db_ka_ekniranjan Posted May 17, 2016 Report Posted May 17, 2016 లక్షల కోట్లు ఎందుకు? అనకాపల్లి ఎంతో అమరావతీ అంతే! ఇప్పటికే రాజధానికి రూ.30వేల కోట్లు ఇచ్చాం హోదాతో ఒరిగేదేమీ లేదు: సోము వీర్రాజు ఏపీకి హోదా అక్కర్లేదు.. అంతకుమించిన ప్యాకేజీని కేంద్రం ఇస్తోంది: హరిబాబు (ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్) : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు ఎందుకని బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశ్నించారు. సోమవారం ఆయన అనకాపల్లి, సింహాచలంలో విలేకరులతో మాట్లాడారు. అనకాపల్లిలో మున్సిపల్ ఆఫీసు ఎంతో? అమరావతిలో ఆఫీసు కూడా అంతేనని, అంతకు మించిన ప్రాధాన్యం ఏముంటుందన్నారు. లక్షల కోట్ల రూపాయలతో అమరావతి నిర్మిస్తామంటే కేంద్రం నిధులు ఇవ్వదన్నారు. రాజధానికి రూ.4 లక్షల కోట్లు కావాలి.. రూ.5 లక్షల కోట్లు కావాలి అని ఏపీ సర్కార్ కోరడం ఎంత వరకు సబబని వీర్రాజు ప్రశ్నించారు. రాజధానికి ఇప్పటికే రూ.30వేల కోట్లను కేంద్రం ఇచ్చిందని, అయినా ఇప్పటి వరకు అక్కడ ఏ నిర్మాణం జరిగిందని ప్రశ్నించారు. ఛత్తీ్‌సగఢ్‌లో 15 ఏళ్లలో రూ.15వేల కోట్లతో బ్రహ్మాండమైన రాజధానిని నిర్మించుకున్నారని వీర్రాజు పేర్కొన్నారు. కేంద్రం అమృత్ వంటి పథకాల కింద రాష్ట్రానికి బాగానే నిధులు ఇచ్చిందన్నారు. రాష్ట్రం విడిపోక ముందు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ.6వేల కోట్లు మంజూరు చేయగా, రాష్ట్రం విడిపోయిన తర్వాత రూ.8వేల కోట్లను విడుదల చేసిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో నష్టం తప్ప ఒరిగేదేమీ లేదన్నారు. ప్రత్యేక హోదా కలిగిన 11 రాష్ట్రాలకు గడచిన మూడేళ్లలో కేంద్ర బడ్జెట్లో ఏడాదికి సుమారు రూ.7 వేల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. అదే మన రాష్ట్రానికి నరేంద్రమోదీ ప్రభుత్వం సుమారు రూ.1.42 లక్షల కోట్లు ప్రత్యేక నిధులను మంజూరు చేసిందన్నారు. అయితే జగన, వామపక్షాలు, మరికొందరు ప్రత్యేక హోదా అనే సెంటిమెంటును ప్రజల మదిలోకి అవగాహన లేకుండా చొప్పిస్తున్నారని, దీని వల్ల రాష్ట్రం తిరోగమన దిశలో పయనించే ప్రమాదం ఉందన్నారు. ఏపీకి కేంద్రం ఎక్కువ మేలే చేసింది ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అవసరం లేదని, అంతకుమించిన ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభపాటి హరిబాబు పేర్కొన్నారు. విశాఖ గ్రామీణ జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా తోట విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో, అంతకుముందు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ ప్యాకేజీల రూపంలో కేంద్రం ఇప్పటికే కోట్లాది రూపాయలు ఇచ్చిందన్నారు. ప్రత్యేకహోదా వల్ల ప్రజలకు చేకూరే లబ్ధి ఏమీ ఉండదని స్పష్టం చేశారు. కాగా.. సమావేశ ప్రాంతంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పలు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సమావేశానికి వస్తున్న బీజేపీ నాయకులను అడ్డుకోవడానికి ప్రయత్నించగా తోపులాట జరిగింది. వెంటనే పోలీసులు స్పందించి, ఆందోళనకారులను పక్కకు లాగేశారు. Quote
BabuRa0 Posted May 17, 2016 Report Posted May 17, 2016 rofl ward member ga kooda gelvani somu veraju gadu kooda talking Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.