db_ka_ekniranjan Posted May 16, 2016 Report Posted May 16, 2016 ఎంపీల వద్ద ప్రధాని సంచలన వ్యాఖ్యలు నివ్వెరపోయిన ప్రజా ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ సర్కారును కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన ప్రత్యేక హోదా ఊసే లేదు. అది వచ్చే అవకాశంలేదని ఇప్పటికే టీడీపీ ఎంపీలు బహిరంగంగానే చెబుతున్నారు. మొన్నటికి మొన్న రాజమండ్రి బహిరంగ సభలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీకి ఇప్పటికే 1.4 లక్షల కోట్ల రూపాయలకు పైగా సాయం చేయబోతున్నామని ప్రకటించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదలుకుని ఒక్క మంత్రి కానీ..ఎమ్మెల్యే కానీ అవన్నీ హామీలే తప్ప..వచ్చింది శూన్యం అని ఎందుకు చెప్పలేకపోయారు?. అసెంబ్లీలో తాజాగా చంద్రబాబునాయుడు బిజెపి ఎమ్మెల్యే వ్యాఖ్యలకు స్పందిస్తూ….కూల్ గా నవ్వుతూ అవన్నీ పీపీపీ ప్రాజెక్టులు..రకరకాల హామీలే అని చెప్పారు తప్ప..కొంత కఠినంగా కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కేంద్రం ఏపీకి ఇచ్చామని చెబుతున్నది అన్నీ విభజన చట్టంలో ఉన్నవే. ఒకటి అరా ఉంటే..అదనంగా ఇఛ్చి ఉండొచ్చు. కానీ కీలకమైన ప్రత్యేక హోదా..పోలవరం విషయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గట్టిగా మాట్లాడకపోవటానికి కారణం ఏమిటి?. టీడీపీతో పాటు అన్ని పార్టీల్లో ప్రస్తుతం ఇదే చర్చ. దీనికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న అడ్డగోలు అవినీతికి సంబంధించిన వ్యవహారాలు అన్నీ మోడి చేతిలో ఉన్నాయి. ఏ ప్రాజెక్టు వెనక ఏ స్కాం జరుగుతుందనే విషయాలతో కూడిన నివేదిక మోడీ దగ్గర ఉంది. అంతే కాదు సుమా సాక్ష్యాత్తూ ప్రధాని నరేంద్రమోడీ కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ వద్దే ఏపీలో అవినీతి కంపు కొడుతోంది..మీరైనా మీ నాయకుడికి చెప్పొచ్చు కదా? అని వ్యాఖ్యనించటంతో అవాక్కవటం ఆయన వంతు అయింది. తొలుత పది నిమిషాల సమయమే ఇఛ్చిన మోడీ..తర్వాత ఇరవై నిమిషాలు ఆయనతో మాట్లాడి అక్కడ సాగుతున్న వ్యవహారాల గురించి ప్రస్తావించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పోలవరం అంచనాల పెంపు దగ్గర నుంచి పట్టిసీమ ప్రాజెక్టులో గోల్ మాల్, రాజధానికి సంబంధించి స్విస్ ఛాలెంజ్ వ్యవహారం అన్నింటిపై కేంద్రం వద్ద పూర్తి నివేదికలు ఉన్నాయని ఆ ఎంపీ తెలిపారు. సింగపూర్ సంస్థల విషయంలో చంద్రబాబు చూపిస్తున్న చొరవను ప్రధాని మోడీ, కేంద్రం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని అధికార వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. స్వయంగా మోడీ అధికారులతో సింగపూర్ కంపెనీలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని సూచించారు. ఇన్ని లోటుపాట్లు, లోపాయికారీ వ్యవహారాలు ఉన్నందునే చంద్రబాబు కేంద్రం విషయంలో మౌనంగా ఉంటున్నారని..లేకపోతే బాబు తీరు చాలా భిన్నంగా ఉండేదని పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. తేడా వస్తే మోడీతో ఎలా ఉంటుందో మాకూ తెలుసులే అని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో కూడా ఏపీ ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనకు వస్తే మోడీ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. Quote
psycopk Posted May 16, 2016 Report Posted May 16, 2016 lol... pani matta leni vadu sollu puvu article create chesadu.. Quote
alpachinao Posted May 16, 2016 Report Posted May 16, 2016 Singapore ante andhra ane kada pai article lo Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.