tom bhayya Posted May 29, 2016 Report Posted May 29, 2016 -కేసీఆర్ వార్తలు, వీడియోలు, ఆడియోలతో యాప్ -ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఒపీనియన్ పోల్ -యాప్‌ను రూపొందించిన జగిత్యాల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా, ప్రజలకు సంతృప్తికరమైన సీఎంగా నంబర్‌వన్ స్థానంలో ఉన్న కేసీఆర్‌పై ఒక మోబైల్ యాప్ రూపుదిద్దుకున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాజకీయ జీవితం, ఆయనకు సంబంధించిన వివరాలతో కూడిన ఒక మోబైల్ యాప్‌ను ఒక యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రూపకల్పన చేశాడు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ వెర్షన్లలో ఈ యాప్ అందుబాటులో ఉంది. కేసీఆర్‌కు సంబంధించిన సమాచారం, ఆయన పాల్గొన్న సభలు, సమావేశాలకు సంబంధించిన సమాచారం, వార్తలు, ఇతర అంశాలను ఇందులో పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను కూడా ఇందులో పేర్కొన్నారు. కేవలం వార్తలే కాకుండా ఫొటోలు, కేసీఆర్ పాల్గొన్న సభల వీడియోలు కూడా ఇందులో పొందుపరిచారు. తెలంగాణ ఉద్యమ గీతాలు, జానపద పాటలు కూడా ఉన్నాయి. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న వారు అందులోని ఒపీనియన్ పోల్‌లో కూడా పాల్గొనవచ్చు. యూజర్లు వారి అభిప్రాయాలను, సలహాలు, సూచనలు కూడా ఈ యాప్‌లో తెలియజేయవచ్చు. యువసాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉత్సాహం కేసీఆర్- ది లీడర్ మొబైల్ యాప్‌ను కరీంనగర్ జిల్లా జిగిత్యాలకు చెందిన మొగిలిపాల శ్రీనివాస్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రూపొందించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై ఉన్న అమితమైన అభిమానంతో ఈ యాప్‌ను రూపొందించారు. మూడునుంచి ఐదులక్షల రూపాయలు వెచ్చించి ఈ యాప్‌ను డెవలప్ చేశారు. ప్రస్తుతం మలేషియాలోని మే బ్యాంక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మెగిలిపాల శ్రీనివాస్ సీఎం కేసీఆర్ సమయం ఇస్తే జూన్ 2న ఈ యాప్‌ను ఆయన చేతులమీదుగానే ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో, బంగారు తెలంగాణ రూపకల్పనలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిని ఎవరూ మరిచిపోలేరని తెలిపారు. కేసీఆర్‌కు సంబంధించిన అంశాలన్నీ ఇందులో ఉంటాయని, ప్రతిరోజు అప్‌డేట్ చేసేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఇందులో ఒపీనియన్ పోల్‌తో పాటు ప్రజలకు ఏవైనా సమస్యలుంటే తెలియజేసేందుకు కైంప్లెంట్ బాక్స్ కూడా ఉంటుందని తెలిపారు. తద్వారా వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను సీఎంవో కార్యాలయానికి అందిస్తామని అన్నారు. ప్రజల నాడిని ప్రతిక్షణం సీఎం కేసీఆర్‌కు తెలియజేయాలనే సంకల్పంతో ఈ యాప్‌ను తయారు చేశామని శ్రీనివాస్ చెప్పారు. Quote
TOM_BHAYYA Posted May 29, 2016 Report Posted May 29, 2016 1 hour ago, tom bhayya said: download chesukunnaraa 5 star rating b ichha.. Waiting for ITeM app Quote
tom bhayya Posted May 30, 2016 Author Report Posted May 30, 2016 19 minutes ago, TOM_BHAYYA said: 5 star rating b ichha.. Waiting for ITeM app Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.