Jump to content

Recommended Posts

Posted
తెలుగుదేశం పార్టీ.. వైకాపా నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అసెంబ్లీ నైతిక నియమావళి ప్రకారం సభ్యులంతా తమ ఆస్తుల వివారలను సమర్పించాల్సి ఉంటుంది. గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి తనకున్న అప్పులు, ఆస్తులు, వాటి విలువల వివరాలను ఇస్తున్నట్లు స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా జగన్ తన ఆస్తుల విలువ రూ.279 కోట్లుగా తెలిపారు. జగన్ ఇచ్చిన ఆస్తులు, అప్పుల వివరాలను టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ బయటపెట్టారు. 
 
జగన్ ఆస్తుల వివరాలపై ఆయన చెప్పిన లెక్కలన్నీ అసత్యమన్నారు. చివరికీ తేదీ కూడా తేడాగా వేసి పంపారని దుయ్యబట్టారు. జగన్ తన కారు కూడా తనదని చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని విమర్శించారు. జగన్ అధికారులను బతిమాలుకొని ఇంతకాలం విచారణ ఆపుచేయించుకొన్నారు. ప్రస్తుతం తన ఆస్తుల జాబితాలో ప్రత్యేకంగా ఆ కారు గురించి రాశారని.. అది సండూర్ పవర్ కంపెనీదని చెప్పుకున్నారు. అది వేరే కంపెనీది అయితే తన ఆస్తుల జాబితాలో దాని గురించి ఎందుకు రాయాల్సి వచ్చింది? జగన్ ఆస్తుల జాబితాకు.. సండూర్‌ పవర్‌ కంపెనీకి గల సంబంధం ఏమిటని పయ్యావుల ప్రశ్నించారు. 
×
×
  • Create New...