turtle Posted May 26, 2016 Report Posted May 26, 2016 అమెరికాతో సాగుబంధం! హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అమెరికాలో వ్యవసాయరంగంలో పురోగతి సాధిస్తున్న అయో వా రాష్ట్రంతో తెలంగాణకు సాగుబంధం నెలకొల్పేందుకు ఆ దేశ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీ రామారావు చొరవచేశారు. తన మూడోరోజు అమెరికా పర్యటనలో భాగంగా అయోవా రాష్ర్టాన్ని సందర్శించిన కేటీఆర్.. అక్కడ అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు తెలంగాణ రైతులకు ఉపయోగపడేందుకు ఏం చేయాలో స్థానిక పాలకులతో చర్చించారు. అయోవా రాష్ట్ర వ్యవసాయరంగ పురోగతిలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ విత్తన సంస్థ డ్యూపాంట్ ప్రతినిధులతో భేటీ అయిన మంత్రి.. వాళ్లు అనుసరిస్తున్న నూతన, ఆదర్శ వ్యవసాయ విధానాలను తెలంగాణ రైతులకూ పరిచయం చేయాలని కోరారు. -మా రైతులకు సహకరించండి -విత్తన సంస్థ డ్యూపాంట్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ -రాష్ర్టానికి ప్రత్యేక బృందాన్ని పంపాలని వినతి -సానుకూలంగా స్పందించిన ప్రతినిధులు -సీఎం కేసీఆర్ స్వయంగా రైతు -అయోవా రాష్ట్ర ప్రముఖుల రౌండ్‌టేబుల్‌లో కేటీఆర్ తెలంగాణ రైతులకోసం రైస్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తిచేశారు. తొలి రెండు రోజుల్లో పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేసిన మంత్రి.. మూడో రోజు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై దృష్టి పెట్టారు. వ్యవసాయం, ఇన్సూరెన్స్ రంగంలో అపూర్వ ప్రగతి సాధించిన అయోవా రాష్ట్రంలో ఆయన పర్యటించారు. ఈ రెండు రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలతోపాటుగా అధునిక పద్ధతులతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేశారు. ప్రపంచ అహార బహుమతి సంస్థ అధ్యక్షుడు కెన్నెత్ క్విన్, అయోవా గవర్నర్ టెర్రి భ్రాన్‌స్టర్డ్‌లతోపాటు పలు సంస్థలు, పరిశ్రమల ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశాలు జరిపిన మంత్రి.. నూతన వ్యవసాయ విధానాలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో అమెరికా అనుభవాలను తెలంగాణలో ఉపయోగించుకునేందుకు ఏం చేయాలనే దానిపై చర్చించారు. నూతన విధానాలతో వ్యవసాయ రంగంలో అద్భుత ఫలితాలు సాధిస్తున్న అయోవా రాష్ట్ర గవర్నర్ టెర్రి భ్రాన్‌స్టర్డ్‌తో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయరంగంలో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను మంత్రికి ఆ రాష్ట్ర గవర్నర్ వివరించారు. వ్యవసాయరంగంలో తక్కువ రసాయనాలు ఉపయోగించడంతోపాటు, యాంత్రీకరణకే తాము ప్రాధాన్యం ఇస్తున్నట్టు కేటీఆర్‌కు టెర్రి తెలిపారు. అనంతరం విత్తన సంస్థ డ్యూపాంట్ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో డ్యూపాంట్ ఆధ్వర్యంలో ఇప్పటికే వ్యవసాయరంగంలో పలు కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. కొత్తగా బయో సైన్సెస్ రంగంలో విస్తరించాలనుకుంటున్నామని చెప్పారు. దీంతో త్వరలోనే ఒక ప్రతినిధి బృందాన్ని తెలంగాణకు పంపించాలని కేటీఆర్ వారిని కోరారు. డ్యూపాంట్‌తో జరిగిన సమావేశ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి వివరిస్తామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దేందుకు తమ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. విత్తన పరిశోధన సంస్థ అయిన డ్యూపాంట్ ఈ విషయంలో సహకరించాలని, డ్యూపాంట్ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించాలని కేటీఆర్ విజ్ఞప్తిచేశారు. తెలంగాణ రైతులకు ఆర్గానిక్ ఫార్మింగ్‌లో సహకారం అందించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన డ్యూపాంట్ ప్రతినిధులు తెలంగాణ రైతులకు శిక్షణ ఇవ్వడంతోపాటు నూతన విధానాలతో వ్యవసాయం చేసే పద్ధతులను పరిచయం చేయడానికి అంగీకరించారు. ఫుడ్ ప్రాసెసింగ్‌రంగంలో మెళకువలను పంచుకోండి: కేటీఆర్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉందని కేటీఆర్ అన్నారు. అయోవా రాష్ట్రంలోని కీలక వ్యక్తులు, సంస్థల ప్రతినిధులతో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఒకవైపు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూనే మరోవైపు దేశంలోని మెజార్టీ ప్రజల జీవనాధారమైన వ్యవసాయరంగంలో వినూత్న మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందుకు అయోవా అనుభవాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ప్రపంచ అహార బహుమతి సంస్థ అధక్షుడు కెన్నెత్ క్విన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. అయోవా సాధించిన ప్రగతిలో కీలకపాత్ర పోషించిన పలు సంస్థల ప్రతినిధులు అందుకు చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఒక రైతు అని, తమ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. రైతులకు అధునాతన వ్యవసాయ విధానాలను పరిచయం చేయడంతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అయోవా సాధించిన ప్రగతికి సంబంధించిన మెళకువలను తెలంగాణతో పంచుకోవాల్సిందిగా కోరారు. వ్యవసాయంతోపాటు బీమా రంగానికి కేంద్రంగా ఉన్న అయోవా రాష్ట్రంలోని కంపెనీలతో ప్రత్యేకంగా చర్చించేందుకు ఆయన అసక్తి వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ ఉందని, నగరానికి మరిన్ని ఇన్సూరెన్స్, నాన్ బ్యాంకింగ్ సేవల సంస్థలను తీసుకొచ్చేందుకు అయోవా రాష్ట్ర అనుభవాలను చెప్పాల్సిందిగా కోరారు. మంత్రి కేటీఆర్ వెంట పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులున్నారు. Quote
turtle Posted May 26, 2016 Author Report Posted May 26, 2016 పురపాలనలో కొత్తపుంతలు PUBLISHED: THU,MAY 26, 2016 04:34 AM ADDTHIS SHARING BUTTONS -అమెరికాలో తీరును పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్ -ఉత్తమ విధానాల అమలుపై అధికారులతో చర్చలు -కార్మెల్, ఇండియానాపోలిస్ మేయర్లతో భేటీ -సమాచార సాఫ్ట్‌వేర్, పౌరఫిర్యాదుల యాప్‌లు పరిశీలించిన మంత్రి -హైదరాబాద్‌లోకి ప్రవేశంపై ఇంటరాక్టివ్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆసక్తి హైదరాబాద్, నమస్తే తెలంగాణ: స్థానిక సంస్థల నిర్వహణలో అత్యుత్తమ విధానాలతో తమదైన ప్రత్యేకతను ప్రదర్శిస్తున్న అమెరికాలోని పలు నగరాల మేయర్లతో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు సమావేశమై ఆయా నగరాల పనితీరు గురించి సవివరంగా తెలుసుకుంటున్నారు. అక్కడ అనుసరిస్తున్న విధానాలు, అందుకు పాటిస్తున్న పద్ధతులను నిశితంగా పరిశీలించి రాష్ట్రంలో పురపాలన కొత్త పుంతలు తొక్కేలా చేయాలని భావిస్తున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ మంగళవారం కార్మెల్, ఇండియానాపోలిస్ నగరాల మేయర్లతో సమావేశమై.. స్థానిక పాలనలో పాటించే అత్యుత్తమ విధానాలను పరిశీలించారు. కార్మెల్ సిటీ హాల్‌లో జరిగిన సమావేశంలో మేయర్ జేమ్స్ బ్రయనార్డ్ నగర నిర్వహణకు సంబంధించిన కీలకమైన అంశాలను మంత్రి కేటీఆర్‌కు వివరించారు. మంచినీరు, విద్యుత్తు సరఫరా, ప్రజారవాణా, మురుగునీటి వ్యవస్థ నిర్వహణ గురించి క్షుణ్ణంగా తెలియజేశారు. నగరాల్లో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులను సమకూర్చుకునే పలు విధానాలపై చర్చించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టడానికి వీలున్న ప్రాజెక్టులపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా మేయర్ జేమ్స్ బ్రయనార్డ్ ఒక ముఖ్యమైన అంశాన్ని వివరిస్తూ నగర ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి కార్మెల్ నగరాభివృదిలో క్రియాశీలంగా వ్యవహరిస్తారని చెప్పారు. స్థానిక ప్రభుత్వంగా నగర ప్రజల నుంచి వచ్చే పన్నులు, ఇతర ఆదాయం మేరకే ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఆదాయానికి మించి బడ్జెట్ కేటాయించే వీలు లేదని మేయర్ తెలిపారు. కార్మెల్ పట్టణ పురపాలిక కార్యాలయాన్ని మంత్రి పరిశీలించారు. పట్టణ కౌన్సిల్ సమావేశాల నిర్వహణ, వాటిలో ప్రజల భాగస్వామ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉపయోగిస్తున్న స్మార్ట్ టెక్నాలజీని, ప్రతి సమాచారాన్ని అందుబాటులో ఉంచే సిటీ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించే విధానాన్ని పరిశీలించారు. నగర పౌరుల ఫిర్యాదుల కోసం కార్మెల్ పట్టణ పురపాలిక ఉపయోగిస్తున్న మొబైల్ యాప్ వినియోగంపై మంత్రి ఆసక్తి చూపారు. పట్టణ పాలనలో సాంకేతిక ఉపయోగాన్ని అభినందించారు. మధ్యాహ్నం ఇండియానాపోలిస్ నగర మేయర్ జో హాగ్‌సెట్‌తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. నగర ప్లానింగ్, పురపాలనపై ప్రధానంగా చర్చ జరిగింది. నగర విస్తరణ జరుగుతున్న మేరకు అక్కడి పట్టణానికి సరిపడే విధంగా ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ఏర్పాటు చేయనున్న బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ గురించి మేయర్ మంత్రికి వివరించారు. నగరంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి అవసరమయ్యే నిధులను మున్సిపల్ బాండ్ల ద్వారా సేకరిస్తున్నట్లు జో తెలిపారు. రెండు నగరాల మేయర్లతో సమావేశం ముగిసిన అనంతరం.. కార్మెల్, ఇండియానాపోలిస్ నగరాల్లో పాటిస్తున్న ఉత్తమ విధానాలను హైదరాబాద్‌లో కూడా ప్రవేశపెట్టవచ్చని మంత్రి అన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకులు ఎన్ని సంవత్సరాలైనా పదవిలో కొనసాగుతారని అమెరికాలోని పలు నగరాల మేయర్ల అనుభవం నిరూపిస్తుందన్నారు. ఈ సమావేశంలో మంత్రితోపాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, ఇతర అధికారులున్నారు. ఎన్విస్టా, ఇంటరాక్టివ్ ఇంటెలిజెన్స్‌లతో.. మంత్రి కేటీఆర్ అమెరికాలో రెండోరోజు పర్యటనలో భాగంగా.. ఇండియానాపోలిస్‌లో ప్రముఖ ఐటీ, హెల్త్‌కేర్ సంస్థలకు చెందిన అధినేతలను కలుసుకున్నారు. సప్లయ్ చెయిన్ కన్సల్టింగ్, ఐటీ సేవల సంస్థ అయిన ఎన్విస్టా కార్పొరేషన్ సీఈవోను కలిసి.. హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. భారతదేశంలో చిల్లర వర్తక రంగం గణనీయంగా వృద్ధి చెందుతుండటంతో.. ఎన్విస్టా సంస్థ హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి ఇదే సరైన సమయమని మంత్రి కేటీఆర్ వివరించారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్.. క్లౌడ్ సర్వీసెస్‌లో గ్లోబల్ లీడర్ అయిన ఇంటరాక్టివ్ ఇంటెలిజెన్స్ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా.. సంస్థకు చెందిన సీనియర్ సభ్యులు హైదరాబాద్ సంస్కృతి అందరినీ అక్కున చేర్చుకుంటుందని వారు వ్యాఖ్యానించారు. మంత్రి కేటీఆర్‌తో సమావేశం అనంతరం, ఇంటరాక్టివ్ ఇంటెలిజెన్స్ సంస్థ తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో అతిత్వరలో విస్తరిస్తామని పేర్కొంది. ఐఈడీసీ చీఫ్‌తో భేటీ.. నగరాభివృద్ధిపై వివరాల ఆరా ఇండియానా ఎకనామిక్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐఈడీసీ) స్టాఫ్ చీఫ్ అయిన స్టీవ్ అకార్డ్‌ను ఆయన కార్యాలయంలో మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా స్టీవ్ ఇండియానాకు సంబంధించిన వివరాలను మంత్రికి తెలియజేశారు. ఏయే రంగాలకు ఇండియానా ప్రాచుర్యం పొందింది? పెట్టుబడిదారులకు స్వర్గధామంగా.. ఓ ఆదర్శ నగరంగా ఇండియానాను ఎలా ప్రోత్సహిస్తున్నామనే అంశాన్ని వివరించారు. తమ కీలక భాగస్వాముల (స్టేక్‌హోల్డర్ల) సహకారంతో నగరాన్ని ఎలా అభివృద్ధి చేస్తామనే అంశాన్ని ఐఈడీసీ సంస్థకు చెందిన సభ్యులు మంత్రి కేటీఆర్‌కు వివరించారు. ఐఈడీసీ అనుసరిస్తున్న కార్యక్రమాలను అర్థం చేసుకోవడానికి మంత్రి కేటీఆర్ కూలంకషంగా చర్చించారు. ప్రధానంగా, వైద్యపరికరాల రంగంలో పెట్టుబడుల అవకాశాలపై మంత్రి ఆసక్తి చూపెట్టారు. ఈ సందర్భంగా.. తెలంగాణ రాష్ట్రంలో సులువుగా వ్యాపారం నిర్వహించడానికిచ్చే ర్యాంకును మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న పలు విప్లవాత్మక నిర్ణయాల గురించి వివరించారు. Quote
turtle Posted May 26, 2016 Author Report Posted May 26, 2016 Inko one week untaadu maa tiger in US...meeru emi eekkuntaro eekkondi.. Bloody idiots..Bloody pulkas...ee debba tho state lo unna aa koncham opposition kuda out.. Quote
mulakaya_123456 Posted May 26, 2016 Report Posted May 26, 2016 Langa gaadu spotted royyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy Quote
mulakaya_123456 Posted May 26, 2016 Report Posted May 26, 2016 Velli mee langa gaadi pittu ni ferfumeee la aswadinchu Quote
turtle Posted May 26, 2016 Author Report Posted May 26, 2016 5 minutes ago, sattipandu said: Nuvvu HydKaSher mirror image vaa?? aaditho naaku polika....chi chi...He is barbarious dog..Cunning donkey.. Quote
TOM_BHAYYA Posted May 26, 2016 Report Posted May 26, 2016 1 minute ago, turtle said: aaditho naaku polika....chi chi...He is barbarious dog..Cunning donkey.. Neeku just aa barbarous theesesthe saripodhha? Quote
k2s Posted May 26, 2016 Report Posted May 26, 2016 k nice pics.. FB lo titter lo pettukuntey masthu likes comments Quote
Spartan Posted May 26, 2016 Report Posted May 26, 2016 1 minute ago, Anta Assamey said: u assamed Quote
ARYA Posted May 26, 2016 Report Posted May 26, 2016 15 minutes ago, TOM_BHAYYA said: Neeku just aa barbarous theesesthe saripodhha? Quote
Anta Assamey Posted May 26, 2016 Report Posted May 26, 2016 2 minutes ago, Spartan said: u assamed Endukooo..... Quote
Spartan Posted May 26, 2016 Report Posted May 26, 2016 Just now, Anta Assamey said: Endukooo..... no replying no talking...i thought so.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.