ye maaya chesave Posted April 9, 2016 Report Posted April 9, 2016 కథ: భైరవ్ సింగ్ (శరద్ ఖేల్కర్) అనే దుర్మార్గుడి అరాచకాలకు అల్లాడిపోతుంటుంది రతన్ పూర్ గ్రామం. దీంతో రాజకుటుంబానికి విధేయుడైన హరినారాయణ (ముఖేష్ రుషి).భైరవ్ కు అడ్డుకట్ట వేయడానికి సర్దార్ గబ్బర్ సింగ్ (పవన్ కళ్యాణ్)ను రప్పిస్తాడు.ముందు అల్లాటప్పాగా కనిపించిన సర్దార్.ఆ తర్వాత భైరవ్ కు తలపోటులా తయారవుతాడు.భైరవ్ ఆట ఎలా కట్టించాడన్నది మిగతా కథ. కథనం-విశ్లేషణ: కధగా చూసుకుంటే పాత కధే,ఎన్నో సినిమాల్లో చూసిందే.ఆ కధకి అన్ని హంగులూ సరిగ్గా కుదిరితే విజయం సాదించడం పెద్ద సమస్యేమీ కాదు.గ్రామస్తుల మీద విలన్ అరాచకలని చూపిస్తూ కాస్త రొటీన్ గానే స్టార్ట్ అవుతుంది ఫస్టాఫ్.హీరో ఊళ్లోకి రావడం,విలన్ గ్యాంగ్ తో కామెడీ,కాజల్ తో లవ్ ట్రాక్ బాగానే వర్కవుట్ అయ్యాయి.ఇక తౌబా తౌబా పాట నుండి ఊపందుకుని ఇంటర్వెల్ వరకు అలరిస్తుంది సినిమా.ఇంటర్వెల్ ముందు వచ్చే పెద్ద ఫైట్ ఎపిసోడ్ సినిమా మొత్తానికే హైలైట్ అని చెప్పుకోవచ్చు. విలన్ అహంకారాన్ని దెబ్బకొట్టి వెనకడుగు వేయించేలా చేసే సన్నివేశంతో హై నోట్ లో ఎండ్ అవుతుంది ఫస్టాఫ్.ఐతే సెకండాఫ్ చాలావరకు క్లూలెస్ గా సాగుతుంది,లవ్ ట్రాక్ ఒక కొలిక్కి రావడంతో బాగానే స్టార్ట్ అయినా ఆ తరువాత చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు.విలన్ ఆట కట్టించడానికి హీరో ఏమీ చేయడు.పైగా అవసరం లేని కామెడీ సన్నివేశాలు సహనాన్ని పరీక్షిస్తాయి ,అలాగే ఇంటర్వెల్ లో అంత పెద్ద కాన్ఫ్రంటేషన్ తరువాత విలన్ రియాక్షన్ మొదట్లో ఏదో చేస్తాడన్నట్టు బిల్డప్ ఇచ్చినా,అతని రియాక్షన్ కూడా బాగా లేట్ గా చూపించారు.అది కూడా చివర్లో ఏదో హీరో కి కొన్ని సమస్యలు తెచ్చిపెట్టాలన్నట్లుగా కొన్ని నిందలు మోపడం ఫోర్సుడ్ గా ఉందే తప్ప ఏ మాత్రం ఎఫెక్టివ్ గా లేదు. ఇక క్లైమాక్స్ కి ముందు వచ్చే సంగీత ఎపిసోడ్ గబ్బర్ సింగ్ లో అంత్యాక్షరి ఎపిసోడ్ తరహాలో ట్రై చేసినా అస్సలు వర్కవుట్ కాలేదు,పైగా ఆ సిచ్యుయేషన్ కి ఆ ఎపిసోడ్ అస్సలు సింక్ కాదు.ఇక క్లైమాక్స్ మొదట్లో బుల్లెట్ల వర్షం తరహాలో సాగినా చివర్లో హీరో-విలన్ మద్య వచ్చే ఆ ఫైట్ బిట్ బాగుంది.సినిమా ఐపోయాక వచ్చే రాజులకే రాజు బిట్ సాంగ్ బాగుంది,అందులో ఉన్న ఎనర్జీ మిగతా సెకండాఫ్ లో ఏ కోశానా కనిపించదు.మొత్తానికి పవన్ తన సినిమాని అభిమానులకి అంకితం ఇవ్వాలి అనుకోవడం మంచి విషయమే అయినా,అతని ఆలోచనలు ఆచరణలో కూడా సరిగ్గా కనిపించి ఉంటే ఆ ప్రయత్నానికి ఒక అర్ధం అంటూ ఉండేది. నటీనటులు: పవన్ అంటే ఎనర్జీ ఎనర్జీ అంటే పవన్ అన్న నానుడికి అనుగుణంగా ఫస్టాఫ్ లో దాదాపు ప్రతి సన్నివేశం లో చెలరేగిపోయిన పవన్, సెకండాఫ్ లో ఒకటి రెండు సన్నివేశాలు,చివర్లో వచ్చే బిట్ సాంగ్ మినహా డల్ గా ఉండి డిసప్పాయింట్ చేసాడు.కాజల్ యువరాణి పాత్రకి సరిగ్గా సరిపోయింది,అందంగా ఉంది. విలన్ గా శరద్ బాగానే చేసాడు.ముఖేష్ రిషి పరవాలేదు.అలీ,బ్రహ్మి,బ్రహ్మాజీ,పోసాని,రావు రమేష్,తనికెళ్ళ భరణి తదితరులు ఒకే. ఇతర సాంకేతిక వర్గం: సాయి మాధవ్ బుర్రా రాసిన మాటలు చాలా వరకు బాగున్నాయి.కెమెరా,ఎడిటింగ్ వర్క్ ఒకే. దేవిశ్రీప్రసాద్ సంగీతం లో పాటలు వినడానికి బాగానే ఉన్నా,తౌబా తౌబా పాత తప్ప ఏవీ పిక్చరైసెశన్ పరంగా ఆకట్టుకోలేదు.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హీరో ఎలివేషన్ కి టైటిల్ సాంగ్ థీమ్ బాగా వాడినా,మిగతా సన్నివేశాలకి అంతంత మాత్రమే.యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. రేటింగ్: 5/10 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.