Jump to content

Recommended Posts

Posted

http://deccanreport.com/te/reviews/allu-arjun-sarrainodu-movie-review-78682/

 

టైటిల్‌: స‌రైనోడు
జాన‌ర్‌: మాస్ మ‌సాలా అండ్ యాక్ష‌న్
న‌టీనటులు: అల్లు అర్జున్‌-ర‌కుల్‌ప్రీత్‌-కేథ‌రిన్‌-ఆది పినిశెట్టి-సాయికుమార్‌-సుమ‌న్ త‌దిత‌రులు
బ్యాన‌ర్ : గీతా ఆర్స్ట్‌
సినిమాటోగ్ర‌ఫీ: రిషీ పంజాబీ
సంగీతం: థ‌మ‌న్‌
నిర్మాత‌: అల్లు అర‌వింద్‌
క‌థ‌, స్ర్కీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: బోయ‌పాటి శ్రీను
సెన్సార్ రిపోర్ట్‌: యూ/ఏ
ర‌న్ టైం: 159 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 22, ఏప్రిల్ 2016

మూడు రూ.50 కోట్ల క్ల‌బ్‌ల సినిమాల్లో న‌టించి టాలీవుడ్‌లోనే అరుదైన రికార్డు క్రియేట్ చేసిన బ‌న్నీ-లెజెండ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన స‌రైనోడు సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. రిలీజ్‌కు ముందే భారీ బిజ‌నెస్ చేసిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లు అర‌వింద్ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో డెక్క‌న్ రిపోర్ట్.కామ్ స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:

రాష్ర్టానికి సీఎస్ కొడుకు అయిన గ‌ణ‌ (బ‌న్నీ) ఉన్న‌త చ‌దువులు చ‌దివినా ఉద్యోగం చేయ‌కుండా ఆవారాగా తిరుగుతుంటాడు. తండ్రి కోరిక మేర‌కు పెళ్లి చూపుల‌కు వెళుతూ ఆ ఏరియా ఎమ్మెల్యే హ‌న్సితారెడ్డి (కేథ‌రిన్‌)ని రోడ్డు మీద చూసి ల‌వ్‌లో ప‌డిపోతాడు. వెంట‌నే ఐల‌వ్ యూ చెప్పేస్తాడు. ఆమె చుట్టూ నాలుగు సార్లు తిరిగే స‌రికి ఆమె గ‌ణ‌కు ప‌డిపోతుంది. ఓ అమ్మాయిని ఓ బ‌డా బిజినెస్‌మేన్ కొడుకు రేప్ చేసి చంపేస్తాడు. ఈ కేసులో ఆ అమ్మాయి త‌ల్లిదండ్రుల ప‌క్షాన పోరాడుతుంటుంది హ‌న్సితారెడ్డి. నిందితుల‌కు స‌పోర్ట్‌గా నిల‌బ‌డి ఆ కేసులో వారికి అనుకూలంగా తీర్పు వ‌చ్చేలా చేస్తాడు సీఎం కొడుకు వైరం ధ‌నుష్‌(ఆది పినిశెట్టి). ఆ టైంలో గ‌ణ ఆది మ‌నుష్యుల‌ను చిత‌క్కొట్టి ఎమ్మెల్యేకు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతాడు. చివ‌ర‌కు ఎమ్మెల్యే గ‌ణ‌తో పెళ్లికి సిద్ధ‌మై గొడ‌వ‌ల‌కు దూరంగా ఉండాల‌ని అమ్మ‌వారి ద‌గ్గ‌ర ప్ర‌మాణం చేయిస్తున్న టైంలో జాను (ర‌కుల్‌ప్రీత్‌)ను విల‌న్లు త‌రుముతూ అక్క‌డ‌కే వ‌స్తారు. జానూను వాళ్లు చంపుతున్న టైంలో ఆమెను చూసి గ‌ణ‌ ఆమెను కాపాడ‌డంతో పాటు జానూ త‌న‌దే అని చెప్పి అంద‌రికి షాక్ ఇస్తాడు. అస‌లు జానుకు గ‌న‌కు గ‌తంలో ఉన్న సంబంధం ఏమిటి ?  వైరం ధ‌నుష్‌కు గ‌ణ‌కు ముందే ఎలాంటి శ‌తృత్వం ఉంది ?  మ‌ధ్య‌లో డీజీపీ సుమ‌న్‌, సీఎంల పాత్ర‌లు ఏంటి చివ‌ర‌కు ఈ స్టోరీ ఎలా మ‌లుపులు తిరిగి ఎలా ముగిసింది అన్న‌ది స‌రైనోడు సినిమా.

న‌టీన‌టుల విశ్లేష‌ణ‌:

ఈ సినిమాలో న‌టీన‌టుల ప‌రంగా చూస్తే బ‌న్నీకి గ‌ణ‌ పాత్ర‌లో వేసిన మాస్ క్యారెక్ట‌ర్ పెద్ద‌గా సూట్ అవ్వ‌లేదు. ఉన్నంత‌లో త‌న యాక్టింగ్‌, డ్యాన్సులతో పాటు ఫైట్ల‌లో మెప్పించాడు. ఎమ్మెల్యేగా చేసిన కేథ‌రిన్‌, ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌లు సినిమాలో ఉన్నారంతే….వారి గురించి చెప్పుకునేంత క్యారెక్ట‌ర్లు కావ‌వి. ఇక ఆది పినిశెట్టి లుక్స్ విలన్ రోల్‌లో బాగుండ‌గా, స్టైలీష్ విల‌న్‌గా మెప్పించాడు. ర‌కుల్ తండ్రిగా సాయికుమార్, డీజీపీగా సుమ‌న్‌, సీఎస్‌, శ్రీకాంత్ పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉన్నాయి.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్‌:

 

సాంకేతికంగా చూస్తే రిషీ పంజాబీ సినిమాటోగ్ర‌పీ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉండి మంచి మార్కులేయించుకుంటే థ‌మ‌న్ సంగీతం మాత్రం వ‌ర‌స్ట్‌గా ఉంది. నిజానికి ఈ సినిమా కోసం థ‌మ‌న్ అస్స‌లు క‌ష్ట‌ప‌డ‌లేదు. టీజ‌ర్‌లో వాడిన ఆర్ ఆర్‌నే సినిమా మొత్తం తిప్పేశాడు. హీరోకు, విల‌న్‌కు, సీన్ల‌కు సంబంధం లేకుండా ఒక‌టే బీట్‌ను ప‌దే ప‌దే వాయించేశాడు. పాట‌ల్లో మాస్ బీట్ సినిమాలో చూడ‌డానికి బాగుంది. మిగిలిన పాట‌లు ఎన్ని సార్లు విన్నా గుర్తుండేలా లేవు. ఇనుప డ‌బ్బాలో రాళ్లు వేసి మోగించిన‌ట్టే ఉంది థ‌మ‌న్ సంగీతం. కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు ఎడిటింగ్ రూంలో కూర్చుని నిద్ర‌పోయిన‌ట్టు ఉంది. 159 నిమిషాల ర‌న్ టైంలో 25 నిమిషాల బోర్ సీన్ల‌ను లేపేయొచ్చు. సినిమా చాలా చోట్ల ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టేలా సీన్లు ఉన్నాయి. కొన్ని సీన్లు చూస్తుంటే అస‌లు ప్రేక్ష‌కుడికి ఎలాంటి ఫీలింగ్స్ ఉండ‌వు. ఆర్ట్ వ‌ర్క్ క‌ల‌ర్‌ఫుల్‌గా లేదు. ఇక గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువ‌లు భారీగానే ఉన్నాయి.

క‌థ‌నం & డైరెక్ష‌న్ విశ్లేష‌ణ‌:

క‌థ‌నం, డైరెక్ష‌న్ విష‌యానికి వ‌స్తే బోయ‌పాటి శీను ఎమ్మెల్యేను హీరో ల‌వ్ చేయ‌డం లాంటి కొత్త లైన్ తీసుకోవ‌డం వ‌ర‌కు బాగానే ఉన్నా దాన్ని పాత చింత కాయ ప‌చ్చ‌డి క‌న్నా మ‌రీ రొట్ట‌గా డ‌వ‌ల‌ప్ చేసేశాడు. బోయ‌పాటి సినిమాల్లో హీరోయిజం ఓ రేంజ్‌లో ఎలివేట్ అవుతుంది. సింహా, లెజెండ్‌, భ‌ద్ర‌, తుల‌సీ చివ‌ర‌కు ప్లాప్ అయిన దుమ్ము సినిమాలో కూడా డైలాగులు, హీరోయిజం ఓ రేంజ్‌లో ఉంటాయి. ఈ సినిమాకు అవి శూన్యం. క్లాస్‌తో పాటు గ‌తంలో కొన్ని మాస్ టైప్ క్యారెక్ట‌ర్లు బ‌న్నీ చేసినా భారీ డైలాగులు, యాక్ష‌న్‌తో హంగామా చేసే బోయ‌పాటి బ‌న్నీకి ఈ క్యారెక్ట‌ర్ సెట్ చేయ‌డంలో ఫెయిల్ అయ్యాడు. సినిమాలో బ్ర‌హ్మానందం కామెడీ ట్రాక్ ప‌ర‌మ డిజాస్ట‌ర్ అయ్యింది. ఇటీవ‌ల వ‌రుస ప్లాపులు ఇస్తున్న బ్ర‌హ్మీ స‌రైనోడులో మ‌రో ప్లాప్ షో వేశాడు. ఇక హీరో లేడీ ఎమ్మెల్యేను తొలి చూపులోనే చూసి ఐల‌వ్‌యూ చెప్ప‌డం చూస్తే అది ఎంత సిల్లీగా ఉందో తెలుస్తుంది. మ‌రో ఆమె ఇంటికి వెళ్లేస‌రికి ఆమె ప్లాటైపోతుంది. ర‌కుల్‌ప్రీత్‌సింగ్ హీరో ఎవ‌రో తెలియ‌కుండా ఒక్క ఫైట్‌తోనే మ‌నోడి ల‌వ్‌లో ప‌డిపోతుంది.

ఇక పాట‌లు విన‌డానికే అర్థ ప‌ర్థం కాకుండా ఉన్నాయంటే ఎప్పుడు..ఎందుకు వ‌స్తాయో తెలియ‌దు. ఫ‌స్టాఫ్‌లో 50 నిమిషాల వ‌ర‌కు కూడా కథ మెయిన్ ట్రాక్ లోకి రాకుండా బోరింగ్‌గా ఉంటుంది. ఎమ్మెల్యేతో పెళ్లికి ఓకే చెప్పిన హీరో స‌డెన్‌గా ర‌కుల్‌ను చూసి ఆమె కోసం ఫైటింగ్ చేసేయ‌డం నువ్వు ఎప్ప‌ట‌కీ నాదానివే అన‌డం …. ఇందుకు కేథ‌రిన్ కూడా నీకు ఆమె క‌రెక్ట్ అన‌డం చూస్తుంటే అస‌లు సినిమా ఎంత ఊహాజనితంగా ఉందో అర్థ‌మ‌వుతుంది. సినిమా సెకండాఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా అతీ గ‌తీ లేకుండా ముందుకు వెళుతుంది. ఫైన‌ల్‌గా ఆది పినిశెట్టి చంపిన వాళ్లే న‌న్ను కొట్టార‌ని బ‌న్నీ మీడియాతో చెప్పై ఫైన‌ల్ ట్విస్టులు యావ‌రేజ్‌గా ఉన్నా అప్ప‌టికే సినిమా బోయ‌పాటి చేతుల్లో నుంచి సైడ్ ట్రాక్ ప‌ట్టేసింది. కొన్ని యాక్ష‌న్ సీన్లు ద‌మ్ము నుంచి య‌దావిథిగా దింపేశాడు. సినిమా చూస్తున్న వాళ్ల‌లో చాలా మందికి ద‌మ్ము గుర్తుకు వ‌చ్చింది.

ఫ్ల‌స్‌లు 
– కొన్ని చోట్ల బ‌న్నీ యాక్టింగ్‌
– నిర్మాణ విలువ‌లు

మైన‌స్‌లు
– ఫ‌స్టాఫ్‌
-సెకండాఫ్‌
– రొడ్డ కొట్టుడు బోరింగ్ స్టోరీ
– సంగీతం పాట‌లు
– రొట్ట ఆర్ ఆర్‌
– బోరింగ్ అండ్ వ‌ర‌స్ట్ స్ర్కీన్ ప్లే
– కామెడీ నిల్‌
– క్లాస్‌ను మెప్పించ‌ని క‌థ‌, క‌థ‌నాలు
– ఎడిటింగ్‌
– ర‌న్ టైం
– డ‌మ్మీగా మారిన హీరోయిన్లు
– బ‌న్నీకి సెట్ కాని మాస్ క‌థ‌నం
– బ్ర‌హ్మానందం ప్లాప్ కామెడీ షో
– బోర్ సినిమాకు మ‌రీ బోర్ చేసిన పాట‌లు

ఫైన‌ల్‌గా…..
ఓ సినిమాకు అంద‌రూ ఎలా బ‌ల‌య్యారో చూడాలంటే అందుకు ఇది స‌రైనోడు. ఇది బోయ‌పాటి కేరీర్‌లో మ‌రో ద‌మ్ము 2గా నిలుస్తుంది. ఈ స‌రైనోడు అటు మాస్ క్యారెక్ట‌ర్‌లో న‌టించిన బ‌న్నీతో పాటు ద‌ర్శ‌కుడిగా బోయ‌పాటికి నో యూజ్‌.

స‌రైనోడు మూవీ డెక్క‌న్ రిపోర్ట్‌.కామ్ రేటింగ్‌: 2.25

 

 

 

Posted

Ichina 2 theatres lo oka theatre 8:45ki booking open chesadu inka full avvaledu...just 200+ seating capacity Idhi bunny range #Amalapuram

Posted
1 hour ago, BabuRa0 said:

Ichina 2 theatres lo oka theatre 8:45ki booking open chesadu inka full avvaledu...just 200+ seating capacity Idhi bunny range #Amalapuram

brahmi55.gif

Posted

థ‌మ‌న్ సంగీతం మాత్రం వ‌ర‌స్ట్‌గా ఉంది -- ee okka line chalu gajji pattina picchi kukka review rasindi ani cheppukotaniki...songs and bgm chala bagunnai 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...