Jump to content

Recommended Posts

Posted
కాపు రిజర్వేషన్ల సమస్యపై మరోసారి ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శల దాడి చేశారు. దరిద్రంలో ఉన్నాం కాబట్టే రిజర్వేషన్లు అడుగుతున్నాం. 33 ఎకరాల భూమి లాక్కున్నారు, డ్యాన్స్ చేస్తారా... తుపాకి పెట్టి బెదిరించి లాక్కున్నారు. కాపు రిజర్వేషన్లు గురించి నేనడుగుతుంటే డిక్టేట్ చేస్తున్నానని అంటున్నారు. నాపై ఎదురుదాడి చేయమని అంటున్నారు. నేనేమైనా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చానా. 
 
జగన్ మోహన్ రెడ్డితో కుమ్మక్కయ్యానని మీరు అంటున్నారు. అసలు జగన్ వయసు నా రాజీకయ జీవితం అంతలేదు. అతడు నాకేం చెప్తాడు. మీ రాజకీయాలు గురించి నాకు తెలిసినంతగా జగన్ మోహన్ రెడ్డికి తెలియవు. కానీ ఆయన తండ్రి వైఎస్ అంటే నాకు చాలా ప్రేమ. నాకు సహాయం చేస్తానని ఆయన ఎన్నిసార్లు ముందుకు వచ్చినా సున్నితంగా తిరస్కరించాను. నాకు జగన్ మోహన్ రెడ్డికి ఏవో సంభాషణలు జరుగుతున్నాయని నా ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారు. తెలంగాణలో మీ ఫోన్ ట్యాప్ చేస్తే గొల్లుమని ఏడ్చారు. గుర్తులేదా. మీరు మనుషులు మేము మనుషులం కాదా. 
 
మా జాతికి రిజర్వేషన్లు కల్పిస్తానని మీరే ఎన్నికల సమయంలో చెప్పారు. ఇప్పుడు అదే మాట నేను అడుగుతుంటే నాపై ఎదురుదాడి చేయిస్తున్నారు. ముఖ్యమంత్రిగారూ... మీరు చేస్తున్నది న్యాయమేనా... కాపులకు న్యాయం జరుగకపోతే మళ్లీ నేను దీక్షలో కూర్చుంటా. రిజర్వేషన్లు సాధించేవరకూ నేను పట్టు వీడనంటూ ముద్రగడ మీడియా సమావేశంలో చెప్పారు.
Posted

what this guy wants bhyaaaa .... eee madyaa okatee nolli chesthunadu ?????

×
×
  • Create New...