db_ka_ekniranjan Posted May 16, 2016 Report Posted May 16, 2016 ఇటు సొంత పార్టీ నాయకుల నుంచి, అటు వివిధ రాష్ట్రాల నుంచి, కనీసం దాని డిజైన్ మార్చి ఒక చిన్న ప్రాజెక్ట్ గా అన్నా మార్చమని ఎంతో వత్తిడి వచ్చినప్పటికీ, కాదు రాష్ట్రం మొత్తం బాగుపడాలంటే అటు ఎడమ కాలవ ద్వారా విశాఖపట్నం వరకు, ఇటు కుడి కాలవ ద్వారా కృష్ణా డెల్టా కి ఉపయోగపడేలా రూపు దిద్ది, ఇక వ్యతిరేకుల నోరు మూయించటం కోసం ఒక పక్క దానిని జాతీయ ప్రాజెక్ట్ గా అనుమతించమని కేంద్రం మీద వత్తిడి తెస్తూనే, రాష్ట నిధులతోనే త్వరితగతిన పనులు ప్రారంభించింది గతంలో ప్రభుత్వం. YSR హయాంలో ప్రాజెక్ట్ అంచనా 12,000 కోట్లు అయితే, 2011 లో దానిని 16,000 కోట్లుగా పెంచారు. దానిలో అప్పటికే 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. రాష్ట్ర విభజన జరిగింది, కేంద్రం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా బిల్లులో పెట్టింది. బాబు గారు మేము కట్టి, ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టిన బిల్లులు పెడితే, కేంద్రం ఆ బిల్లులు చెల్లించే విధంగా అంగీకారం కుదిరింది. భారతదేశంలో ఏ జాతీయ ప్రాజెక్ట్ అయినా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రం అయితే కేంద్రం 90 శాతం భరిస్తుంది, లేని రాష్ట్రం అయితే 70 శాతం భరిస్తుంది. కాని, పోలవరం ఆవశ్యకతని గుర్తించి మొత్తం 100 శాతం భరించటానికి ఒప్పుకొంది కేంద్ర ప్రభుత్వం. ఇంతవరకు బాగానే ఉంది. మరి సమస్య ఏమిటి? మొదటి సమస్య - ఎప్పుడైతే కేంద్రం రాష్ట్రం పెటిన బిల్లు చెల్లించటానికి ఒప్పుకుందో, మన రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ అంచనాని ఏకంగా 16,000 నుంచి 36,000 కోట్లకు పెంచింది. ఈ విషయం కేంద్రం వద్ద ఇంకా పెండింగు లోనే ఉంది. రెండవ సమస్య - రాష్ట్రం కేంద్రానికి సమర్పించిన పోలవరం ప్లాన్ లో ఎక్కడా పట్టిసీమ ప్రాజెక్ట్ అనేదే లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మొదట్లో ఇది పోలవరానికి సంబంధం లేదు అనే చెప్పింది. తీరా అంతా అయ్యాక, పట్టిసీమ బిల్లులు కేంద్రానికి పంపి, అవి చెల్లించమంటుంది. ఇది ఇంకా అంగీకరించలేదు కేంద్రం. ఇక్కడ మరో సమస్య ఉంది, ఎప్పుడైతే పట్టిసీమ పోలవరంలో అంతర్భాగం అవుతుందో, నిధులు మాట అటుంచి నీటి వాటాల పరంగా రాష్ట్రం చాల కోల్పోతుంది. నీళ్ళు ఇప్పటికే పట్టిసీమ ద్వారా కృష్ణకి చేరుతుంటే మిగతా ప్రాజెక్ట్ ఎందుకు అని అసలుకే ఎసరు పెట్టవచ్చు. ఎప్పుడైతే మనం 80 TMC ల నీరు గోదావరి నుంచి తోడుకుంటున్నామో, ఆటోమాటిక్ గా పైన ఉన్న మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలకు అంత నీరు కేటాయించవలసి వస్తుంది. అందుకే కెసిఆర్ గారు ఇప్పటికే పోలవరం కన్నా ఇదే మంచిది అని అనేసారు కూడా. గతంలో నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే రెండు దశాబ్దాలు నష్టపోయాం, అంటే మామూలు నష్టం కాదు, ఒక తరం పూర్తిగా నష్టపోయినట్లు. ఈ నష్టానికి ఎవర్ని ప్రశ్నించాలి? ఇక నుంచైనా రాజకీయాన్ని పక్కన పెట్టి, రాష్ట్రం గురించి ఆలోచించమని మన రాజకీయ నాయకుల్ని వేడుకుందాం. Quote
thokkalodi Posted May 16, 2016 Report Posted May 16, 2016 1 hour ago, db_ka_ekniranjan said: Ee lekkana 5000 crores tho 30-50% project complete avvale! Quote
dalapathi Posted May 16, 2016 Report Posted May 16, 2016 5 minutes ago, thokkalodi said: Ee lekkana 5000 crores tho 30-50% project complete avvale! Polavaram right canal ayyindi kada. Daantlone pattiseema daggara water lift chesi postunru. Quote
alpachinao Posted May 17, 2016 Report Posted May 17, 2016 next year ki project cost babu 75k crores sesthadu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.