db_ka_ekniranjan Posted May 19, 2016 Report Posted May 19, 2016 కాపుల కంట్లో కారం కొడుతున్న సర్కారు! బడ్జెట్ లో కేటాయించిన 1000 కోట్లు కాపు కార్పొరేషన్ ఖాతాలో నేటికి జమ చేయ లేదు. ఇంకా భాధాకర విషయం ఏమిటంటే నేటివరుకు కాపు కార్పొరేషన్ కు కేటాయించిద్ి కేవలం 30 కోట్లు మాత్రమే నంటా..ధీనికి కాపు tdp నాయకులు ఎOదుకు స్పంధించరో అర్దం కానీ విషయం? ఈ 30 కోట్లు ఏవిధంగా ఖర్చు చేస్తున్నారో ఎవరికీ తెలియదు. చలమాశెట్టీ గారు ఛైర్మన్ ఆయన నాటి నుండి ఒక్క నిమిషం కూడా తీరూభా లేకుండా tdp అనుచర వర్గాన్ని వేసుకొని రాష్టం అంత తిరిగారు. మరి ఈ కర్చు అంత కార్పొరేషన్ క్రింద వస్తే ఇక మిగిలేది ఎంతో ఆయనే చెప్పాలి. ఏపీ సర్కారు కాపుల విషయంలో అరకొరగా వ్యవహరిస్తోంది. కొండత రాగం తీసి గోరంత విదుల్చుతోంది. పంచపాండవులు..మంచం కోళ్ల చందాన చంద్రబాబు సర్కారు తీరు సాగుతోంది. ఓటు బ్యాంకులా చూస్తూ ఊకదంపుడు ఉపన్యాసాలు తప్పితే వాస్తవంలో సహకారం మాత్రం కనిపించడం లేదు. అందుకు తాజా ఉదాహరణ కాపు కార్పోరేషన్ రుణాల్లో తేటతెల్లమవుతోంది. ముద్రగడ ఉద్యమంతో ముందుకొచ్చిన రుణాల పంపిణీ ఇప్పుడు రానురాను ప్రచారబాజాగా మారుతోంది. కేవలం అధికారపార్టీకి తప్పితే అర్హులైన కాపులకు ప్రయోజనం దక్కేలా కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా మూడున్నర లక్షల మంది కాపులు దరఖాస్తు చేసుకుంటే లబ్ధిదారుల ఎంపిక బాధ్యత జన్మభూమి కమిటీలకే అప్పగించింది. టిడిపి కార్యకర్తలకే రుణాలు మంజూరవుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కాపు కార్పొరేషన్ ద్వారా అడిగిన వారందరికీ రుణాలిస్తామని ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష విరమించినప్పుడు ప్రభుత్వం చెప్పింది. కానీ తీరా ఆచరణ దానికి భిన్నంగా ఉంది. రూ. వెయ్యి కోట్లతో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, తక్షణమే రూ. 500 కోట్లు కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో కాపు కార్పొరేషన్ కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిరాక్స్ సెంటర్లు, ఆవుల కొనుగోలు, చిన్నపాటి దుకాణాలు, కుటీర పరిశ్రమలు, మోటార్లు, పైపులైన్లు, ట్రాక్టర్ల కొనుగోలు వంటి వాటి కోసం అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని భారీగా ప్రచారం చేసింది. ఒక్కో లబ్ధిదారునికి రూ.లక్ష చొప్పున రుణాలివ్వాలని, ఇందులో గరిష్టంగా రూ. 50 వేలు సబ్సిడీని నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపికలో మాత్రం ప్రభుత్వం మెలిక పెట్టింది. దీన్ని కూడా జన్మభూమి కమిటీలకు అప్పజెప్పింది. దీంతో ఈ రుణాల పంపిణీ ఆదిలోనే వివాదాస్పదంగా మారింది. వాస్తవంగా లబ్ధిదారుల ఎంపిక మండల స్థాయిలో ఎంపిడిఓ, పట్టణాల్లో అయితే మున్సిపల్ కమిషనర్, జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రతిపాదించిన ముగ్గురు సోషల్ వర్కర్లు, డిఆర్డిఎ పీడీ, బ్యాంకు మేనేజర్, కాపు కార్పొరేషన్ అధికారి, మండల సమాఖ్యలోని ఒక్కో సభ్యురాలితో ఈ ఎంపిక జరగాలి. జన్మభూమి కమిటీ మితిమీరిన పెత్తనంతో ఎంపిక మొత్తం గందరగోళంగా తయారైంది. ఈ నేపథ్యంలో కాపు రుణాలు అర్హులకు కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు మాత్రమే కట్టబెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో లక్ష్యం నెరవేరడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదట్లో కాపు కార్పొరేషన్ ద్వారా ఒక్కో జిల్లాలో 1200 మందికి రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. ముద్రగడ దీక్షలు, ఆందోళనలు ఉధృతం కావడంతో జిల్లా వ్యాప్తంగా భారీగా లక్ష్యాలు విధించారు. ఇలా 13 జిల్లాల్లో 1.05 లక్షల మందికి రుణాలివ్వాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఈ మేరకు గడిచిన ఫిబ్రవరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,53,479 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా ఈ వ్యవహారంలో ప్రచారం జాస్తి..ఫలితం నాస్తి అన్న చందంగా కనిపిస్తోంది. కాపులు ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ అన్నింటినీ నీరుగార్చే ప్రయత్నం సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. పేరుకి వెయ్యి కోట్లు ఇచ్చామని చెప్పుకున్నప్పటికీ వాస్తవంలో మాత్రం న్యాయం జరగకపోవడంతో చాలామంది నిరాశచెందాల్సి వస్తోంది Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.