Swas Posted June 23, 2016 Report Posted June 23, 2016 రండి.. పెట్టుబడులు పెట్టండి! బ్రిటన్ బృందం కోసం అమరావతిపై సీఆర్డీఏ సమగ్ర నివేదిక పెట్టుబడుల అవకాశాలపై సచిత్ర వివరాలు 163 ప్రాజెక్టుల్లో రూ.61,500 కోట్ల పెట్టుబడులకు అవకాశం జూన్‌లో బృందం రాక గతంలోనే రాజధాని అమరావతిపై ఆసక్తి భారీ పెట్టుబడులకు కంపెనీల సుముఖత బాబు పర్యటన ఫలితం ‘తియ్యటి’ వేడుకకు సర్వం సిద్ధం! ఈ నెల చివరి వారంలో పారిశ్రామిక పండగ జరగనుంది. క్యాడ్బరీ చాక్లెట్లు, ఇసుజు మోటార్ల ఉత్పత్తితోపాటు... ‘హీరో’కు శంకుస్థాపన జరగనుంది. గుంటూరులో ఐటీసీ 5 స్టార్ హోటల్‌కు శంకుస్థాపన చేయనున్నారు. జూన్‌లో రానున్న బ్రిటన్ బృందానికి అమరావతిలో పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ ప్రత్యేక నివేదిక సిద్ధమైంది. హైదరాబాద్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో బ్రిటన్ పెట్టుబడులకు బాటలు పడుతున్నాయి. బ్రిటన్ పారిశ్రామిక వేత్తలు, సంస్థల ఆసక్తికి అనుగుణంగా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) అడుగులు వేస్తోంది. బ్రిటన్‌కు చెందిన ఇద్దరు మంత్రులు, పలువురు పారిశ్రామికవేత్తలతో కూడిన బృందం జూన్‌లో అమరావతిలో పర్యటించనుంది. రాజధానిలో పెట్టుబడులకు గల అపార అవకాశాలను వివరించేందుకు సీఆర్డీఏ అధికారులు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను కళ్లకు కట్టేలా చెప్పే ప్రత్యేక నివేదిక సిద్ధం చేశారు. దీనిని బ్రిటన్ బృందానికి పంపించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించేందుకు గత నెలలో సీఎం చంద్రబాబు లండన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అక్కడి పారిశ్రామికవేత్తలకు వివరించారు. బ్రిటన్ ప్రభుత్వ వర్గాలతోనూ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పర్యటించాలని వారిని ఆహ్వానించారు. దీనికి బ్రిటన్ మంత్రులు, పారిశ్రామికవేత్తలు అంగీకరించారు. మే నెలలో రాష్ట్రానికి రావాల్సిందిగా బ్రిటన్ బృందాన్ని బాబు ఆహ్వానించారు. మేలో లండన్ మేయర్ ఎన్నికలు ఉండటంతో తాము జూలైలో ఏపీ పర్యటనకు వస్తామని వారు తెలిపారు. అయితే, జూలైలో వర్షాల కారణంగా అవాంతరాలు ఎదురవుతాయని, జూన్‌లో రాష్ట్రానికి రావాలని చంద్రబాబు కోరగా, దానికి బ్రిటన్ బృందం అంగీకరించింది. అయితే, పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ సవివరమైన నివేదిక ఇవ్వాలని రాష్ట్రాన్ని కోరింది. పెట్టుబడులకు ఎన్నెన్నో అవకాశాలు రాష్ట్రంలో పర్యటించనున్న బ్రిటన్ బృందానికి అమరావతిలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తూ సీఆర్డీయే అధికారులు సవివరమైన నివేదిక (బ్రోచర్)ను సిద్ధం చేశారు. ప్రపంచ స్థాయి రాజధానిగా రూపొందనున్న అమరావతిలో మౌలిక వసతుల రంగంలో 2020 నాటికి 163 ప్రాజెక్టుల్లో సుమారు రూ.61,500 కోట్లు పెట్టుబడులు పెట్టవచ్చని తెలిపారు. 2050నాటికి 2579 ప్రాజెక్టుల్లో 1.98 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశముందని తెలిపారు. వీటిలో అధికశాతం ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటన్ పారిశ్రామికవేత్తలు సంసిద్ధత వ్యక్తం చేశారని సీఆర్డీయే అధికారులు చెబుతున్నారు. మౌలిక వసతుల రంగంతోపాటు ఇతర రంగాల్లోనూ పెట్టుబడులకు బ్రిటన్ ఆసక్తి చూపుతోంది. ప్రపంచ ఆహార, పానీయ మార్కెట్లో బ్రిటన్ వాటా 17 శాతంగా ఉంది. అదే సమయంలో నవ్యాంధ్రలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ఏపీ సర్కార్ ఇప్పటికే పలు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీంతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టాలంటూ బ్రిటన్ పారిశ్రామికవేత్తలను రాష్ట్రం ఆహ్వానిస్తోంది. ఫార్మా రంగంలో కూడా బ్రిటన్ నుంచి పెట్టుబడులు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని సీఆర్డీయే అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద నవ్యాంధ్రలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటన్ సిద్ధమవుతోంది. పెట్టుబడులకు ప్రోత్సాహకాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు విద్యుత్తులో సబ్సిడీ, సీఎస్టీ, వ్యాట్, ఎస్జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ రీయింబర్స్మెంట్ సదుపాయాలు కల్పిస్తామని సీఆర్డీయే తన నివేదికలో వివరించింది. పరిశ్రమలకు వడ్డీ రాయితీ, పెట్టుబడి రాయితీ, పేటెంట్ విలువ చెల్లింపు, మార్కెటింగ్ ప్రోత్సాహకాలు కల్పిస్తున్నట్లు తెలిపింది. నవ్యాంధ్ర రాజధానిలో.. మీడియా సిటీ, నాలెడ్జ్ సిటీ, స్పోర్ట్స్ సిటీ తదితర 9 నగరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఉపాధి కల్పనలోనూ అమరావతి కచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నామని వివరించారు. 2050 నాటికి ప్రభుత్వ రంగంలో 4.1%, విద్యారంగంలో 2.6%, కార్పొరేట్ రంగంలో 10.2 % పరిశ్రమల్లో 8.7%, ఐటీలో 16.4%. ఉపాధి అవకాశాలు ఉంటాయని సీఆర్డీయే అధికారులు వివరిస్తున్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు... ప్రభుత్వంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ‘పవర్ కట్’కు గుడ్‌బై. పరిశ్రమలకు 24 గంటలు విద్యుత్తు ఇస్తున్న తొలి దక్షిణాది రాష్ట్రం మాదే. కాగితమన్నదే లేకుండా... ‘ఈ-కేబినెట్’ నిర్వహించే రాష్ట్రం. స్టార్ట్‌పలలో ముందంజ... సన్‌రైజ్ స్టార్టప్ విలేజ్ ప్రారంభం. నవ్యాంధ్రలో తొమ్మిది ప్రధాన రంగాలకు ప్రత్యేక ‘సిటీ’లు. వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్, పోర్టులతో ఏపీ ప్రత్యేకం. 5300 ఎకరాల్లో ఏర్పాటుకానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ఈపీసీ విధానంలో భవనాల నిర్మాణం. పీపీపీ విధానంలో సదుపాయాలు. మా విధానాలు... ఆటో, ఆటో కాంపొనెంట్స్, టెక్స్టైల్, బయో టెక్నాలజీ - ఫార్మా, ఏరోస్పేస్, రక్షణ, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటకం, ఐటీ-ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రీయల్ పార్కులు, ఎంఎ్‌సఎంఈ, అగ్రికల్చరల్ మార్కెటింగ్, సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు, పౌర విమానయానంపై ప్రత్యేక విధానాలు ప్రకటించి, అమలు చేస్తున్నట్లు సీఆర్డీఏ తెలిపింది. Quote
Swas Posted June 23, 2016 Author Report Posted June 23, 2016 ee Britan vallu vasthe it will be biggest ever investments in AP electric cars lanti investments vasthe better Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.