turtle Posted May 23, 2016 Report Posted May 23, 2016 కార్యకర్తలను కాపాడుకునేందుకే టీడీపీలో చేరా: భూమా కర్నూలు: నమ్ముకున్న కార్యకర్తలతో పాటు వర్గాన్ని కాపాడుకునేందుకే తాను వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరానని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఆస్తులతో పాటు తాత, ముత్తాతలు వర్గాన్ని మిగిల్చిపోయారని, వారు కొంతకాలంగా ఇబ్బందులు పడుతుండటం వల్ల కాపాడుకోవడం కోసం అన్నింటికీ సిద్ధపడి టీడీపీలో చేరానన్నారు.కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలని, ఎవరికీ అన్యాయం జరగకుండా కలసి పనిచేద్దామని అన్నారు. Quote
turtle Posted May 23, 2016 Author Report Posted May 23, 2016 'హోదాను చంద్రబాబే అడ్డుకుంటున్నారు' హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకుండా సీఎం చంద్రబాబే అడ్డుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి అన్నారు. శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ...చంద్రబాబును చూసి తుపానే కాదు మబ్బులు కూడా పారిపోతున్నాయని ఎద్దేవా చేశారు.ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనం లేదన్న వాదనను చంద్రబాబు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని పార్థసారధి ఆరోపించారు. ఇప్పటికే హోదా పొందిన 11 రాష్ట్రాల్లో అభివృద్ధి లేదనడం అవివేకమన్నారు. అభివృద్ధి విషయంలో ఈశాన్య రాష్ట్రాలతో పోటీపడుతున్నారా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజల హక్కులను బాబు ఢిల్లీలో తాకట్టుపెట్టారని ఆయన అన్నారు. చంద్రబాబు పక్క రాష్ట్రమైనా తెలంగాణలోఅక్రమ ప్రాజెక్టులను అడ్డుకోలేని అసమర్థుడని విమర్శించారు. కృష్ణానదిని ఎడారిగా మారుస్తున్నారని పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.