Jump to content

Recommended Posts

Posted

విజయవాడ: మంత్రి నారాయణ శుక్రవారం నాడు కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పైన విరుచుకుపడ్డారు. ఆయన దీక్ష చేస్తానని చెప్పడం సరికాదన్నారు. ముద్రగడకు తుపాకీ గురి పెట్టి జగన్ ఆయనతో దీక్ష చేయించే ప్రయత్నాలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ముద్రగడ ఫిబ్రవరి 5న దీక్ష చేశారని, కొందరు రైళ్లు తగులబెట్టారని, ఇవన్నీ అయిపోయాయన్నారు. అయితే, తాము కాపులకు ఇచ్చిన హామీలు కట్టుబడి ఉన్నామని చెప్పినప్పటికీ ముద్రగడ మళ్లీ హెచ్చరికలు జారీ చేయడం విడ్డూరమన్నారు. మేనిఫెస్టోలో చెప్పనప్పటికీ.. సంవత్సరానికి రూ.1000 కోట్ల చొప్పున మొత్తం అయిదేళ్లకు రూ.5వేలకోట్లు ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున మొదటి ఏడాది తక్కువ ఇచ్చినప్పటికీ మొత్తానికి అయిదేళ్లలో రూ.5వేల కోట్లు ఇస్తారన్నారు. అది జగన్ స్క్రిప్ట్ వైయస్ జగన్ స్క్రిప్ట్‌ను ముద్రగడ చదువుతున్నారని ఆరోపించారు. ముద్రగడ వ్యాఖ్యల వెనుక జగన్ హస్తం ఉందన్నారు. కాపు కార్పోరేషన్ ద్వారా 32వేల మందికి రూ.192 కోట్ల లబ్ధి చేకూరుతుందన్నారు. పచ్చ చొక్కాల వారికి రుణాలు ఇస్తున్నారని చెబుతున్నారని, అందరితో పాటు వారికి ఇవ్వవద్దా అన్నారు. పచ్చ చొక్కాలకు ఇచ్చారని ముద్రగడ చెప్పడం వెనుక.. జగన్ హస్తం ఉందని చెప్పారు. నూరు శాతం కాపులు టిడిపికి ఓటు వేశారని చెబుతూనే... పచ్చ చొక్కాలకు రుణాలు అని చెప్పడం ఏమిటన్నారు. జగన్ స్క్రిప్ట్ చదవడం సరికాదని, లేదంటే వైసిపిలో చేరాలని సూచించారు 

×
×
  • Create New...