Jump to content

Telangana farmers problems


Recommended Posts

Posted
తెలంగాణలో ఎక్కడికెళ్లినా విద్యుత్‌శాఖపై ఫిర్యాదులే! అవినీతిమయమైందని ఆరోపణలే! అన్నదాత విషయంలో విద్యుత్‌శాఖ వ్యవహరిస్తున్న తీరుపై రైతాంగం కన్నెర్రజేస్తోంది!
11hyd-story1a.jpg
సర్కారీ నల్లాలో నీళ్లు రాకుంటే.. 
డబ్బులు పెట్టి నీటి డబ్బాలు కొనుక్కోవచ్చు..

సర్కారీ బడుల్లో చదువు బాగోకుంటే 
కాన్వెంటుకు పోవచ్చు..

సర్కారీ దవాఖానా సరిగ్గా లేకుంటే 
ప్రైవేటు ఆస్పత్రిలో చూపించుకోవచ్చు...

మరి సర్కారీ కరెంటుశాఖ సతాయిస్తే? 
ఎవరికి చెప్పుకోవాలి? 
ప్రత్యామ్నాయమేమీలేనిది విద్యుత్‌శాఖ! 
కరెంటు లేకుంటే రోజు గడవని పరిస్థితి! 
ప్రతి ఒక్కరికీ కరెంటు నిత్యావసరంగా మారిన వేళ

మరి విద్యుత్‌శాఖ ఎంత బాధ్యతగా పనిచేస్తోంది? 
సిబ్బందెంత అంకితభావంతో సేవలందిస్తున్నారు? 
... అని ప్రశ్నించుకుంటే సామాన్యుల సంగతి అటుంచి... ఆ శాఖలోని సిబ్బందే తలెత్తుకొని సమాధానమివ్వలేని దుస్థితి! రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా విద్యుత్‌శాఖపై ఫిర్యాదులే! అవినీతిమయమైందని ఆరోపణలే! అన్నదాత విషయంలో విద్యుత్‌శాఖ వ్యవహరిస్తున్న తీరుపై రైతాంగం కన్నెర్రజేస్తోంది!

షాక్‌ కొట్టింది.. కాపురం చెడింది 
11hyd-story1c.jpg
షాబాద్‌ మండలం రేగడి దోస్వాడలో ప్రభుత్వ పాఠశాలవద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ భూమినానుకొని 15 ఏళ్లుగా ఇలాగే ఉంటోంది. మార్చాలని చుట్టుపక్కల వాళ్ళెంత మొరబెట్టుకుంటున్నా పట్టించుకున్న నాథుడు లేడు. ట్రాన్స్‌ఫార్మర్‌ పక్కింట్లో ఉండే దంపతులు ఓరోజు ఏదో పనిచేసుకుంటుంటే భార్యకు షాక్‌ కొట్టింది! ఆమె కుడిచేతిని తొలగించారు. దీంతో భర్త వదిలేశాడు! అలా నేలబారు ట్రాన్స్‌ఫార్మర్‌ ఓ కాపురాన్ని కూల్చేసింది.

పరిహారానికి సతాయింపు: విద్యుత్‌ కారణంగా ఎవరికైనా ఏమైనా అయితే నష్టపరిహారం చెల్లించాలని నిబంధనలున్నాయి. వాటిని పాటించటానికి ఆశాఖ అధికారులు నిరాకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉత్తరతెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్‌) పరిధిలో ఈ ఫిర్యాదులెక్కువగా వస్తున్నాయి. నిబంధనల ప్రకారం.. విద్యుత్‌ షాక్‌తో మనిషి చనిపోతే... రూ.4లక్షలు.. బర్రె, ఎద్దు, ఆవులు పోతే రూ.40వేలు.. మేక, గొర్రెలకైతే రూ.7వేలు పరిహారంగా చెల్లించాలి. అది కూడా రెండు నెలల్లో ఇవ్వాలి. దాటితే వడ్డీతో కట్టాలి.

నడుం ఎత్తున.. ఉయ్యాల మాదిరి! 
11hyd-story1b.jpg
సిబ్బంది రాక.. విధిలేక రైతులే వైర్లను బిగించుకుంటుండటంతో... చాలాచోట్ల అవి వూగుతుండటమో, తక్కువ ఎత్తులో ఉండటమో జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం సురంగల్‌ గ్రామంలోని ఓ పొలంలోనైతే వైర్లు నడుం ఎత్తులో వేలాడుతున్నాయి. ఏడాది నుంచి ఇదే పరిస్థితి.

ముఖ్యమంత్రే చెప్పినా: పలువురు విద్యుత్‌ సిబ్బంది పనితీరెలా ఉంటుందనటానికి మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గమే ఉదాహరణ! రెండేళ్ళకిందట సీఎం కేసీఆర్‌ తన నియోజకవర్గంలో సమీక్ష నిర్వహించినప్పుడు ప్రజలు విద్యుత్‌ సమస్యలపై ప్రస్తావించారు. వీటిని ఏడాదిలోగా పరిష్కరించాలని పవర్‌డే ప్రకటించారు. ఇందుకోసం తన నియోజకవర్గ నిధుల నుంచి కోటిన్నర, అదనంగా మరో రూ.10 కోట్లు వెరసి రూ.11.5 కోట్లు మంజూరు చేశారు. అది జరిగి ఏడాదిన్నరైంది! సమస్యలు అలాగే ఉన్నాయి.

నాసిరకం.. నాణ్యతలో రాజీ! 
11hyd-story1d.jpg
గాలివానకు కూలిన స్తంభాలు, వాలిన స్తంభాలు. కూలిన ట్రాన్స్‌ఫార్మర్లు... తెగిన విద్యుత్‌ వైర్లు... అనేది సర్వసాధారణ విషయమైంది. ఇందుకు ప్రధానకారణం నిర్మాణ పనుల్లో, సామగ్రి నాణ్యతలోపాలే కారణమంటున్నారు. స్తంభాల మధ్య కనీసం 60 మీటర్ల దూరం పాటించాలి. పొలాల్లో చాలాచోట్ల అంతకంటే ఎక్కువే ఉంటుంది. వేసే స్తంభాలు నాసిరకంగా ఉంటున్నాయనే ఆరోపణలున్నాయి. సిమెంటు స్తంభాలే వంగిపోతున్నాయంటే నాణ్యతెలా ఉంటుందో చెప్పవచ్చు.
11hyd-story1j.jpg‘‘నాణ్యమైన విద్యుత్‌తో పాటు విద్యుత్‌ సేవలు కూడా నాణ్యంగా ఉండేలా చూస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. భారీగా జీతాలు తీసుకుంటున్న అధికారులు, సిబ్బంది సామాన్య రైతులను, వినియోగదారులను ఇబ్బంది పెట్టడం అన్యాయం. విద్యుత్‌ సేవల నాణ్యత విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీరియస్‌గా పరిగణించాలి.’’
- శ్రీధర్‌రెడ్డి, భారతీయ కిసాన్‌సంఘ్‌ తెలంగాణ అధ్యక్షుడు
కనెక్షన్‌ ఎంత కష్టం 
11hyd-story1f.jpg
మామూలుగా రైతు 5హెచ్‌పీ మోటారు కనెక్షన్‌ కావాలంటే రూ.6125 డీడీ కట్టి, సంబంధిత అసిస్టెంట్‌ ఇంజినీరుకివ్వాలి. క్షేత్రవిచారణ చేశాక, ఉన్నట్రాన్స్‌ఫార్మర్‌కు కనెక్షన్‌ ఇప్పించటం, లేదంటే కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ పెట్టి కనెక్షన్‌ ఇవ్వాలి. కొత్తదంటే 3 కనెక్షన్లుండాలి. దీనికి మరో ఇద్దరు రైతుల్ని చూసుకోవటం లేదా.. సొంతగా మరో 2 కనెక్షన్ల డబ్బులు కట్టడంగానీ చేస్తారు. తర్వాత రూ.1.5 లక్షల విలువైన సామగ్రితో ట్రాన్స్‌ఫార్మర్‌ బిగించి, 60 రోజుల్లోగా కనెక్షన్‌ ఇవ్వాల్సిన బాధ్యత విద్యుత్‌ శాఖధి. గడువు దాటితే రోజుకు రూ.100 చొప్పున రైతుకు నష్టపరిహారమివ్వాలి.అలా జరగడంలేదు.

జరుగుతున్నదిదీ: విద్యుత్‌శాఖ ఆలస్యం చేయటం.. సామగ్రి అరకొరగా ఇవ్వడంతో.. దరఖాస్తు చేసుకున్న రైతులే సొంతగా సామగ్రి తెచ్చుకొని, ట్రాన్స్‌ఫార్మర్‌కు దిమ్మెకట్టుకొని పనికానిస్తున్నారు. దీనికి రూ.40-50 వేల దాకా రైతులకు ఖర్చవుతోంది. తర్వాత మరోరైతు ఈ ట్రాన్స్‌ఫార్మర్‌పైన కనెక్షన్‌ తీసుకోవడానికి వస్తే వారినుంచి ముందు ఖర్చుపెట్టిన రైతులు (రైతులు ప్రతి ట్రాన్స్‌ఫార్మర్‌కూ సంఘంగా ఏర్పడతారు.) రూ.10 వేల నుంచి రూ.30 వేల దాకా తమ సొమ్ము తీసుకుంటున్నారు. ఇలా పలుచోట్ల రైతులు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. గుత్తేదారులు, అధికారులు కొట్టేస్తున్నారనేది రైతుల అనుమానం.

11hyd-story1e.jpg
ఫోన్‌ చేసేంతటోళ్లయిన్రా?
న్ని ఇబ్బందులున్నా రైతులు ఫిర్యాదు చేయరా అనే సందేహం రాకపోదు! కరెంటు మీదే ఆధారపడి బతికే రైతులు సిబ్బందిపై ఫిర్యాదు చేయాలంటే భయపడుతున్నరు. ఫిర్యాదుల్ని ఉన్నతాధికారులు పట్టించుకోరు. పట్టించుకున్నా... సతాయింపులు మొదలైతై! ఎందుకొచ్చిన గోసంటూ నోరు మూసుకొని పైసలిచ్చుకొని పనిగానిచ్చుకుంటున్నరు. ‘‘ఫిర్యాదు చేసిన రైతును ద్రోహిలా చూస్తారు. ట్రాన్స్‌ఫార్మర్‌ పాడైందని ఫోన్‌ చేస్తే... టోల్‌ఫ్రీకి ఫోన్‌ చేసేంతటోళ్లయిన్రా.. అంటూ సతాయించిన్రు’’ అని కరీంనగర్‌ జిల్లా రైతొకరు ఆవేదన వ్యక్తంజేశారు.
రైతులే నిపుణులవుతున్న వేళ
ట్రాన్స్‌ఫార్మర్‌కు కనెక్షన్‌ ఒకెత్తైతే... తమ మోటారుదాకా విద్యుత్‌ లైన్లు తెచ్చుకోవటం మరోసమస్య! ట్రాన్స్‌ఫార్మర్‌లకు సామగ్రి కొన్నట్లే...కనెక్షన్‌కు కావాల్సిన స్తంభాలు, వైర్లు రైతులే కొంటున్నారు! ‘‘లేదంటే సామగ్రి తక్కువిచ్చి అంతే అంటారు. ‘మేమే స్తంభాలు కొనుక్కొని, వైర్లు కొనుక్కొని వెళతాం. కొన్ని సందర్భాల్లో సామగ్రి ఉంది.. ఆలస్యమవుతుందంటారు. ట్రాక్టర్లలో మేమే తెచ్చుకోవాల్సిన పరిస్థితి. గుంతలు తవ్విస్తంభాలు నిలబెట్టి, వైర్లు లాగి...కనెక్షన్‌కు అంతా సిద్ధంచేసుకుంటాం. కరెంటోళ్లు మెయిన్‌కు కనెక్షన్‌ ఇచ్చిపోతారు. ఏసమస్యున్నా మేమే సబ్‌స్టేషన్‌కు ఫోన్‌చేసి లైన్‌కి ్లయర్‌ తీసుకొని పనిచేసుకుంటాం’’ అని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌మండల రైతు రాజన్న తెలిపారు. రైతులే ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు చేయటం సర్వసాధారణం!
స్విచ్‌లు అరకొర.. ప్రాణాలు విలవిల
ప్రతి ట్రాన్స్‌ఫార్మర్‌కూ ఆన్‌, ఆఫ్‌ స్విచ్‌లుండాలి. కానీ అలా లేదు..కరీంనగర్‌ జిల్లా ధర్మారం మండలంలో ఆ మధ్య ఓ రైతును బలితీసుకుందీ స్విచ్‌ సమస్య! తండ్రి తోటలో మోటారును మరమ్మతు చేయటానికి ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గర స్విచ్‌ బంద్‌ చేయమని కొడుకును పంపాడు. అక్కడ నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లకు రెండు చొప్పున రెండు స్విచ్‌లున్నాయి. కొడుకు ఒకదాన్ని బదులు మరోటి బంద్‌ చేయడంతో తండ్రి షాక్‌ కొట్టి చనిపోయాడు. ‘‘మా గ్రామంలో నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లుంటే వాటిలో మూడింటికి స్విచ్‌ల్లేవు. ఏదైనా అయిందంటే సబ్‌స్టేషన్‌కు ఫోన్‌చేసి ఎల్‌సీ తీసుకొని పనిచేసుకుంటాం. ఆర్నెల్లుగా స్విచ్‌లు పెట్టండని అడుగుతున్నాం. బిల్లులకైతే ఇద్దరు ముగ్గురొస్తరు. సమస్య ఉందంటే ఎంత పిలిచినా ఒక్కరూ రారు.’’ అని మొయినాబాద్‌ నక్కలపల్లికి చెందిన నీలకంఠం వాపోయారు.
‘పురులు’ విప్పిన నిర్లక్ష్యం 
11hyd-story1g.jpg
షాబాద్‌ మండలం సాయిరెడ్డిగూడెంలో పదేళ్లకిందట విద్యుత్‌ వైరు దొంగతనమైంది. 3 కిలోమీటర్ల వైరులో 2 కిలోమీటర్లు దొంగలెత్తుకెళ్లారు. కొత్తవైరు వేయాలంటూ దరఖాస్తులు చేసుకుంటున్నా కనికరించలేదు కరెంటోళ్ళు! రైతులు మిగిలిన వైరును పురులు విప్పి మూడులైన్లుగా వేసుకొన్నారు. దాన్నే సిబ్బంది మెయిన్‌కు కనెక్ట్‌ చేసిపోయారు. ఎల్‌టీ లైనుగా ఉపయోగించాల్సిన దాన్ని మెయిన్‌లైన్‌కు వాడటంతో తెగిపోతోంది. తెగినప్పుడల్లా ముడులు వేసి పోతున్నారు. అలాంటి సమయంలో 22ఏళ్ల యువకుడు మరణించాడు.
ఖర్మ కాలినట్లే 
11hyd-story1h.jpg
ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటులో ఎంత కష్టపడతారో.. సమస్యవస్తే అంతకంటే ఎక్కువ కష్టపడాల్సిన బాధ్యతా రైతులదే! ట్రాన్స్‌ఫార్మర్‌ పాడైనపుడు ఫిర్యాదు చేస్తే వచ్చి బాగు చేయించాల్సిన బాధ్యత విద్యుత్‌ సిబ్బందిది. ఈమేరకు ప్రతి ట్రాన్స్‌ఫార్మర్‌ గద్దెపైనా టోల్‌ఫ్రీనెంబర్‌ రాసుంచాలి. ప్రతి ట్రాన్స్‌ఫార్మర్‌కూ ఓ నెంబర్‌ ఉండాలి. టోల్‌ఫ్రీ నుంచి కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలంది వారు బాగుచేసి.. గరిష్ఠంగా 48 గంటల్లో సమస్యను పరిష్కరించాలి. లేదంటే రోజుకు రూ.100 చొప్పున నష్టపరిహారం రైతుకు విద్యుత్‌శాఖ చెల్లించాలి. కానీ జరుగుతున్నది వేరు. టోల్‌ఫ్రీ నెంబరుండే గద్దెలే తక్కువ. ఫిర్యాదు చేసేవాళ్లూ అంతకంటే తక్కువ! రైతులే డబ్బులు జమచేసుకొని రవాణా ఖర్చులు భరించి ఏదోరకంగా దగ్గర్లోని మరమ్మతు కేంద్రానికి తీసుకెళ్లి బాగు చేయించుకొని వస్తారు. ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాల్లోనూ విద్యుత్‌శాఖది నిర్లక్ష్య ధోరణే! రంగారెడ్డిజిల్లా వికారాబాద్‌ పరిధిలో ఏడాదిలో వందకుపైగా ట్రాన్స్‌ఫార్మర్లు దొంగతనమయ్యాయి. చట్టప్రకారం ట్రాన్స్‌ఫార్మర్‌ పోతే ఏఈ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఏఈలు చేయడం లేదన్నది రైతుల ఆరోపణ. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం గొల్లపల్లి పంచాయతీలో మూడేళ్లకిందట ట్రాన్స్‌ఫార్మర్‌ పోయింది. ఇంకా కొత్తదివ్వలేదు. నిజామాబాద్‌ జిల్లా ఎల్లంపేటలో దరఖాస్తు చేసి మూడేళ్లయినా కనెక్షన్‌ ఇవ్వలేదు.
11hyd-story1i.jpg
Posted

Thx man.. Farmers baadalu ardam chesukunnav.. Cbn vunte ee khastalu vundevi kaavu.. GP

Posted
2 minutes ago, The Warrior said:

Thx man.. Farmers baadalu ardam chesukunnav.. Cbn vunte ee khastalu vundevi kaavu.. GP

lol pink idiots cant understand the seriousness of the issue .. simple ga CBN kytra androlla kutra ani chetlu dulipesukundam @3$% 

Posted

Anavasaranga trs ki vote vesaru.tdp ki vesunte current undedi,varshalu padevi.

Posted
Just now, tables said:

Anavasaranga trs ki vote vesaru.tdp ki vesunte current undedi,varshalu padevi.

yaa kaani bangaru TG vachedhi kaadhu :( 

Posted

Telangana ante hyd okate anukune so called pink man ki e vishyayam ardham aythe, things can be sorted out.

Posted
Just now, VadaGaali said:

Telangana ante hyd okate anukune so called pink man ki e vishyayam ardham aythe, things can be sorted out.

ala cheyali ante kastam man inkokadu illu kati isthe meme katincham ani buildup istam kani sontha ga construct chesukovali ante kastam :( 

Posted
4 minutes ago, BabuRa0 said:

lol pink idiots cant understand the seriousness of the issue .. simple ga CBN kytra androlla kutra ani chetlu dulipesukundam @3$% 

Nee erri... Neenu correct gaane cheppa.. Nuvve wrong ga ardam chesukunnav.. Nuvvu politicians or pinkies meeda eduputho kaakundaa.. Farmers problems alochistunnav chudu hats off buddy

Posted
1 minute ago, The Warrior said:

Nee erri... Neenu correct gaane cheppa.. Nuvve wrong ga ardam chesukunnav.. Nuvvu politicians or pinkies meeda eduputho kaakundaa.. Farmers problems alochistunnav chudu hats off buddy

nee sollu kwamedy aapi matter chaduvu raaja akada chepinavi solve cheytam pedha matter kadhu electricity dept ki.. publicity ki iche importance ki governance ki isthe ee problems undavu :( 

Posted
8 minutes ago, BabuRa0 said:

nee sollu kwamedy aapi matter chaduvu raaja akada chepinavi solve cheytam pedha matter kadhu electricity dept ki.. publicity ki iche importance ki governance ki isthe ee problems undavu :( 

maku gadhi antha taelvdhh . jai kcr jai trs

Posted
10 minutes ago, The Warrior said:

Evadu saami ee labour erri **** gaadu

ulligadda ani mana annaya ki dagari chutam :P 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...