turtle Posted May 13, 2016 Report Posted May 13, 2016 తొక్కలో 40 డాలర్ల బిల్లింగ్‌రేట్ ఉన్న జాబొకటి ఉందని ఎవడో రిక్రూటర్ బెంగళూరునుండి ఒక ఇ-మెయిల్ పంపుతాడు. ఫోన్ చేసి నీ తాతముత్తాతలకి ఏ టెక్నాలజీ వచ్చు, నీ మేనమామ కొడుకు అత్తగారి పినతల్లి మొగుడు ఏ ప్లాట్‌ఫాంలో వర్కింగ్ దాకా అడుగుతాడు. గంటలో అప్‌డేటెడ్ రెజ్యూమె పంపుతావా చస్తావా అంటాడు. నేను పెద్దతోపుఖాన్‌ని, బాత్రూంలు బాగోలేవని గూగుల్లో మానేసి డకోటా స్టేట్‌కి మూవయ్యా అని నువ్వు రెజ్యూమెలో రాసుకుని ఆడికి పంపుతావ్. మళ్ళీ ఆడి బాస్ ఫోన్ చేసి రిపీట్టు తలైవా అంటాడు. ఆడి తర్వాత ఎకౌంట్ మేనేజర్ రంగంలోకి. ఈ పులిహోరంతా అయ్యాక నీ రెజ్యూమె సబ్మిట్టెడ్ టు క్లైంట్. మళ్ళీ స్ట్రగుల్ స్టార్ట్. ఫోన్ ఇంటర్వూ,, స్కైప్ ఇంటర్వూ అదయ్యాక ఇన్ పర్సన్ ఇంటర్వూ. నీ స్కిల్‌సెట్ మా రిక్వైర్‌మెంట్స్‌కి బాగా మాచ్ అయింది తమ్ముడూ , రేపెల్లుండి ఇంకో నలుగుర్ని ఇంటర్వూ చేశాక వి విల్ గెట్ బాక్ టు యూ. ఆ "గెట్ బాక్" ఇంక రాదు. నువ్వే రెండు ఇ-మెయిల్స్ నాలుగు ఫోన్‌కాల్స్ చేసి కనుక్కుని జాబ్ రాలేదని ఒక పావుగంట ఫీలయ్యి, మళ్ళీ నేను తోపుఖానుల్లో ఇంకా తోపుఖానుని అని రెజ్యూమెకి రంగులు దిద్ది రెడీ అవుతావ్. ఈ లోపల ఎవరన్నా ఏంటి గురూ జాబ్ పరిస్థితి అంటే నాలుగైదు ఇంటర్వూలు పైప్‌లైన్‌లో ఉన్నాయని చెబ్తాం. That's called HOPE. నీ స్పెషలైజేషన్ ఏదైనా బేసిగ్గా నువ్వొక సేల్స్‌మాన్‌వి. నీ స్కిల్‌సెట్‌ని అమ్ముకోడానికి ప్రయత్నం చేస్తన్నావ్. దీనెమ్మా జీవితం...40 డాలర్ల బిల్లింగ్‌రేట్‌కే నువ్వింత కిందామీదా అవుతున్నావ్. మరి ఆయనేం అనుకోవాల ? ఎక్కేగడప దిగేగడపలాగా ప్రతోడి దగ్గరికి ఈ రాష్ట్రం తరపున సేల్స్‌మాన్‌లాగా పోయి కరెంటుంది, నీళ్ళున్నాయి, రాయితీలిస్తాం రండిబాబూ అని అడుక్కుంటున్నాడు. పది గడపలెక్కి దిగితే నాలుగు పరిశ్రమలొస్తన్నాయి. ఆ ఆశే ఆయన్ని ముందుకి నడిపించేది. ఆ ఆశేరా అయ్యా మనల్నికూడా నడిపించేది. నువ్వెట్లాగయితే జాబున్నా లేకున్నా నెలమొదట్లో చచ్చినట్లు ఇంటద్దె, పిల్లలఫీజులు కట్టాలో ఆయన కూడా ప్రత్యేకహోదా, అదనపు నిధ్హులు, రాజధాని ఉన్నా లేకున్నా నెలమొదట్లో చచ్చినట్లు ఉద్యోగస్తులకి జీతాలివ్వాల. జనాలకి రేషన్‌సరుకులివ్వాల. ఆస్పత్రులకి మందులు పంపాల. ఎన్నిరోజులేడుస్తాంరా అయ్యా ఎదవేడుపులు ఆయనమీద ? Quote
raithu_bidda Posted May 13, 2016 Report Posted May 13, 2016 haha pulkas gaalo medalu gaali lekkalato kalam gadipestunnaru Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.