్యారు. ముందు మనం రికార్డుల్ని సోగ్గాడు చెరిపేయడేమో అనుకున్నారు గానీ ఇప్పుడు ఏకంగా సోలో హిట్‌ తోనే మనం రికార్డుల్ని మరుగున పడేసాడు నాగార్జున. సీనియర్‌ హీరోల్లో సోలోగా 50 కోట్ల మార్క్‌ అందుకున్నది ఒక్క నాగార్జున మాత్రమే. వెంకటేశ్‌ 50 కోట్ల మార్క్‌ అందుకున్నా.. మహేశ్‌ వాటా అందులో మేజర్‌ పార్ట్‌. మొత్తానికి అక్కినేని హీరోలకు ఓ కలగా ఉన్న 50 కోట్ల మార్క్‌ ను ముందు నాగార్జునే అందుకోవడం విశేషమే. -

  • Replies 33
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Rendu

    6

  • nenunanu

    6

  • NO17

    4

  • mettastar

    3

Popular Days

Top Posters In This Topic

Posted

4 fans 4 fans ani edicharu. Class vodu mass cheste surru summaipothadi. Jai nag jai jai jai nag bl@st

Posted

4 fans 4 fans ani edicharu. Class vodu mass cheste surru summaipothadi. Jai nag jai jai jai nag bl@st

mega fans ante..epudu edustaru andari medha..
×
×
  • Create New...