Swas Posted June 21, 2016 Author Report Posted June 21, 2016 రాజధాని భూములకు సింగపూర్ కంపెనీల ఆఫర్ బహిరంగ మార్కెట్ ధరకు రెట్టింపు ధర పోటీ బిడ్లను ఆహ్వానించనున్న సర్కారు వచ్చే కేబినెట్లో స్విస్ చాలెంజ్‌కు ఆమోదం అడ్వొకేట్ జనరల్ గ్రీన్‌సిగ్నల్ హైదరాబాద్, జూన్ 20(ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంతంలో తీసుకొనే భూములకు ఎకరానికి రూ.4 కోట్లు చెల్లించడానికి సింగపూర్ సంస్థలు ముందుకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపిన తమ వాణిజ్య బిడ్‌లో ఆ కంపెనీలు ఈ ధరను పేర్కొన్నట్లు సమాచారం. సింగపూర్ ప్రభుత్వానికి చెందిన సంస్ధలు అసెండాస్, సెంబ్ కార్ప్ తదితరాలు కలిసి ఒక కన్సార్షియంగా ఏర్పడ్డాయి. కన్సార్షియం తరఫున ఈ బిడ్‌ను ఆంధ్రప్రదేశ ప్రభుత్వానికి పంపాయి. ఈ ధర ప్రభుత్వ వర్గాలను ఆశ్చర్యపర్చింది. రాజధాని ప్రాంతంలో భూములకు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉన్న ధరకు ఇది రెట్టింపని ఆ వర్గాలు భావిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం ఒక ఎకరానికి రూ.కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయిల వరకూ విక్రయాలు జరుగుతున్నట్లు ప్రచారంలో ఉంది. దీంతో, ‘ఇంత ధరను సింగపూర్ కంపెనీలు పేర్కొంటాయని మేం అనుకోలేదు. చాలా మంచి ధరను పేర్కొన్నాయి’ అని ఈ బిడ్ పరిశీలనకు ఏర్పాటైన ఉన్నత స్ధాయి కమిటీ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఈ భూములపై వచ్చే ఆదాయాన్ని సింగపూర్ కంపెనీలు, ఏపీ ప్రభుత్వ కంపెనీ పంచుకోబోతున్నాయి. ఏపీ ప్రభుత్వానికి 42 శాతం, సింగపూర్ కంపెనీలకు 58 శాతం వాటాకు ఒప్పందం కుదిరింది. తన తరఫున ఇందులో భాగస్వామ్యం వహించడానికి ఏపీ ప్రభుత్వం కొత్తగా ఒక కంపెనీని ఏర్పాటు చేయనుంది. అమరావతి డెవల్‌పమెంట్ కంపెనీ పేరుతో దీనిని నెలకొల్పుతున్నారు. సీఆర్డీఏ ఆధీనంలో ఇది పనిచేస్తుంది. అలాగే సింగపూర్ ప్రభుత్వ కంపెనీలు తమ తరఫున ఒక కంపెనీని నెలకొల్పనున్నాయి. ఆ కంపెనీ సింగపూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. పారదర్శకంగా కేటాయింపులు సింగపూర్ కంపెనీలు ఇచ్చిన వాణిజ్య బిడ్‌ను ఏపీ ప్రభుత్వం త్వరలో బహిర్గతపర్చనుంది. స్విస్ చాలెంజ్ విధానంలో దీనికి పోటీ బిడ్స్‌ను ఆహ్వానిస్తారు. ప్రభుత్వానికీ - ప్రభుత్వానికీ మధ్య అంగీకారంలో భాగంగా ఆ ప్రభుత్వ సంస్థలకు నేరుగా కేటాయించే అవకాశం ఉన్నా... పారదర్శకత కోసం పోటీ బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇలా ప్రభుత్వాలకు మధ్య అంగీకారం పేరుతో రస్ అల్ ఖైమా దేశానికి నేరుగా కొన్ని కేటాయింపులు చేశారు. ఇప్పుడు కూడా అలా చేయాలని కొందరు అధికారులు సూచించినా వద్దనుకొన్నామని ఆ ప్రతినిధి వివరించారు. పోటీ బిడ్లలో మరింత మెరుగైన బిడ్ వస్తే దానిపై ప్రతిస్పందించే అవకాశం సింగపూర్ సంస్ధలకు ఇస్తారు. అవి ఇంకా మెరుగ్గా ఇస్తే ప్రాజెక్టును వాటికి ఇచ్చేస్తారు. అవి స్పందించకపోతే మెరుగైన బిడ్ ఇచ్చిన పోటీదారుకు ఆ ప్రాజెక్టు వెళ్ళిపోతుంది. దీనిని స్విస్ చాలెంజ్ అంటారు. ఈ విధానం కింద బిడ్లు పిలవడానికి మంత్రివర్గ ఆమోదం పొందాల్సి ఉంది. ఈ నెల 24వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం ఉంది. అందులో ఈ ఆమోదం తీసుకోనున్నారు. సింగపూర్ సంస్థలు పంపించిన వాణిజ్య బిడ్‌ను, స్విస్ చాలెంజ్ విధివిధానాలను ఇప్పటికే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన వేసిన ఉన్నత స్ధాయి కమిటీ పరిశీలించి తన ఆమోదం తెలిపింది. నిబంధనల ప్రకారం ఆ తర్వాత అది ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్న సీఆర్డీఏ కమిటీకి వెళ్ళింది. ఆ కమిటీ కూడా దానిని ఆమోదించింది. ఆ తర్వాత అది మౌలిక వసతుల చట్టం ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన అధికారుల కమిటీ పరిశీలనకు వెళ్లింది. సీఆర్డీఏ చట్టం, మౌలిక వసతుల చట్టం రెండూ విడివిడిగా ఉండటంతో రెంటి కిందా ఆమోదం తీసుకొంటున్నారు. చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఉన్న కమిటీ దీనిని అడ్వొకేట్ జనరల్ పరిశీలనకు పంపింది. అడ్వొకేట్ జనరల్ సోమవారం తన నివేదిక సమర్పించారని, ముందుకు వెళ్లవచ్చని ఏజీ గ్రీన సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ ఆమోదం తర్వాత ఒక వారంలో అధికారికంగా స్విస్ చాలెంజ్ విధానం కింద సింగపూర్ బిడ్‌ను బహిర్గతపరుస్తారు. దానిపై స్పందించానికి ఒక నెల సమయం ఇస్తారు. Quote
Swas Posted June 21, 2016 Author Report Posted June 21, 2016 Vijayawada, guntur deggara vunna lands acre 1 crore ki koni ..4 crores ki govt singapore ki ammite full money...world class capital katteyochu Quote
Swas Posted June 21, 2016 Author Report Posted June 21, 2016 Just now, ARYA said: why laughing bro Quote
ARYA Posted June 21, 2016 Report Posted June 21, 2016 6 minutes ago, Swas said: why laughing bro 1:4 equation chusi Quote
Sweetyforu Posted June 21, 2016 Report Posted June 21, 2016 Arey pichhi vedava farmers daggara free ga dobbesi Singapore companies ki ammukuntunnara lavada ga Quote
Naaperushiva Posted June 21, 2016 Report Posted June 21, 2016 Kaneesam ippudanna challisthe manchidhe Quote
Maryadaramanna Posted June 21, 2016 Report Posted June 21, 2016 1 hour ago, Sweetyforu said: Arey pichhi vedava farmers daggara free ga dobbesi Singapore companies ki ammukuntunnara lavada ga good catch Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.