db_ka_ekniranjan Posted May 16, 2016 Report Posted May 16, 2016 BJP కేంద్ర నాయకత్వం తేల్చుకోవాల్సింది ఇది .... 1)తెలుగుదేశం నాయకుడు అయిన చంద్రబాబు తమ పార్టీతో చేస్తుంది ఏమిటి ? వియ్యమా ... లేక... కయ్యమా ---- స్నేహమా లేక శత్రుత్వమా... తెలుగు దేశం మిత్ర పక్షమా... లేక విపక్షమా... బాబు గారికి కుదిరినప్పుడు అంటే 1998 వరకు , మళ్ళీ 2004 నుండి 2014 వరకు BJP మతతత్వ పార్టీ ... మిగిలిన సమయంలో మంచి పార్టీనా ?? తెలుగుదేశం అనే పార్టీ చోటా నాయకులూ మాత్రం మోడీ గారిని అమిత్ షా ని తిడతారు.. బాబు గారు మాత్రం తిట్టరు , నిలదీయరు. పొగుడుతూ ఉంటారు... ఇక్కడేమో విష ప్రచారం చేస్తారు. ఏపి భాజపా అగ్ర నాయకులు లాంటి వారు బాబు గారిని రాత్రి అనక పగలు అనక పొగుడుతూనే ఉంటారు... కాని రాష్ట్ర ప్రయోజనాల కోసం లేదా పార్టీ ప్రయోజనాల కోసం ఏ ఒక్క రోజు కూడా ఆలోచించరు ... అయినా పార్టీ తో పొత్తు లేని రోజుల్లో సైతం 2004 నుండి 2014 వరకు ఒక్క విమర్శ కూడా చెయ్యరు. ఇక్కడ బాబు గారికి ఏమైనా సమస్య అనేది వస్తే BJP ప్రయోజనాలని తాకట్టు పెట్టి బాబు గారి కోసం పాటుపడతారు. 2)ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు అనేది స్పష్టం .. ఎందుకు ఇవ్వడం లేదు ఏమి ఇస్తాం అనేది స్పష్టంగా చెప్పండి.. ఎలా ఇస్తారు అనేది స్పష్టంగా చెప్పండి. Special status ఇస్తే వచ్చే ఇబ్బందులు ఏమిటి ? ఎవరి ఒత్తిడులు ఎలా ఉన్నాయి అని మా రాష్ట్ర ప్రజలకి వివరించండి. మా రాష్ట్ర ప్రజలు చాల మంచివారు, అర్ధం చేసుకుంటారు. ఆమోదిస్తారు. అలా అని మమ్మల్ని మోసగిస్తే ముంచుతారు. కేవలం BJP పొత్తు , పవన్ కల్యాణ్, రైతు రుణమాఫీ అనే 3 కారణాల వలెనే బాబు గారు అధికారంలో ఉన్నారు. ఆ రోజున మీ పార్టీ తో పొత్తు కోసం ఎవరు ఏ విధంగా బ్రోకరేజీలు చేసారో వివరించండి. ప్రత్యేక హోదా బదులు ఇలా ఏ జిల్లాకి ఏమి చేస్తున్నారో చెప్పండి. 13 జిల్లాల సమగ్ర ప్రణాళిక రచించండి. కేంద్రం ఇస్తున్న సంస్థలు బాబు గారి ప్రభుత్వం ఎందుకు హైజాక్ చేసి అన్నీ బెజావాడ, గుంటూరు అంటుంది అనేది స్పష్టంగా వివరించండి. రాజధాని మీద కేంద్రానికి ఉన్న అభిప్రాయం స్పష్టం చేయండి. ఎందుకు వేరే చోట్ల కేటాయించాల్సిన ఆఫీసులు అన్నీ బెజవాడకి మార్చారు అని నిలదీయండి. మీరు చేయబోతున్న పదకాలు .. పోలవరం అనుకోండి... ఏ పధకం అయినా సరే ఇలానే చేయండి .. ఇప్పుడు మీరు పోలవరానికి నిధులు ఎందుకు ఆపారు అనేది ముందుగా చెప్పండి. ఆ కారణాలు పట్టిసీమ కోసం ఖర్చు చేసిన నిధులు పోలవరం కింద చూపించారో అలాగే పోలవరం నిర్వాసితులకు ఇవ్వమని ఇచ్చిన నిధులు ఎలా దుర్వినియోగం చేసారో బయట ప్రపంచం ముందు పెట్టండి. పోలవరం నిర్మాణానికి ఒక కమిటీ వేయండి.. దానికి మీ పార్టీ కి చెందిన నిబద్దత కలిగిన నాయకులకు ఆ పోలవరం మీద నిర్మాణ పర్యవేక్షణ బాద్యతలు పెట్టండి. అటు ప్రచారం చేయండి. ఇటు పనులు పర్యవేక్షించండి... 3) కోవెర్టులను ఎలా సాగానంపాలి ?? పార్టీని ఎలా బతికించుకోవాలి ? ఈ రోజుకి కూడా తెలుగుదేశం లో ఉన్న తెలుగుదేశం మంత్రులు మోడీ గారు మరియు బిజెపి మోసం చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు.. కాని మన నాయకులు కొంతమంది ఈ విషయం మీద ఎందుకు నోరు మెదపరు. ఇలాంటి కోవెర్టులను గుర్తించి బయటకి పంపండి... 4) చంద్రబాబు లాంటి దుర్మార్గపు మనిషి చేసే విష ప్రచారాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు ?? ఈ విషయం మోడీ గారికి / అమిత్ షా గారికి తెలిసినంత ఎక్కువగా ఎవరికీ తెలియదు... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.