Jump to content

Recommended Posts

Posted

చెన్నై: వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఓ శునకానికి, మేకకు పెళ్లి చేసిన ఘటన తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో చోటుచేసుకుంది. స్థానిక హిందూ మహా సభ కార్యకర్తలు హిందూ సంస్కృతిని అవమానించడానికే ఈ వాలెంటైన్స్‌ డే అంటూ ఇలాజంతువులకు పెళ్లి చేశారు.
వాలెంటైన్స్‌ డే అనేదే ప్రేమను అవమానిస్తుందని, దాని పేరుతో కొందరు ప్రేమికులు రోడ్లపై అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారని, ఇలాంటి ఘటనలు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తాయని హిందూ మహా సభ నేత బాలసుబ్రహ్మణ్యన్‌ అన్నారు. ఇలా జంతువులకు పూలమాలలు వేసి పెళ్లి చేయడం పట్ల స్థానికులు నిరసన వ్యక్తంచేశారు.

dog-goat.jpg

×
×
  • Create New...