Jump to content

Forgotten Legends: Dr.yellapragada Subbarao


Recommended Posts

Posted

evaru veeru

teleedha ??

 

short presentation dekho

 

his drug methotrexate is still used for chemotherapy

 

https://www.youtube.com/watch?v=Mbdiut6JujA

Posted

evaru veeru

name ey Eppudu vinaleda uncle.. Ma time lo aithey school lo undeydi ippudu ela thagalabaddayoo syllabus 2w2r5gm.jpg
  • 2 weeks later...
Posted

https://www.youtube.com/watch?feature=player_embedded&v=-88QLw35a98

Posted

https://www.youtube.com/watch?feature=player_embedded&v=3odh3Iucyko

Posted

chinnapdu telugu text book lo lesson undedi yellapragada subbarao garidi

Posted

https://www.youtube.com/watch?feature=player_embedded&v=LCMcvnXQy1M

Posted

https://www.youtube.com/watch?feature=player_embedded&v=4bzhSt9g5YU

Posted

కీ.శే. యల్లాప్రగడ సుబ్బారావుగారు దైనిందిన జీవితంలో ప్రతి తెలుగువాడు, గుర్తుంచుకోవాల్సిన "మహా మనీషీ", "కర్మ యోగి". ఆయన గురించి భావి తరాలవారికి తెలియజేయడం మన "కనీస విధి". ఎల్లాప్రగడ సుబ్బారావు గారు: పశ్చిమగోదావరి జిల్లాలోని, నర్సాపురంలో పుట్టి పెరిగిన ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయ్యారు. శాస్త్రవేత్తలలో ఋషిగా ఎన్నదగిన మన సుబ్బారావుగారు 20వ శతాబ్దపు తొలి అధ్యాయంలోనే, అమెరికా వెళ్ళి రక్తహీనత, బోదకాలు, మొదలైన అనేక రోగాలకు మందులను కనిపెట్టారు. ఒక పరిశోధనా బృందానికి నాయకత్వం వహించి, శాస్త్రవేత్తగా ప్రజలకు సేవ చేసిన సుబ్బారావు గారు ప్రచారాడంబరాలని దరి చేరనివ్వలేదు. బీద కుటుంబంలో పుట్టి కూడా డబ్బుకు ఆశ పడకుండా నిస్వార్ధంగా కృషిసల్పిన కర్మయోగి. అతడు మన తెలుగు వాడవ్వడం మన జాతి యావత్తూ గర్వించదగిన విషయం. చిన్నతనంలో తన తండ్రికి ఉద్యోగం లేదని, రోగిష్టి అని ఇతరులకు చెప్పడం ఇష్టంలేదు. తల్లిని బాధించడం మరింత బాధగా ఉంది. అందుకే అరటి పండ్లు అమ్ముకొని అయినా బ్రతకవచ్చునని పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ సంగతి గ్రహించిన తల్లి కేకలు వేసి, శ్రద్ధగా చదువుకోమంది. సుబ్బారావు గారికి పరీక్షలింకా రెండు నెలలున్నాయనగా అతని తండ్రి చనిపోవడంతో నర్సాపురం తిరిగి వచ్చారు. ఇంట్లో పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఐనా తల్లి తన మంగళసూత్రాలు అమ్మి డబ్బు ఇచ్చింది. పట్టుదలగా చదివి ఇంటర్మీడియట్ పరీక్ష పాస్ అవగానే, రామకృష్ణ మఠానికి వెళ్ళి అక్కడ స్వామీజీతో “స్వామీజీ!నేను సన్యాసిని కావాలనుకుంటున్నాను” అని అన్నారు. ఎందుకని? అని వద్దన్నారు. మానవసేవ చేయమని సలహా ఇచ్చారు. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రజలు రోగ పీడితులవ్వడం, రోగాల వల్లే చనిపోవడం గమనించాడు. అప్పుడనుకున్నాడు. స్వామీజీ మాట నిజమని, మనిషి సాటి మనిషి గురించి మానవత్వంతో ఆలోచించాలని తర్వాత దేవుడని. అప్పుడే సుబ్బారావుకి ఏదో కనిపెట్టాలని తపన, నానాటికి ఎక్కువ సాగింది. పరిశోధనవైపు ఆలోచనలు పరుగెత్తాయి. 1919లో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమానికి మద్దతునిచ్చాడు. ఖాదీబట్టలతో తిరగడం మొదలెట్టాడు. ఈ ధోరణి ఆనాటి ప్రొఫెసర్ డా.బ్రాడ్ ఫీల్డ్ కి నచ్చలేదు. ఆయన సర్జరీ ప్రొఫెసర్ అందువల్ల చివరి పరీక్షలో సర్జరీ తప్ప మిగిలిన వాటిల్లో అన్నిటిలోనూ సుబ్బారావుకి మంచి మార్కులొచ్చాయి. దానివల్ల అతనికి యం.బి.బి.యస్. డిగ్రీకి బదులు ఎల్. ఎం.ఎస్. సర్టిఫికేట్ మాత్రమే లభించింది. సుబ్బారావు కొద్దికాలం మద్రాస్ ఆయుర్వేద కళాశాలలో పనిచేశాడు. అలోపతి నయం చేయలేని రోగాల్ని ఆయుర్వేదం చేయగలదు. ఆయుర్వేదానికి, పాశ్చాత్య పద్ధతి జోడించినట్లయితే – ఫలితం అద్భుతంగా ఉంటుందనుకొని అమెరికాలోని హార్వార్డ్ విశ్వవిద్యాలయానికి పరిశోధన నిమిత్తం వెళ్లాడు. ఆర్ధిక ఇబ్బందుల వలన ఉద్యోగ ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. ఆ రోజుల్లో అమెరికాలో ప్రాక్టీసు చేయడానికి, భారతీయ డాక్టర్లకు అనుమతి లేదు. ఒక ఆసుపత్రిలో రోగుల మూత్రపాత్రలను, ఇతర సామగ్రిని, శుభ్రంచేసే ఉద్యోగం దొరికింది. సుబ్బారావు ఏ మాత్రం సందేహించకుండా, అసహ్యించుకోకుండా అందుకు ఒప్పుకున్నాడు. అలా కష్టపడుతూనే చదివి ట్రాఫిక్ లో మెడిసిన్ లో డిప్లొమా సంపాదించాడు. ఆ తర్వాత సుబ్బారావు హార్వార్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో “బయోకెమిస్ట్రీ” కోర్సులో చేరారు. ఉదయం 8 గంటలకు ప్రయోగశాలకు వెడితే మళ్ళీ అర్ధరాత్రి బైటికి వచ్చేవాడు. రాత్రింబవళ్ళు కృషిచేసి, సరైన రసాయనాన్ని కనిపెట్టి, ఫలితం సాధించాడు. ఇవాళ్టికి కూడా బయో-కెమిస్ట్రీ విద్యార్ధులు చదివే మొదటిపాఠం సుబ్బారావు కనిపెట్టిన పద్ధతి గురించే. వైరస్ ఫ్లూ జ్వరానికి మందు కనిపెట్టాడు. తన అన్నగార్ని చంపినా రోగానికి మందు కనిపెట్ట కల్గినందులకు సుబ్బారావు ఆనందపడ్డాడు. కానీ అది తన ప్రతిభేనని చాటించుకోలేదు. ఈ విజయం వెనుక సమిష్టి కృషి ఉందనీ చెప్పేవారాయన. “టేట్రోసైక్లిన్” అనే యాంటిబయాటిక్ అను మందుకు కనుగొన్నారు. అది మార్కెట్ లో ఇప్పటికీ ఉంది కదా! సుబ్బారావు పరిశోధనల్లో కాన్సర్ కూడా చోటు చేసుకుంది. చిన్న పిల్లల్లోని బ్లడ్ కాన్సర్ కు చికిత్స చేయడానికి మందును కనిపెట్టి ప్రయోగించారు. కానీ పూర్తిగా నయమవ్వలేదు. కానీ, రోగి జీవితకాలాన్ని పొడిగించగలిగారు. యాభై మూడవఏటే – హృద్రోగంతో కన్నుమూశారు సుబ్బారావు. ఆయనొక విజ్ఞాన ఖని, శాస్త్రవేత్త. ఎన్నో భయంకర వ్యాధులకు మందుల్ని కనిపెట్టి, మానవాళికి ఎనలేని సేవచేసిన నిస్వార్ధ శాస్త్రవేత్త ఎల్లాప్రగడ ప్రతివారికి ప్రాతః స్మరణీయుడు. CURTESY: “TELUGU OFFICIAL” ఈ పోస్టింగ్ నేను నా ఫేసే బుక్ పేజి లో చాలా కాలం క్రితం పోస్ట్ చేసాను . శ్రీ కిరణ్ ప్రభ గారు మరిన్ని విషయాల్ని ప్రేక్షకుల ముందుంచి చాల గొప్ప సేవా నిరతి ప్రదర్శించారు . వారికి నా నమస్సుమాంజలలు . కీ. శె. సుబారావు గారు ఓ కర్మ యోగి - దైవాంశ సంభూతుడు

Posted

Athani USA vachi student ga padina kashtalu evaru padi vundaru man.. Papam ginjalu tine vadanta..scholarship dorakaledu anta..fall admissions ki 2 weeks late ga vachadu anta..

Posted

USA vachaka 21 years India vellaledhu anta..malli family ni chudaledhu anta..papam alane nidra lo heart attack vachi chanipoyaru..

×
×
  • Create New...