LordOfMud Posted June 25, 2016 Report Posted June 25, 2016 ఫీజులు పెంచినప్పటికీ ప్రభావం పడలేదు.. అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ వెల్లడి వీసాలను అందుకోవటంలో భారత్ తన జోరును కొనసాగిస్తూనే ఉందని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ చెప్పారు. ఫీజులు పెంచినా భారతకు ఇస్తున్న ప్రాధాన్యం ఎంతమాత్రం తగ్గలేదన్నారు. 9/11 హెల్త్ అండ్ కాంపెన్సేషన్ చట్టం కింద హెచ్ 1బి వీసాల్లో కొన్ని కేటగిరీలపై 4వేల డాలర్లు, ఎల్1 వీసాలపై 4,500 డాలర్ల ప్రత్యేక ఫీజును అమెరికా ప్రభుత్వం విధించడం తెలిసిందే. ఈ పెంపువల్ల భారత కంపెనీలపై 8వేల నుంచి 10వేల డాలర్ల మేర భారం పడుతోంది. ఐటీ కంపెనీలపై ఏటా ఇది 40 కోట్ల డాలర్ల వరకు ఉంటుందని ఇటీవలే నాస్కామ్ వెల్లడించింది. అంతేకాకుండా వాటి రాబడులపైనా ప్రభావం పడుతుందని తెలిపింది. కాగా, భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొత్త మేధోసంపత్తి హక్కుల విధానం (ఐపీఆర్) సరైన దిశలోనే ఉందని రిచర్డ్ వర్మ అన్నారు. అయితే, సమర్థ రక్షణ యంత్రాంగం మరింత కృషి చేయాల్సి ఉందన్నారు. పేటెంట్, కాపీరైట్, ట్రేడ్‌మార్క్ ప్రొటెక్షన్ వంటి అంశాల్లో భారతకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘టిప్కూ’ దేశంలోనే తొలి ఐపీ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అని పేర్కొన్నారు. ఇది ఇతర రాషా్ట్రలకూ ఆదర్శం కాగలదన్నారు. కాగా, అమెరికాలో తెలంగాణ విద్యార్థుల చదువుకు సులభంగా వీసా లభించేలా హైదరాబాద్‌లోని తమ కాన్సులేట్‌లోనే శిక్షణ ఇస్తామని వర్మ తెలిపారు. కస్టమ్స్ అధికారులకు సమర్పించాల్సిన పత్రాలపై అవగాహన కల్పిస్తామన్నారు. అప్పులుచేసి అమెరికా వెళ్లిన విద్యార్థులు వెనక్కు రావటంపై ఆవేదన వ్యక్తంచేశారు. కాగా, ‘‘వాతావరణం, విద్యుత్, పర్యావరణ అంశాల్లో భారత్ పాత్ర’’పై శుక్రవారం మాట్లాడుతూ పరిశుభ్ర ఇంధనం-సాంకేతికత-పర్యావరణం’ దిశగా రెండుదేశాలు సహకరించుకుంటాయని పేర్కొన్నారు. Quote
SANANTONIO Posted June 25, 2016 Report Posted June 25, 2016 eedi valle full admissions vachai...F1 visa lu ishtam vachinattu icharu ani talk.... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.