Hitman Posted March 1, 2016 Report Posted March 1, 2016 నారా వారి బినామీ దందా... నారా లోకేశ్ బినామీ దందా...బినామీలు: వేమూరు రవికుమార్, తదితరులు► కొనుగోలు 500 ఎకరాలు► చెల్లించినది రూ. 50 కోట్లు► ప్రస్తుత విలువ రూ. 650 కోట్లు రాజధాని భూకుంభకోణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్‌ది ప్రధాన పాత్ర. ఆయన తన బినామీల్లో అత్యంత ప్రధానమైన వేమూరు రవికుమార్ ప్రసాద్ పేరుతో భారీగా భూములు కొనుగోలు చేశారు. ఎకరా, రెండెకరాలు వేర్వేరు పేర్లతో అగ్రిమెంట్లు రాయించుకుని,రాజధాని ప్రకటన వచ్చాక తాపీగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. చినబాబు రాజధాని ప్రాంత రైతుల నెత్తిన కుచ్చు టోపీ ఎలా పెట్టారో మీరూ చదవండి...బినామీ పేర్లతో 500 ఎకరాల కొనుగోలు రాజధానిపై శాసనసభలో సెప్టెంబర్ 4న ప్రకటన చేయకముందే.. ప్రధాన రాజధాని ప్రాంతం(కోర్ కేపిటల్)కు సమీపంలో ఉండే అమరావతి మండలంలో లోకేశ్ బినామీ వేమూరు రవికుమార్ భారీ ఎత్తున భూముల కొనుగోలుకు తెరతీశారు. అమరావతి మండలం ధరణికోటలో 59/ఎ2/1, 59/ఎ2/2ఎ, 59/ఎ2/2బి1, 59/ఎ2/3ఎ, 59/ఎ/2, 59/బి, 61/ఎ1, వైకుంఠపురంలో 25 సర్వే నంబర్లలో 502.31 ఎకరాలకుపైగా భూమిని డాక్టర్ వేమూరు రవికుమార్ ప్రసాద్, ఆయన భార్య అనురాధ, గోష్పాది గ్రీన్‌ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థల పేర్లతో కొనుగోలు చేశారు. ఎకరానికి కనిష్టంగా రూ.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.9 లక్షలు మాత్రమే చెల్లించారు. రైతులకు అరకొరగానే అడ్వాన్సులు ఇచ్చారు. ఆగస్టు 5, 2015న తక్కిన పైకం చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంతటితో ఆగలేదు. బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకున్నారిలా.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్న సొమ్మును వైట్ మనీగా మార్చుకోవడానికి లోకేశ్ తన బినామీలతో వ్యూహాత్మకంగా పావులు కదిపారు. అమరావతి మండలం ధరణికోట, వైకుంఠపురం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ మార్కెట్ రేటు ఎకరం భూమి రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంది. కానీ.. వేమూరు రవికుమార్, ఆయన భార్య అనురాధ, గోష్పాది గ్రీన్‌ఫీల్డ్స్ ప్రైవేటు లిమిటెడ్ తదితర సంస్థల పేరుతో కొనుగోలు చేసిన భూముల విలువను ఎకరా రూ.71,20,108 మేర డాక్యుమెంట్లో చూపించడం గమనార్హం. అంటే పది రెట్లు మార్కెట్ రేటు పెంచి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తద్వారా బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది. ఎవరీ రవికుమార్? ఈవీఎంలు చోరీ చేసి, ట్యాంపరింగ్ చేసి భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు యత్నించిన వేమూరు హరికృష్ణ ప్రసాద్ సోదరుడే వేమూరు రవికుమార్. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున సోషల్ మీడియాలో ప్రచార బాధ్యతలను వేమూరు హరికృష్ణ ప్రసాద్ నిర్వర్తించారు. టీడీపీ, హెరిటేజ్ ఫుడ్స్, ప్రభుత్వ ఐటీ వ్యవహారాలను పర్యవేక్షించే వేమూరు హరికృష్ణ ప్రసాద్‌ను.. చంద్రబాబు అధికారం చేపట్టగానే ఈ-గవర్నెన్స్ అథారిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ, ఇన్నోవేషన్ సొసైటీల్లో సభ్యునిగా నియమించారు. రూ.333 కోట్లతో చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు తొలి దశ టెండర్ల మదింపు, పర్యవేక్షణ కమిటీల్లో సభ్యునిగా నియమించారు. వేమూరు రవికుమార్ సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు అమెరికా పర్యటనకు ఏర్పాట్లు చేశారు. అందుకు క్విడ్ ప్రోకోగా చంద్రబాబు అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 9న రవికుమార్‌ను ప్రభుత్వ సలహాదారు (ప్రవాస తెలుగు ప్రజల వ్యవహారాలు, సేవలు, పెట్టుబడులు)గా నియమించారు. ఇప్పుడు ఆ రవికుమార్, ఆయన భార్య, సంస్థల పేర్ల తో 500 ఎకరాలకుపైగా భూములను కొనుగోలు చేశారు.
Hitman Posted March 1, 2016 Author Report Posted March 1, 2016 సుజనా భూదోపిడీబినామీలు: శ్రీ కళింగ గ్రీన్‌టెక్ కెమికల్స్, శివరామకృష్ణ►కొనుగోలు 700 ఎకరాలు►చెల్లించినది రూ. 35 కోట్లు►ప్రస్తుత విలువ రూ. 700 కోట్లు ఆయనో కార్పొ‘రేటు’ రాజకీయ నేత. సీఎం చంద్రబాబునాయుడు కోటరీలో ముఖ్యుడు. బ్యాంకుల నుంచి వందలాది కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుని ఎగ్గొట్టడంలో ఆయనది అందెవేసిన చేయి. ఆ జగజ్జంత్రీ నేర్పరితనానికి మెచ్చి రాజ్యసభకు పంపిన చంద్రబాబు.. నరేంద్రమోదీ కేబినెట్లో చోటు దక్కేలా చేశారు. ఆయనే కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి. బ్యాంకులకు రూ.100 కోట్లకుపైగా టోపీ పెట్టి వెనకేసుకున్న సొమ్ముతో ఆయన రాజధాని ప్రాంతంలో ఏకంగా 700 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. మరో 130 ఎకరాలకుపైగా అటవీ భూమిని కబ్జా చేసే యత్నాలను ముమ్మరంగా సాగిస్తున్నారు.సోదరుడి పీఏ పేరుతో... సుజనా చౌదరి సోదరుడు యలమంచిలి జతిన్ కుమార్. తన సోదరుడి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసే హర్షానంద పేరుతో శ్రీ కళింగ గ్రీన్ టెక్ కెమికల్స్ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ పేరుతో రాజధాని ప్రకటనకు ముందే కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో సర్వే నంబర్లు 399-7, 402-1ఏ, 403-4, 5, 6, 404-1, 5, 6, 9బీ, 11, 12, 410-2, 412, 413, 415, 416, 417-4, 427-2, 428-1, 2, 429, 431, 432-1, 433, 434, 437లలో 126.44 ఎకరాల భూమిని ఎకరం రూ.ఐదు లక్షల చొప్పున కొనుగోలు చేశారు. రాజధాని ప్రకటన తర్వాత అక్కడ ఎకరం రూ.50 లక్షలకు పైగా పలుకుతుండటం గమనార్హం. అంటే.. రాజధాని ఎక్కడ వస్తుందన్న సమాచారం ముందే తెలుసుకున్న కేంద్ర మంత్రి గుడిమెట్ల రైతులను మోసం చేసి రూ.56.89 కోట్ల మేర లబ్ధి పొందినట్లు విశదమవుతోంది. ఇప్పుడు ఆ భూములకు సమీపంలోనే 130 ఎకరాల విస్తీర్ణంలో అటవీ భూములు ఉన్నాయి. వాటిని కబ్జా చేయడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆ అటవీ భూముల్లోకి మేతకు పశువులను కూడా వెళ్లనివ్వకుండా సుజనా చౌదరి నియమించిన రౌడీలు అడ్డుకుంటున్నారని గుడిమెట్ల వాసులు వాపోతున్నారు. ఆగని దోపిడీ... సుజనా చౌదరి భూదోపిడీ వీరులపాడు, కంచికచర్ల మండలాలకూ విస్తరించింది. వీరులపాడు మండలం పొన్నవరంను దత్తత తీసుకున్న సుజనా చౌదరి ఆ గ్రామంలో తన తండ్రి వై.జనార్దనరావు పేరు తో సర్వే నంబరు 38-1లో 5.39 ఎకరాలు, సోదరుడు వై.శివ రామకృష్ణ పేరుతో సర్వే నంబరు 41లో 3.5 ఎకరాలు కొనుగోలు చేశారు. కంచికచర్ల మండలం కీసర వద్ద సర్వే నంబరు 116/3లో 3.60 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇదే రీతిలో రాజధాని ప్రాంతంలో కృష్ణా జిల్లా చందర్లపాడు, కంచికచర్ల, వీరులపాడు, గుంటూరు జిల్లా మంగళగిరి మండలాల్లో 700 ఎకరాలకుపైగా భూమిని సుజనా చౌదరి కొనుగోలు చేసినట్లు తెలిసింది. తన వద్ద డబ్బులు ఉన్నాయని.. భూములు కొనుగోలు చేస్తే తప్పేమిటని రాజధాని ప్రకటన వెలువడ్డ తర్వాత విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ సుజనా అంగీకరించడం.. వారు రాజధాని రైతులను మోసం చేసి కుట్రపూరితంగా భూములు కొన్నారనడానికి నిదర్శనం.
Hitman Posted March 1, 2016 Author Report Posted March 1, 2016 మురళీమోహన్ రియల్ భేరి► కొనుగోలు 53 ఎకరాలు►చెల్లించినది 16 కోట్లు► ప్రస్తుత విలువ 212 కోట్లు హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, పరిసర ప్రాంతాల్లో సినీనటుడు మాగంటి మురళీమోహన్ సంస్థ జయభేరి పేరిట సాగిన భూదందా మీకు గుర్తుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తనకు అత్యంత సన్నిహితుడైన ప్రస్తుత రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ను రంగంలోకి దింపారు.కోర్ కేపిటల్‌కు సమీపంలోనే... హైటెక్ సిటీ, పరిసర ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు చేపట్టి భారీగా సొమ్ము చేసుకున్న మురళీ మోహన్ ఇప్పుడు కలకత్తా- చెన్నై జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లోని భూములపై దృష్టి పెట్టారు. ప్రధాన రాజధాని ప్రాంతం(కోర్ కేపిటల్)కు అత్యంత సమీపంలో తాడేపల్లి మండలం కుంచనపల్లిలో జాతీయ రహదారి పక్కనే ఉన్న81/3సీ, 80/4బీ, 81/2, తదితర ఎనిమిది సర్వే నంబర్లలోని 2.775 హెక్టార్ల (సుమారు 7 ఎకరాలు) విస్తీర్ణంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మించేందుకు జయభేరీ సంస్థ సిద్ధమైంది. ఆ మేరకు భూముల యజమానులతో యార్లగడ్డ రవి కిరణ్, గీతాంజలి, నిఖిల్ ఆదిత్య, శ్రీధీర, బెస్ట్ ఫార్చూన్ కంపెనీ పేరిట ఒప్పందం కుదుర్చుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జయభేరి సంస్థకు 14 అంతస్తులతో రెసిడెన్షియల్ ప్రాజెక్టును నిర్మించడానికి జూలై 21, 2015న సీఆర్డీఏ అధికారులు ఆగమేఘాలపై అనుమతి ఇచ్చేశారు. దీంతో జయభేరి సంస్థ బహుళ అంతస్తుల రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ముందే బ్రోచర్లతో హడావుడి చేసి.. ఇప్పటికే సగానికి పైగా ప్లాట్లను ఎన్ఆర్ఐలకు అమ్మేసి సొమ్ము చేసుకుంది. ఈ ప్రాజెక్టుకు సమీపంలోని 53 ఎకరాల భూమిని ఎకరం రూ.30 లక్షల చొప్పున తన బినామీ పేర్లతో మురళీమోహన్ కొనుగోలు చేశారు. ఈ భూమిలో స్టార్ హోటళ్లు, షాపింగ్‌మాల్స్, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Hitman Posted March 1, 2016 Author Report Posted March 1, 2016 దళితులకు రావెల ద్రోహం►భార్య రావెలశాంతి జ్యోతి►కొనుగోలు 55 ఎకరాలు►చెల్లించినది 5.5 కోట్లు►ప్రస్తుత విలువ 82.5 కోట్లు రాజధాని పరిసర ప్రాంతాల్లో అసైన్డు భూములను కొనుగోలు చేయడంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు తన సహచర మంత్రులతో పోటీ పడ్డారు. ఇతర మంత్రులు బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేస్తే.. రావెల కిశోర్‌బాబు ఏకంగా తన భార్య రావెల శాంతిజ్యోతి పేరుపై భారీ ఎత్తున భూములు కొన్నారు. ఈ క్రమంలో అసైన్డు భూముల చట్టాన్ని అపహాస్యం చేశారు. రాజధాని పరిసర ప్రాంతాల్లో అధిక శాతం అసైన్డు భూములు దళిత రైతుల చేతుల్లో ఉన్నాయి. ఆ రైతుల హక్కులను పరిరక్షించాల్సిన మంత్రి రావెల.. వారికి తీరని ద్రోహం చేశారు. అసైన్డు భూములను ప్రభుత్వం ఉత్తినే లాక్కుంటుందని తన సహచరులతో ప్రచారం చేయించి.. దళిత రైతులను భయాందోళనకు గురిచేశారు. ఎకరం భూమిని గరిష్ఠంగా రూ.పది లక్షల నుంచి రూ.15 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. మంగళగిరి మండలం కురగల్లులో తెనాలి రూబేనుకు సర్వే నెంబరు 563/3లో 0.83 ఎకరాల అసైన్డు భూమి ఉంది. ఈ భూమి ఆ కుటుంబానికి జీవనాధారం. ఆ భూమిని తన భార్య రావెల శాంతి జ్యోతి పేరుతో కొనుగోలు చేసిన మంత్రి రావెల.. మంగళగిరి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆగస్టు 5, 2015న పెండింగ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సుమారు 25 ఎకరాల అసైన్డు భూమిని జీపీఏ(జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) చేయించుకున్నారు. తన సన్నిహితుడు తేళ్ల శ్రీనివాసరావుకు చెందిన మైత్రీ ఇన్ఫ్రా పేరుతో మంగళగిరి మండలం నవులూరులో సర్వే నంబరు 613/2లో 0.75 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, అక్టోబరు 16న రిజిస్ట్రేషన్ చేయించారు. మొత్తమ్మీద బినామీలు, తన భార్య పేరుపై సుమారు 55 ఎకరాల అసైన్డు, పట్టా భూములను రావెల కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
Hitman Posted March 1, 2016 Author Report Posted March 1, 2016 రత్తిపాటి ఖాతాలో ‘అసైన్డు’►కొనుగోలు 196 ఎకరాలు►చెల్లించినది రూ. 39 కోట్లు►ప్రస్తుత విలువ 784 కోట్లు రాజధాని ప్రాంతంలో బినామీలను అడ్డుపెట్టుకుని నిరుపేద దళిత రైతులకు చెందిన అసైన్డు భూములను కొల్లగొట్టడంలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దూకుడు చూపారు. అసైన్డు భూములను ప్రభుత్వం ఉత్తినే లాక్కుంటుందని.. భూ సమీకరణ కింద ప్యాకేజీ ఇవ్వదని దళిత రైతులను బెదిరించారు. ఆందోళనలో మునిగిపోయిన దళిత రైతుల నుంచి ఎకరం రూ.కనిష్ఠంగా రూ.10 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.20 లక్షల చొప్పున 196.4 ఎకరాల భూమిని హస్తగతం చేసుకున్నారు. చట్టంలో లోపాలను ఆధారంగా చేసుకుని కొన్ని భూములు బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్, కొన్నింటికి పవర్ ఆఫ్ అటార్నీ చేయించుకున్నారు.
Hitman Posted March 1, 2016 Author Report Posted March 1, 2016 నారాయణ.. నారాయణ!►కొనుగోలు 3,600 ఎకరాలు►చెల్లించినది 432 కోట్లు►ప్రస్తుత విలువ 14,400 కోట్లు రాజధాని భూసమీకరణలో ప్రధాన భూమిక పోషించిన పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ.. భూదందాలోనూ ముందున్నారు. రాజధాని చుట్టూ వందలాది ఎకరాల భూములు కొనుగోలు చేసిన ఆయన.. రాజధాని గ్రామాల్లో బినామీ పేర్లతో అత్తెసరు ధరలకే 3,600 ఎకరాల భూములు కొనుగోలు చేశారని అధికారవర్గాలే చెబుతున్నాయి. భూసమీకరణ కింద ఆ భూములు ఇచ్చిన మంత్రి పి.నారాయణకు ఒకే ప్రాంతంలో ఇంటి, వాణిజ్య ప్లాట్ల రూపంలో 400 ఎకరాల భూమి దక్కనుందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ‘సాక్షి’కి చెప్పారు.
micxas Posted March 2, 2016 Report Posted March 2, 2016 :3D_Smiles: enti ivanni nijama.. asalu antha land avialble undha :3D_Smiles:
Hitman Posted March 2, 2016 Author Report Posted March 2, 2016 :3D_Smiles: enti ivanni nijama.. asalu antha land avialble undha :3D_Smiles: Nijamo kado kani.. sakshit inko 3 years ilantivi rastane untadu... EENADU vaadu rasadu ga everyday 1st item Jaggai meede untadi..elections mundu..this is also into similar lines..
micxas Posted March 2, 2016 Report Posted March 2, 2016 Nijamo kado kani.. sakshit inko 3 years ilantivi rastane untadu... EENADU vaadu rasadu ga everyday 1st item Jaggai meede untadi..elections mundu..this is also into similar lines.. may rajanna saakshi..
Recommended Posts