Jump to content

Recommended Posts

Posted
roja_ysrcp_d1460886326.jpg

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఫైర్‌ బ్రాండ్‌ రోజా తెలుగుదేశం పార్టీపై మరోమారు ఫైర్‌ అయ్యారు. టీడీపీలో మగాళ్ళు లేకనే, వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్‌ కోరుతూ వైఎస్సార్సీపీ నేత అమర్‌నాథ్‌ చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు పలికారు రోజా. కేంద్రాన్ని డిమాండ్‌ చేసి ప్రత్యేక రైల్వే జోన్‌ తీసుకురాలేని దద్దమ్మ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో వుందని రోజా ఆరోపించారు. 

టీడీపీ ప్రభుత్వం నిండా అవినీతిలో కూరుకుపోయిందనీ, ఇద్దరు కేంద్ర మంత్రులు, 15 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్‌కి మేలు చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు రోజా. చంద్రబాబుని చేతకాని దద్దమ్మగా అభివర్ణించిన రోజా, చంద్రబాబు లాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం దురదృష్టకరమని అన్నారు. 

కేంద్రానికి చంద్రబాబు 10 వేల కోట్లు అడిగితే 700 కోట్లు మాత్రమే వచ్చిందనీ, ఇది చంద్రబాబు అసమర్థతకు నిదర్శనమని రోజా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ని కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టుపెట్టారనీ, ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోవడంతోనే చంద్రబాబు, కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారనీ, చంద్రబాబు దొంగ లెక్కలు.. దొంగ పనులు బయటపడ్తాయనే టీడీపీ, బీజేపీని నిలదీయలేకపోతోందని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మిగతా విషయాలెలా వున్నా, 'తెలుగుదేశం పార్టీలో మగాళ్ళు లేరని చంద్రబాబుకి తెలుసు కాబట్టే, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారు.. చంద్రబాబుకి దమ్ముంటే.. చంద్రబాబు రాయలసీమ బిడ్డ అయితే..' అంటూ రోజా ఆవేశాగ్రహాలతో ఊగిపోవడం గమనార్హం. ఫైర్ బ్రాండింగ్ బాగానే వుందిగానీ, మరీ ’టీడీపీలో మగాళ్ళు లేరు..‘ అని రోజా వ్యాఖ్యానించడం ఏమంత సబబుగా లేదు. ఉద్దేశ్యం ఏదైనా, అది అసభ్యకరమైన పదప్రయోగమని రోజా తెలుసుకోకపోతే ఎలా.?

Posted

eee magaalla pichchi entraaa devudaa, maata ettithe magatanam gurchi frustrated gaa maatlaadutundi,  gallery_51737_7_1531504.gif

Posted
5 hours ago, timmy said:

does she wants to fill that gap ??  roja4.gif?1367791001

cheruvulu poodchala @3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...