LordOfMud Posted June 22, 2016 Report Posted June 22, 2016 ఔను వీళ్లిద్దరూ ఇష్టపడ్డారు! విశాఖపట్నం (Vizag) ఫేస్‌బుక్‌లో ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకున్నారు. ఇద్దరి అభిప్రాయాలే కాకుండా గమ్యం కూడా ఒక్కటేనని తేలడంతో ప్రేమలో పడ్డారు. వివాహ బంధంతో ఒక్కటి కావాలనుకున్నారు. ఇటీవలే వారికి నిశ్చితార్థం కూడా అయింది. త్వరలో వివాహం చేసుకోనున్నారు. వారిద్దరూ స్వలింగ సంపర్కులు కావడమే ఇక్కడి ప్రత్యేకత. అందునా ఒకరికి విశాఖ మూలాలున్నాయి. వారి పేర్లు జాన్ మెక్‌కానే (28), చలపతిరావు (22). వీరిలో చలపతిరావు తల్లిదండ్రుల మూలాలు విశాఖతో ముడిపడి ఉన్నప్పటికీ కొన్నేళ్ల కిందట మలేషియా వెళ్లి స్థిరపడ్డారు. దైవచింతన, మతవిశ్వాసం అధికంగా గల చలపతిరావు ఫేస్‌బుక్‌లో ‘ఎల్‌జీబీటీ హిందూస్ సత్సంగ్’ గ్రూప్‌లో చేరారు. చలపతిరావు రిక్వె్‌స్టకు.. అమెరికాకు చెందిన జాన్‌మెక్‌కానే స్పందించాడు. ఇద్దరూ ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేసుకోవడం ప్రారంభించారు. తర్వాత ఇద్దరి మనసులూ కలవడం, అభిప్రాయాలు ఒక్కటే కావడంతో ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు చలపతిరావు తల్లి అంగీకరించింది. ఆయన తండ్రి కొంత అసంతృప్తితోనే సమ్మతించినట్టు సమాచారం. వీరిద్దరూ దక్షిణ భారతదేశ సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించారు. దానిప్రకారం ఎంగేజ్‌మెంట్ కూడా ఘనంగా నిర్వహించారు. ఒకటి రెండేళ్లలో తమ వివాహం మరింత ఘనంగా జరుగుతుందని ఇద్దరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.